hyderabadupdates.com Gallery ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభిన‌వ ఊస‌రవెల్లి

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభిన‌వ ఊస‌రవెల్లి

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభిన‌వ ఊస‌రవెల్లి post thumbnail image

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె కేంద్ర స‌ర్కార్ ను, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దేశంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, కేవ‌లం స్వ‌ప్ర‌యోజ‌నాలకే పెద్ద‌పీట వేస్తున్నారంటూ ఆరోపించింది. ఇవాళ విజ‌య‌వాడ‌లో ష‌ర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. మహిళా బిల్లుపై రంగులు మార్చడంలో నరేంద్ర మోదీజీ అభినవ ఊసరవెల్లిగా మారి పోయాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ‌లు చేశారు. ⁠నారీ ముసుగులో డీ లిమిటేషన్ బిల్లు తెచ్చిన కపట సూత్రధారి అని ఆరోపించారు. ⁠ప్రతిపక్షాలపై ప్రధాని పెట్టేవి పెడబొబ్బలు త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. మహిళా శక్తిని అడ్డుకున్నారని బీజేపీ ముసలి కన్నీరు. కార్చ‌డం దారుణ‌మ‌న్నారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని పేర్కొన్నారు.
⁠33 శాతం రిజర్వేషన్ల అమలుకు అసలు ద్రోహి మోడీనేని వైఎస్ ష‌ర్మిలా రెడ్డి ఆరోపించారు. ⁠2023 లో ఆమోదం పొందిన బిల్లును అమలు చేయకుండా, మళ్లీ పార్లమెంట్ ముందుకు సవరణ బిల్లు తెచ్చి.. ⁠దానికి పునర్విభజనతో లింక్ పెట్ట‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. ⁠ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని బీద ఏడుపులు ఎందుకు ? మహిళలను మన్నించమని అడగడం ఎందుకు ?
⁠రాజకీయ స్వలాభం కోసం విపక్షం మీద శాపనార్థాలు పెట్టడం ఎందుకు ? అని నిల‌దీశారు. ప్రధాని మోడీ కి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే, ⁠మహిళల ఆత్మ గౌరవం మీద పట్టింపు ఉంటే నారీ శ‌క్తి వంద‌న అభియాన్ 2024 చ‌ట్టాన్ని వెంట‌నే అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు.
The post ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభిన‌వ ఊస‌రవెల్లి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఐపీఎల్ మ‌హా సంగ్రామం పోరాటానికి సిద్దంఐపీఎల్ మ‌హా సంగ్రామం పోరాటానికి సిద్దం

బెంగ‌ళూరు : ఐపీఎల్ 2026 మ‌హా సంగ్రామం మార్చి 28న శ‌నివారం బెంగళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తో త‌ల‌ప‌డ‌నుంది స‌న్ రైజ‌ర్స్ ఆఫ్ హైద‌రాబాద్. ఇరు జ‌ట్లు ఇటు

ఆసియాలో అత్యంత ధ‌న‌వంతుడిగా గౌత‌మ్ అదానీఆసియాలో అత్యంత ధ‌న‌వంతుడిగా గౌత‌మ్ అదానీ

ముంబై : ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త గౌత‌మ్ అదానీ అరుదైన ఘ‌న‌త సాధించారు. త‌ను మ‌రో వ్యాపార‌వేత్త ముఖేష్ అంబానీని అధిగమించారు. ఆసియా ఖండం లోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఇదిలా ఉండ‌గా గౌత‌మ్ అదానీ నికర సంపదలో వచ్చిన పెరుగుదల నేపథ్యంలో

తిల‌క్ వ‌ర్మ అన్ ఫిట్ టి20 మ్యాచ్ ల‌కు నో ఛాన్స్తిల‌క్ వ‌ర్మ అన్ ఫిట్ టి20 మ్యాచ్ ల‌కు నో ఛాన్స్

ముంబై : హైద‌రాబాద్ కు చెందిన తిల‌క్ వ‌ర్మ‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే ఓపెన‌ర్ గా ఛాన్స్ ఇచ్చినా కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంసన్ వ‌రుస‌గా న్యూజిలాండ్ తో జ‌రుగుతున్న టి20 సీరీస్ లో భాగంగా మూడు మ్యాచ్