hyderabadupdates.com movies సింపుల్ మాట… థాంక్స్ డార్లింగ్

సింపుల్ మాట… థాంక్స్ డార్లింగ్

తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్లు ఈ వారం డార్లింగ్ పుణ్యమాని కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. రీ రిలీజుల ట్రెండ్ తగ్గిపోతుందనుకుంటున్న టైంలో ఒక్కసారిగా మళ్ళీ ఊపందుకుంది. గత పది రోజుల నుంచి బాక్సాఫీస్ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. లాస్ట్ వీక్ వచ్చిన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ నాలుగో రోజుకే సెలవు తీసుకోగా బ్యాడ్ బాయ్ కార్తీక్ దారుణంగా పోయింది. మొదటి రెండు సినిమాలు ఎంత ప్రమోషన్లు చేసినా లాభం లేకపోయింది.

తాజాగా వచ్చిన మలయాళ డబ్బింగ్ ‘వాలా 2’కి హైదరాబాద్ లాంటి నగరాలు మినహాయించి బయట ఏమంత ఆశాజనకంగా లేదు. రఘు కుంచె టైటిల్ రోల్ పోషించిన ‘గేదెల రాజు కాకినాడ తాలూకా’ అసలు వచ్చిందనే సంగతే జనాలకు రిజిస్టర్ కాలేదు. ఇంకో రెండు మూడు కొత్త రిలీజుల గురించి మాట్లాడుకోకపోవడమే ఉత్తమం. ఇంత డ్రై వాతావరణంలో హౌస్ ఫుల్స్ కనిపించాయంటే దానికి కారణం డార్లింగే. సంవత్సరాలుగా పెరిగిన వింటేజ్ ఫాలోయింగ్ దీనికి దోహదపడింది.

ఇదే జోరు వీకెండ్ దాకా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిస్టిబ్యూటర్ ఏకంగా తొమ్మిది కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని పోస్టర్లు వేసుకున్నారు కానీ భారీ మొత్తం వచ్చిన మాట వాస్తవమే కానీ అంత నెంబర్ కాదనేది పంపిణివర్గాల మాట. రీ రిలీజ్ వ్యవహారం కాబట్టి వసూళ్ల గురించి మరీ ఎక్కువ బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే డార్లింగ్ మూడో రోజు కూడా గంటల ప్రకారం బుక్ మై షోలో ట్రెండింగ్ కొనసాగించడం విశేషం,

కాసేపు డార్లింగ్ ముచ్చటని పక్కనపెడితే నిర్మాతలు ఈ పరిణామాలను సీరియస్ గా విశ్లేషించుకోవాలి. మినిమమ్ కంటెంట్ ఇవ్వడంలో వైఫల్యం చెందడం వల్లే కొత్త సినిమాలకు జనం కరువవుతున్నారు. ఇంట్లో తాపీగా చూడాల్సిన వాటికి టికెట్లు కొని మరీ పరుగులు పెడుతున్నారు. ఇంత మంచి వేసవి సీజన్ లో స్టార్ హీరోలు రాకపోవడం, వాయిదాల పర్వంలో మీడియం బడ్జెట్ మూవీస్ కూడా నలిగిపోవడం ఈ పరిస్థితికి కారణం. ఎప్పటికి మేలుకుంటారో చూడాలి.

Related Post

ఎంజీఆర్ దేవుడు.. క్షమించండి – రాజేంద్ర ప్రసాద్ఎంజీఆర్ దేవుడు.. క్షమించండి – రాజేంద్ర ప్రసాద్

స్టేజ్ మీద నోరు జారడం.. ఆపై క్షమాపణ చెప్పడం.. ఈ మధ్య ఫిలిం సెలబ్రిటీలకు మాములు అయిపోయింది. టాలీవుడ్ లెజెండరీ నటుడు రాజేంద్ర ప్రసాద్.. గత రెండేళ్లలో చాలాసార్లు ఇలా అదుపు తప్పి మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో క్షమాపణలు కూడా చెప్పారు.

Satya Dev’s SD15 pooja ceremony: Begins with Anil Ravipudi ceremonial clapSatya Dev’s SD15 pooja ceremony: Begins with Anil Ravipudi ceremonial clap

The fresh pairing of Satyadev and Faria Abdullah has already generated interest among film enthusiasts. They are coming together for the first time in this yet-untitled entertainer, tentatively titled “SD15.”

తెలివైన ఎత్తుగడ వేసిన ప్యారడైజ్తెలివైన ఎత్తుగడ వేసిన ప్యారడైజ్

ఎట్టకేలకు న్యాచురల్ స్టార్ నాని అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ముందు ప్రకటించిన మార్చి 26 సాధ్యం కాదని గత రెండు నెలలుగా గట్టిగా వినిపిస్తున్నప్పటికీ టీమ్ నుంచి ఎలాంటి సౌండ్ లేకపోవడంతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ వచ్చారు. రామ్