hyderabadupdates.com movies మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన ముఖం, పెదాల రంగుల్లో వ్యత్యాసం కనిపించిందంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీలో సాయంత్రం సమయంలో తీసిన వీడియోలో ఒక విధంగా కనిపించిన మోదీ, తమిళనాడులోని కోయంబత్తూరులో మధ్యాహ్నం చిత్రీకరించిన మరో వీడియోలో భిన్నంగా కనిపిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. రెండు గంటల వ్యవధిలోనే ఈ మార్పు ఎలా సాధ్యమైందన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కొంతమంది నెటిజన్లు ఎండ తీవ్రత, వాతావరణ ప్రభావం కారణంగా చర్మం డార్క్‌గా కనిపించి ఉండొచ్చని అభిప్రాయపడుతుండగా, మరికొందరు పెదాల రంగు మార్పుపై కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

“స్థానికులకు దగ్గరగా కనిపించేందుకు మేకప్‌లో మార్పులు చేశారా?” అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై మీమ్స్, కామెంట్లతో సోషల్ మీడియాలో చర్చ మరింత వేడెక్కుతోంది. అయితే నిపుణులు మాత్రం ఈ వ్యత్యాసాలకు సహజ కారణాలే ఉన్నాయని చెబుతున్నారు.

లైటింగ్‌లో తేడాలు, కెమెరా సెట్టింగులు, షూటింగ్ సమయం, వాతావరణ పరిస్థితులు కలిపి వ్యక్తి రూపాన్ని వేరువేరుగా చూపించవచ్చని వివరిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సూర్యకాంతి, సాయంత్రం లైట్ మధ్య తేడా వల్ల చర్మం రంగు భిన్నంగా కనిపించడం సహజమని అంటున్నారు.

Related Post

Visakhapatnam Emerges as Andhra Pradesh Growth Engine Under Coalition GovernmentVisakhapatnam Emerges as Andhra Pradesh Growth Engine Under Coalition Government

After the coalition government assumed office, Visakhapatnam has rapidly transformed into a symbol of Andhra Pradesh’s new development vision. The coastal city is steadily evolving into a global urban hub,