hyderabadupdates.com movies భగత్ సింగ్ రేట్లకు రెక్కలు వస్తున్నాయి

భగత్ సింగ్ రేట్లకు రెక్కలు వస్తున్నాయి

పవన్ కళ్యాణ్ ఓజితో సూపర్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఫైనల్ స్టేటస్ తేలడానికి టైం పడుతుంది కానీ హరిహర వీరమల్లు చేసిన గాయమైతే మానిపోయింది. ఎన్నడూ లేనిది పవన్ తాను ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిననే సంగతి మర్చిపోయి మరీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాలు పంచుకున్నారు. సినిమాల పరంగా ఆయన ఇంత ఆనందంగా ఉండటం ఈ మధ్యకాలంలో చూడలేదని సన్నిహితులు అంటున్నారు. ఒకవేళ ఓజి కనక ఫ్లాప్ అయ్యుంటే ఇక మేకప్ కి దూరంగా ఉండేవారేమో కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని వాళ్ళ మాట. ఇక నెక్స్ట్ అందరి చూపు ఉస్తాద్ మీద వెళ్తోంది.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఓజి పుణ్యమాని ఉస్తాద్ భగత్ సింగ్ కోసం అప్పుడే బిజినెస్ ఎంక్వయిరీలు మొదలయ్యాయట. ఇంకా విడుదల కన్ఫర్మ్ చేయకపోయినా అడ్వాన్సులు ఇచ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లు రెడీగా ఉన్నారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడప్పుడే తొందరపడే ఉద్దేశంలో లేరు. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన ప్రాపర్ ప్రమోషన్లు ఇంకా మొదలుపెట్టలేదు. దర్శకుడు హరీష్ శంకర్ పవన్ పార్ట్ పూర్తి చేసినప్పటికీ మిగిలిన ప్యాచ్ వర్కులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వేగవంతం చేయాలి. డిసెంబర్ లోగా ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని సమాచారం.

ఓజి రూపంలో పవన్ స్టామినా ఏంటో బయట పడింది కాబట్టి అది ఉస్తాద్ భగత్ సింగ్ కు ఖచ్చితంగా ఉపయోపడుతుంది. కాకపోతే ఓజి స్థాయిలో దీని మీద బజ్ లేదు. దాన్ని కొత్తగా క్రియేట్ చేయాలి. తేరి రీమేకనే ప్రచారంలో మొదట్లో ఏదైతే జరిగిందో దాన్ని పూర్తిగా మర్చిపోయేలా పబ్లిసిటీ జరగాలి. దానికి హరీష్ శంకర్ దగ్గర ఒక ప్లాన్ ఉందట. అమలు చేయాలంటే ముందు విడుదల తేదీ లాక్ చేసుకోవాలి. 2026 మార్చి చివర్లో పెద్ది ఉంది కాబట్టి ఆ స్లాట్ మినహాయించి విశ్వంభరతో క్లాష్ రాకుండా ఏదైనా మంచి డేట్ కోసం టీమ్ చర్చలు జరుగుతోంది. బహుశా దీపావళిలోగా ఒక కంక్లూజన్ వస్తే పోస్టర్ లేదా టీజర్ వదులుతారు.

Related Post

ఒకరి నిర్లక్ష్యం… రాజా సాబ్ ఆలస్యంఒకరి నిర్లక్ష్యం… రాజా సాబ్ ఆలస్యం

మొన్న ఏప్రిల్ కే రావాల్సిన ది రాజా సాబ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఫైనల్ గా జనవరి 9 లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్నా ఇంత లేట్ అవ్వడం వెనుక కారణం ఏమిటనే సందేహం

Much-awaited Baahubali The Epic’s trailer out now & it’s stunningMuch-awaited Baahubali The Epic’s trailer out now & it’s stunning

Telugu cinema can be defined as before Baahubali and after Baahubali. Before the mega spectacle, Tollywood was viewed as a regional industry, but Rajamouli’s directorial headlined by Prabhas changed the