hyderabadupdates.com movies ర‌కుల్ ముందే మాజీ ప్రేయ‌సికి ఫోన్ చేసి..

ర‌కుల్ ముందే మాజీ ప్రేయ‌సికి ఫోన్ చేసి..

తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ కెరీర్ మంచి ఊపులో ఉండ‌గానే.. బాలీవుడ్ నిర్మాత జాకీ భ‌గ్నానితో ప్రేమ‌లో ప‌డ‌డ‌మే కాక‌.. కొన్నేళ్ల‌ను అత‌ణ్ని పెళ్లి కూడా చేసుకుంది స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్. రెండేళ్లుగా వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతోంది. పెళ్లి త‌ర్వాత కూడా గ్లామ‌ర్ రోల్స్ చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది ర‌కుల్.

మ‌రోవైపు జాకీ త‌న ఇష్ట‌ప్ర‌కారం ప్రొడ‌క్షన్ చేసుకుంటున్నాడు. త‌మ ఇద్ద‌రి మ‌ధ్య ఎంత అండ‌ర్‌స్టాండింగ్ ఉందో చెబుతూ తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో ర‌కుల్, జాకీ క‌లిసి వెల్ల‌డించిన విష‌యం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ర‌కుల్ ముందే జాకీ.. త‌న మాజీ ప్రేయ‌సితో మాట్లాడ‌తాడ‌ట‌. ఇదే కాక త‌మ మ‌ధ్య ఎలాంటి దాప‌రికాలు ఉండ‌వంటూ వాళ్లిద్ద‌రూ చెప్పుకున్నారు.

తాను, ర‌కుల్ పెళ్ల‌యిన త‌ర్వాత కూడా ఎవ‌రికి న‌చ్చిన‌ట్లు వాళ్లు ఉంటున్నామ‌ని జాకీ ఈ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తాము ఒక‌రికి ఒక‌రం ఎక్స్‌క్లూజివ్ అని.. అలా అని వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రికి న‌చ్చిన‌ట్లు వాళ్లు బ‌తికే, కెరీర్ల‌లో ముందుకు సాగే స్వేచ్ఛ ప‌ర‌స్ప‌రం తాము ఇచ్చుకుంటామ‌ని అత‌ను చెప్పాడు.

తాను ర‌కుల్ ముందే త‌న మాజీ గర్ల్‌ఫ్రెండ్‌కు ఫోన్ చేసి స్పీక‌ర్ పెట్టి మ‌రీ మాట్లాడ‌తాన‌ని.. త‌న భార్య ఈ విష‌యంలో ఎలాంటి అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌ద‌ని.. త‌న వ్య‌క్తిగ‌త‌, ప్రొఫెష‌న‌ల్ విష‌యాల్లోనూ తాను అంతే స్వేచ్ఛ‌ను ఇస్తాన‌ని జాకీ చెప్పాడు. ర‌కుల్ కూడా ఔనంటూ అత‌డి మాట‌ల‌తో అంగీక‌రించింది.

జాకీ ప్ర‌ముఖ నిర్మాత వ‌శు భ‌గ్నాని త‌న‌యుడు. వీరి సంస్థ పూజా ఎంటర్టైన్మెంట్స్ బాలీవుడ్లో ఎన్నో భారీ చిత్రాల‌ను నిర్మించింది. కానీ ఈ మ‌ధ్య ఈ సంస్థ‌కు క‌లిసి రావ‌డం లేదు. వరుసగా ఫ్లాపులు ఎదురవుతున్నాయి. అందులోనూ రెండేళ్ల ముందు పూజా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన ‘బడేమియా చోటేమియా’ ఆ సంస్థ పునాదులను కదిలించేసింది.

అక్షయ్ కుమార్-టైగర్ ష్రాఫ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాపై రూ.350 కోట్ల బడ్జెట్ పెడితే అందులో మూడో వంతు కూడా వెనక్కి రాలేదు. ఈ సినిమా దెబ్బకు భగ్నాని ఫ్యామిలీ ఆఫీసులు మూసేయడం, ఆస్తులు తనఖా పెట్టుకోవడం వరకు వెళ్లిందని వార్తలు వచ్చాయి.

Related Post