hyderabadupdates.com movies టీడీపీలో వీళ్ల కొర‌త వేధిస్తోందా…?

టీడీపీలో వీళ్ల కొర‌త వేధిస్తోందా…?

టిడిపి తరఫున బలమైన గళం వినిపించే వారి కోసం పార్టీలో వెతుకుతున్నారు. వివాదరహితంగా పార్టీ పరంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అదేవిధంగా పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రచారం చేసే వారి కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల కొంతమంది కార్యకర్తలను ఎంపిక చేశారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. వీరి ప్రధాన లక్ష్యం పార్టీ పరంగా బలమైన వాయిస్ వినిపించాలి. ప్రజల్లోకి వెళ్లాలి. వ్యక్తిగతంగా వారు వెళ్లడం కాదు వారి వాయిస్ బలంగా ప్రజల్లోకి వెళ్లాలి.

పార్టీ తరఫున చేపడుతున్న కార్యక్రమాలు రూపకల్పన చేయాలి. ఇవి షార్ప్ గా ప్రజలను చేరాలి. అనేది చంద్రబాబు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ఆలోచన. వచ్చే ఏడాది నాటికి వైసిపి తరఫున జగన్ పాదయాత్ర ప్రారంభించ‌నున్న నేపథ్యంలో ఈ లోగానే పార్టీ పరంగా మరింత పుంజుకోవాలి అన్నది పార్టీ లక్ష్యం. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో మండల, గ్రామీణ స్థాయిలో పార్టీని డెవలప్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ తరఫున ప్రచారం చేసే నాయకులతోపాటు బలమైన వాయిస్‌ ఉన్న వారికి కోసం పార్టీ అన్వేషిస్తుంది.

ఈ క్రమంలో ఇటీవల నలుగురిని ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు ఇద్దరు చొప్పున మొత్తం 50 మందికి పైగా కార్యకర్తలను కేవలం బలమైన గళం వినిపించే వారిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అదేవిధంగా చంద్రబాబు చేస్తున్న ప్రసంగాల్లోని కీలక అంశాలను ఎలివేట్ చేయడం ద్వారా ప్రజల్లోకి పాజిటివ్ తీసుకెళ్లాలని టిడిపి భావిస్తోంది. దీనికి సంబంధించి పార్టీపరంగా కొంతమంది కార్యకర్తలను కూడా ఎంపిక చేశారు.

అదే సమయంలో నాయకులను కూడా ఎంపిక‌ చేస్తున్నారు. అయినా మరింత బలంగా పార్టీ తరఫున వాయిస్ వినిపించే వారి కోసం టిడిపి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇది సక్సెస్ అయితే వైసిపి కి బలమైన కౌంటర్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న వారిలో బ‌ల‌మైన గ‌ళం వినిపించే వారుఉన్నా.. కొత్త ద‌నానికి.. నాణ్య‌త‌కు.. మ‌రింత పెద్ద పీట వేయాల‌ని యోచిస్తున్నారు. సో.. వీరిని ఎంపిక చేయ‌డం ద్వారా.. పార్టీని ఒక రేంజ్‌లో దూసుకుపోయేలా చేయాల‌ని భ‌విస్తున్నారు.

Related Post

పొలిటికల్ చిచ్చు రాజేసిన ఈటల మాటలుపొలిటికల్ చిచ్చు రాజేసిన ఈటల మాటలు

బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఏ పార్టీలో ఉండాలో.. ఏ పార్టీ త‌ర‌ఫున ప‌నిచేయాలో ప్ర‌జ‌లే తేల్చుకుంటార‌ని అన్నారు. ప్ర‌స్తుతం త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారం విష‌యాన్ని బీజేపీ హైక‌మాండ్ చూసుకుంటుందన్నారు. త‌న‌పై వ‌స్తున్న