hyderabadupdates.com movies పజిల్ ప్రశ్న – వీళ్ళిద్దరికే ఎలా సాధ్యమవుతోంది

పజిల్ ప్రశ్న – వీళ్ళిద్దరికే ఎలా సాధ్యమవుతోంది

ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి నటించాలంటే దాని వెనుక ఎన్నో లెక్కలు, ఈగోలు, బాలన్సులు, బడ్జెట్ లు ఉంటాయి. రాజమౌళి కాబట్టి ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ని కలిపాడు కానీ లేదంటే ఈ కాంబో వేరే దర్శకుడికి అసాధ్యం అన్నది ఓపెన్ ఫాక్ట్. ఆ మాటను వాళ్ళే ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు కూడా. క్యామియోలు పక్కనపెడితే స్వంత అన్నదమ్ములైన చిరంజీవి, పవన్ కళ్యాణ్ మూడు దశాబ్దాల్లో ఒక్క ఫుల్ లెన్త్ మూవీ చేయలేదు. బాబాయ్ అబ్బాయి బాలయ్య, తారక్ కాంబో ఊహాలకే పరిమితమయ్యింది. అక్కినేని చివరి కోరిక పుణ్యమాని నాగార్జున, చైతుని ఒకే ఫ్రేమ్, ఒకే సినిమాలో చూడగలిగాం.

అందుకే మల్టీస్టారర్స్ రాసేందుకు మన దర్శక రచయితలు తటపటాయిస్తారు. కానీ అదేంటో మలయాళంలో ఇవి చాలా తేలిగ్గా జరిగిపోతాయి. మల్లువుడ్ టాప్ సీనియర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటించిన పేట్రియాట్ ఎప్పుడు షూటింగ్ జరుపుకుందో కానీ రిలీజ్ కు రెడీ అయిపోయింది. వీళ్ళున్నారు కదాని ఆషామాషీ క్యాస్టింగ్ ని పెట్టలేదు. నయనతార, ఫహద్ ఫాసిల్, కుంచక్ బోబన్, రేవతి తదితరులతో పెద్ద సెటప్ పెట్టారు. దేశభక్తి, దేశద్రోహం బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు మహేష్ నారాయణన్ దీన్ని రూపొందించారు. టీజర్ విజువల్స్ గట్రా చూస్తుంటే ఇంటరెస్టింగ్ గా అనిపిస్తోంది.

మమ్ముట్టి, మోహన్ లాల్ ఈ మధ్య కలిసి నటించలేదు కానీ తొంబై దశకంలో చాలా సినిమాలు చేశారు. నెంబర్ ట్వంటీ మద్రాస్ మెయిల్ లాంటివి తెలుగులో కూడా మంచి విజయం సాధించాయి. ఇక పజిల్ ప్రశ్న అనే హెడ్డింగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆరు పదుల వయసు దాటినా కూడా మమ్ముట్టి, మోహన్ లాల్ ఇప్పటికీ ఏడాదికి నాలుగైదు సినిమాలు ఎలా చేస్తున్నారని. తుడరమ్ లాంటి ఫ్యామిలీ సినిమా, ఎల్2 ఎంపురాన్ లాంటి ప్యాన్ ఇండియా మూవీ రెండు నెలల గ్యాప్ లో రిలీజ్ చేయడం ఎవరి వల్ల సాధ్యం. అందుకే నాలుగు వందలకు పైగా సినిమాల్లో నటించినా ఒళ్ళంతా రెడ్ బుల్ ప్రవహిస్తున్నట్టు వీళ్ళింకా యవ్వనంలోనే ఉన్నారు.

Related Post