hyderabadupdates.com movies లెనిన్ అసలు సమస్య పెద్ది కాదు

లెనిన్ అసలు సమస్య పెద్ది కాదు

జూన్ 26 లెనిన్ విడుదల కావాలి. గతంలో మే 1 ఫిక్స్ చేసుకున్న డేట్ ని పెద్ది కోసం త్యాగం చేశామంటూ నిర్మాణ సంస్థ ప్రకటన ఇవ్వడం అక్కినేని అభిమానుల అసంతృప్తికి కారణమయ్యింది. ఫైనల్ కాపీ సిద్ధంగా ఉన్న రేంజ్ లో ఆర్భాటం చేసి రెండు నెలలు ఆలస్యంగా ఎందుకు రిలీజ్ చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. అయితే పెద్ది ఏప్రిల్ 30 నుంచి తప్పుకుని జూన్ కి రావడం, ఇప్పుడు అదే నెల 25 వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం ఊపందుకోవడం అసలు ట్విస్ట్.

మరి ఇప్పుడు లెనిన్ మళ్ళీ త్యాగం చేస్తుందా అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అంతర్గత సమాచారం ప్రకారం లెనిన్ షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. రషెస్ చూసిన నాగార్జున కొంత భాగాన్ని రీ షూట్ చేయమని సలహా ఇచ్చారని, ఆమేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే పుకారు ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది. ఇది నిజమో కాదో కానీ లెనిన్ రాక మీద అయోమయం ఇంకా కొనసాగనుంది. ముందైతే పెద్ది కొత్త డేట్ అఫీషియల్ అయితే కొన్ని మబ్బులు తొలగుతాయి.

లెనిన్ ని అన్నపూర్ణ, సితార సంస్థలు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాయి. దర్శకుడు మురళికిషోర్ అబ్బూరుకి ఇంత పెద్ద ప్రాజెక్టు హ్యాండిల్ చేసిన అనుభవం లేకపోయినా కథ మీద నమ్మకంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అఖిల్ బాధ్యతను అప్పజెప్పారు. హీరోయిన్ శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ బోర్సేని తీసుకుంటే అదనపు భారమవుతుందని తెలిసినా సరేనన్నారు. ఇంతా చేసి అనుకున్న టైంకి షూట్ అవ్వకపోవడంతో అవసరం లేని కన్ఫ్యూజన్ తెరమీదకు వస్తోంది.

వీలైనంత త్వరగా నిర్మాత నాగవంశీ వీటికి చెక్ పెడితే బెటర్. జూన్ 26కి లెనిన్ కట్టుబడుతుందా లేదా అనేది పెద్ది మీద ఆధారపడి ఉంటుంది. దాంతో క్లాష్ అవ్వాలని అఖిల్, నాగార్జున ఎంతమాత్రం కోరుకోరు. పైగా పెద్ది మీద ఉన్న బజ్ ఆకాశాన్ని హద్దుగా పెట్టుకుంది. తలపెడితే ఎవరికైనా రిస్క్ అనిపించేలా హైప్ పెరుగుతూ పోతోంది. ఒకవేళ పెద్ది కనక జూన్ 25 ఫిక్స్ అయితే అప్పుడు లెనిన్ త్వరగా రావడమో జూలైకి వెళ్లిపోవడమో జరుగుతుంది.

Related Post

₹1,340 Crore Blockbuster Smashes OTT Records in Just Three Weeks₹1,340 Crore Blockbuster Smashes OTT Records in Just Three Weeks

Ranveer Singh’s blockbuster Dhurandhar, which created history at the box office with a worldwide gross of over ₹1,340 crore, is now setting new benchmarks on OTT. After completing a sensational