hyderabadupdates.com Gallery దిగొచ్చిన ప్ర‌భుత్వం ఆర్టీసీ కార్మికుల విజ‌యం

దిగొచ్చిన ప్ర‌భుత్వం ఆర్టీసీ కార్మికుల విజ‌యం

దిగొచ్చిన ప్ర‌భుత్వం ఆర్టీసీ కార్మికుల విజ‌యం post thumbnail image

హైద‌రాబాద్ : ఒక‌రి బ‌లిదానం చివ‌ర‌కు త‌ల వంచేలా చేసింది తెలంగాణ రేవంత్ రెడ్డి స‌ర్కార్ ను. నిన్న‌టి దాకా స‌మ్మె నోటీసు ఇచ్చినా , 32 డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరినా ప‌ట్టించుకోలేదు . అటు సీఎం కానీ ఇటు మంత్రులు కానీ త‌మ ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. మ‌రో వైపు సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి పోలీస్ శాఖ నుంచి వ‌చ్చిన వారు కావ‌డంతో ఏకంగా స‌మ్మె చ‌ట్ట విరుద్ద‌మ‌ని, మానుకోక పోతే చ‌ర్య‌లు తప్ప‌వంటూ హెచ్చ‌రించారు. ఆఖ‌రుకు వికారాబాద్ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహంతో ఆర్టీసీ కార్మికుల స‌మ్మెకు సంబంధించి టెంట్లు య‌జ‌మానులు షామియానాలు ఇవ్వ‌వ‌ద్దంటూ ఓ ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు. ఏకంగా న‌ర్సంపేట డిపోకు చెందిన డ్రైవ‌ర్ శంక‌ర్ గౌడ్ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. ప‌రిస్థితి విష‌మించ‌డంతో గ‌త్యంత‌రం లేక స‌ర్కార్ దిగివ‌చ్చింది. ఆర్టీసీ జేఏసీ నేత‌ల‌తో స‌మావేశం అయ్యింది.
గ‌తంలో సీఎం కేసీఆర్ హ‌యాంలో ఆర్టీసీ కార్మికుల‌ను ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు శాస‌న స‌భ‌లో తీర్మానం కూడా చేశారు. కానీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన కాంగ్రెస్ స‌ర్కార్ త‌మ మేనిఫెస్టో లో స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చింది. కానీ దానిని నెర‌వేర్చ‌కుండా లోపాయికారిగా ఆర్టీసీ సంస్థ‌ను ప్రైవేటీక‌ర‌ణ చేసేందుకు పావులు క‌దిపింది. దీంతో సంస్థ‌ను గంప‌గుత్త‌గా అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని ఆర్టీసీ కార్మికులు గుర్తించారు. త‌మ ఉనికికే ప్ర‌మాదం ఏర్ప‌డింద‌ని ఆందోళ‌న బాట ప‌ట్టారు. నిర‌వ‌ధిక స‌మ్మెకు పిలుపునిచ్చారు. చివ‌ర‌కు సర్కార్ ఒప్పుకోవ‌డంతో స‌మ్మెను విర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు జేఏసీ నేత‌లు.
The post దిగొచ్చిన ప్ర‌భుత్వం ఆర్టీసీ కార్మికుల విజ‌యం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Pakistan: 14 మందిని సిక్కులను వెనక్కి పంపేసిన పాక్Pakistan: 14 మందిని సిక్కులను వెనక్కి పంపేసిన పాక్

    సిక్కుల గురువు గురునానక్ దేవ్ 556వ జయంతి సందర్భంగా అట్టారి-వాగా సరిహద్దు వద్ద 14 మందికి పైగా యాత్రికులకు ప్రవేశాన్ని పాకిస్థాన్ నిరాకరించింది. యాత్రికుల హిందూ మత విశ్వాసాలను కారణంగా చూపుతూ పాకిస్థాన్ ఇమిగ్రేషన్ అధికారులు వారిని వెనక్కి

జీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలిజీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలి

అమ‌రావ‌తి :తీర ప్రాంత రక్షణకు, ప్రకృతి వైపరీత్యాల నుంచి నష్ట నివారణకు మడ అడవులు చాలా కీలకం. మడ అడవుల్లో జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలోనే రోల్ మోడల్ గా నిలవాలని పిలుపునిచ్చారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్

Election Commission: తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌-2Election Commission: తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌-2

Election Commission : ఓటరు జాబితాల ‘ప్రత్యేక ముమ్మర సవరణ’ (ఎస్‌ఐఆర్‌) రెండోదశను తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) చేపట్టనుంది. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ ప్రకటించారు. గోవా, ఛత్తీస్‌గఢ్,