hyderabadupdates.com movies మళ్లీ ‘సీరియస్’గా శ్రీ విష్ణు

మళ్లీ ‘సీరియస్’గా శ్రీ విష్ణు

యువ కథానాయకుడు శ్రీ విష్ణు కెరీర్ ఆరంభంలో ఎక్కువగా సీరియస్ సినిమాలే చేసేవాడు. కొంచెం ముభావంగా, సీరియస్‌గా కనిపించే అతడికి ఆ తరహా పాత్రలే సూటవుతాయి అనిపించేది. అప్పట్లో ఒకడుండేవాడు, నీదీ నాది ఒకే కథ లాంటి చిత్రాల్లో సీరియస్‌ పాత్రలు చేసి మెప్పించాడు శ్రీ విష్ణు. ఐతే తర్వాత తన ఇమేజ్ మారిపోయింది. 

బ్రోచేవారెవరురా, సామజవరగమన, శ్వాగ్, సింగిల్ లాంటి కామెడీ చిత్రాలతో అతను ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. వీటి కంటే ముందు అతను చేసిన సీరియస్ సినిమాలన్నీ తేడా కొట్టాయి. అర్జున ఫల్గుణ, అల్లూరి లంటి సినిమాల తర్వాత ఇక సీరియస్ సినిమాలు చేస్తే వర్కవుట్ కావేమో అన్నట్లుగా వరుసగా ఎంటర్టైనర్లే చేశాడు శ్రీ విష్ణు. ఐతే ఇప్పుడు ఈ యంగ్ హీరో మళ్లీ ‘సీరియస్’ బాట పడుతున్నాడు.

‘కామ్రేడ్ కళ్యాణ్’ పేరుతో శ్రీ విష్ణు కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. జానకిరామ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. నిర్మాణ సంస్థ కూడా కొత్తదే. కోన వెంకట్ సమర్పణలో వెంకటకృష్ణ, సీత అనే డెబ్యూ ప్రొడ్యూసర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీ విష్ణు నక్సలైట్ పాత్ర చేస్తున్నాడు. 1992లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మాడుగుల అనే ప్రాంతంలో జరిగే కథ ఇది. ఇందులో శ్రీ విష్ణు ద్విపాత్రాభినయం కూడా చేస్తున్నాడట. 

ఐతే నక్సలైట్ కథలకు ఈ మధ్య గిరాకి బాగా తగ్గిపోయింది. వాటిని ఎంత బాగా తీసినా.. ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా ఎక్కట్లేదు. ‘విరాటపర్వం’ లాంటి మంచి సినిమాకు ఎలాంటి ఫలితం దక్కిందో తెలిసిందే. మరి కథ పరంగా ఇప్పుడు ట్రెండు కాదని తెలిసినా, సీరియస్ సినిమాలు తనకు ప్రతికూల ఫలితాలు అందిస్తున్నా శ్రీ విష్ణు రిస్క్ చేస్తున్నాడంటే ఆ కథలో ఏదో విశేషం ఉండి ఉండాలి. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ అయితే ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. మరి ఈ సినిమా శ్రీ విష్ణుకు ఎలాంటి ఫలితాన్నందిస్తుందో చూడాలి.

Related Post