hyderabadupdates.com movies దేవర 2 భవిష్యత్తు ఏంటి

దేవర 2 భవిష్యత్తు ఏంటి

బాలకృష్ణ – కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ పట్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. ఎందుకంటే స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసుకున్న దేవర 2 హఠాత్తుగా పక్కకు వెళ్లిపోవడం వాళ్లకు సుతరామూ ఇష్టం లేదు. ఎందుకంటే సీక్వెల్ లోనే అసలైన కథ ఉందని, ఫస్ట్ పార్ట్ కి పదింతల ఎలివేషన్లు అందులో ఉంటాయని వాళ్లకు లీక్ రావడమే.

సరే ఇప్పుడు దేవర 2 నిజంగా ఉంటుందా లేదానే ప్రశ్నకు వద్దాం. తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) లో తలమునకలై ఉన్నాడు. కాకపోతే షూటింగ్ సవ్యంగా జరగడం లేదు. రకరకాల కారణాలు స్పీడ్ కు అడ్డం పడుతున్నాయి. అందుకే ఏ గొడవా లేకుండా రిలీజ్ డేట్ ఏకంగా ఏడాది వాయిదా వేసి 2027 జూన్ 11 లాక్ చేశారు. సో చాలా టైం ఉంది. అసలు టోవినో థామస్ వదులుకున్న పాత్రకు ఇంకా ఆర్టిస్ట్ రీ ప్లేస్ మెంట్ జరగలేదు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం డ్రాగన్ రెండు భాగాల్లో రూపొందుతోంది. సలార్, కెజిఎఫ్ లా కాకుండా ప్రశాంత్ నీల్ ఈసారి దురంధర్ ఫార్ములా వాడుకున్నారని సమాచారం. అంటే సమాంతరంగా రెండూ తీసేసి అతి తక్కువ గ్యాప్ లో విడుదల చేయడం. దానికి అనుగుణంగానే షెడ్యూల్స్ వేసి ఆర్టిస్టుల డేట్స్ తీసుకుంటున్నారని తెలిసింది. ఇది నిజమైన పక్షంలో జూనియర్ ఎన్టీఆర్ అటుఇటు ఇంకో రెండేళ్ల పాటు అందుబాటులోకి రాడు. సో ఆశలు పెట్టుకోవడానికి లేదు.

అలాంటప్పుడు దేవర 2 ఇప్పుడప్పుడే జరిగే పని కాదు. ఎలాగూ బాలయ్య మూవీని కొరటాల ఆరు నెలల్లో పూర్తి చేసి సంక్రాంతి బరిలో పెట్టొచ్చు. ఒకవేళ కొంచెం ఆలస్యమైనా సమ్మర్ సీజన్ ఫిక్స్. తర్వాత దేవర 2 మీద ఫోకస్ పెంచాలి. కానీ తారక్ నిజంగా దేవర 2 మీద సీరియస్ గా ఉన్నాడా అనేది వేయి డాలర్ల ప్రశ్న. మే 20 తన పుట్టినరోజు వస్తుంది. ఒకవేళ ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి కనక రెండో దేవర అప్డేట్ రాలేదంటే మాత్రం ఇప్పుడప్పుడే ఉండదని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. చూద్దాం మరి.

Related Post

నంది అవార్డులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్నంది అవార్డులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

నంది అవార్డులు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంత ప్రతిష్టాత్మకంగా ఉండేవో ముందు తరం వారికి బాగా తెలుసు. ఈ అవార్డును అందుకోవడాన్ని గొప్ప గౌరవంగా భావించేవారు సినీ జనాలు. సినిమాలతో పాటు టీవీ, నాటక రంగాలకు కూడా నందులు ఇచ్చి గౌరవించేవి అప్పటి ప్రభుత్వాలు.

Kalyani Priyadarshan to collaborate with this Tamil star hero & director again?Kalyani Priyadarshan to collaborate with this Tamil star hero & director again?

Malayalam actress Kalyani Priyadarshan is fresh off the success of Lokah: Chapter 1 which is set to arrive on OTT this weekend. The actress’s glamorous song from her new Tamil