hyderabadupdates.com movies తెలుగు కమెడియన్ ట్వీట్లు.. రచ్చ రచ్చ

తెలుగు కమెడియన్ ట్వీట్లు.. రచ్చ రచ్చ

‘అర్జున్ రెడ్డి’తో మంచి పేరు సంపాదించి టాలీవుడ్ స్టార్ కమెడియన్లలో ఒకడిగా ఎదిగిన రాహుల్ రామకృష్ణ.. ఎక్స్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటూ అప్పుడప్పుడూ సామాజిక, రాజకీయ అంశాల మీద అప్పుడప్పుడూ హాట్ హాట్ పోస్టులు పెడుతుంటాడు. అందులో కొన్ని తీవ్ర వివాదం రేపుతుంటాయి కూడా. ఇప్పుడు అలాంటి ట్వీట్లతోనే రాహుల్ రామకృష్ణ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. 

తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఘాటు విమర్శలు చేస్తూ.. మళ్లీ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేసీఆర్ రావాలి అంటూ అతను పోస్టు పెట్టడం పెద్ద దుమారమే రేపింది. రాజకీయాల్లో లేని ఒక నటుడు ఇలాంటి పోస్ట్ పెట్టడం అరుదైన విషయమే. దీంతో పాటుగా గాంధీ జయంతి రోజు గాంధీకి వ్యతిరేకంగా కూడా అతనో పోస్టు పెట్టాడు. అది కూడా తీవ్ర వివాదాస్పదం అయింది. ఐతే కొన్ని గంటల్లోనే రాహుల్ ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ అయిపోవడం గమనార్హం.

ముందుగా ‘‘హైదరాబాద్ మునిగిపోయింది. మీ హామీలన్నీ విఫలమయ్యాయి. అన్నీ చక్కదిద్దడం కోసం జనాలు కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారు’’ అని ఒక పోస్టు పెట్టాడు. తర్వాత ‘‘మనం దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం. మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం’’ అని మరో పోస్టు పెట్టి.. ‘‘నన్ను చంపేస్తారా చంపేయండి. జరుగుతున్న పరిణామాలతో అలసిపోయాను’’ అని కామెంట్ జోడించాడు రాహుల్. 

మరోవైపు గాంధీజయంతి సందర్భంగా గాంధీ గురించి మాట్లాడుతూ.. ఆయన సాధువు కాదని, మహాత్ముడు కాదని నొక్కి వక్కాణించాడు రాహుల్. ఈ పోస్టులు తీవ్ర దుమారానికి దారి తీశాయి. కాంగ్రెస్ వాళ్లు, గాంధీ అభిమానులు రాహుల్‌పై విరుచుకుపడ్డారు. కొన్ని గంటల్లో రాహుల్ ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ అయిపోయింది. తన అకౌంటును ఎవరో హ్యాక్ చేశారంటూ రాహుల్ చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ వాళ్లు అతణ్ని బెదిరించి అకౌంట్ డీయాక్టివేట్ చేసుకునేలా చేసినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇందులో ఏది వాస్తవమో తెలియాల్సి ఉంది.

Related Post

Warzone’s Next Chapter: Black Ops 7 Ushers in New Haven’s Hollow Map & Verdansk Updates
Warzone’s Next Chapter: Black Ops 7 Ushers in New Haven’s Hollow Map & Verdansk Updates

When Warzone first dropped players into Verdansk in 2020, it redefined the battle royale landscape with Call of Duty’s trademark intensity. Since then, the mode has cycled through maps, mechanics,

కొండా దంప‌తుల‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. చ‌ర్చ‌లు స‌మాప్తం!కొండా దంప‌తుల‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. చ‌ర్చ‌లు స‌మాప్తం!

గ‌త కొన్నాళ్లుగా వివాదాల‌కు కేంద్రంగా మారిన వ్య‌వ‌హారాల‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ వ్య‌వ‌హారం మ‌రింత ముదిరిన నేప‌థ్యంలో దీపావ‌ళి వేళ ఆ కుటుంబంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి