hyderabadupdates.com Gallery నార్త్ లో డౌన్‌ అయిన కాంతారా వసూళ్లు!

నార్త్ లో డౌన్‌ అయిన కాంతారా వసూళ్లు!

కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంతార సినిమా ఎంత పెద్ద స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. రిషబ్ శెట్టి హీరోగా, అలాగే దర్శకుడిగానూ తెరకెక్కించిన ఆ సినిమా తర్వాత ప్రీక్వెల్ రూపంలో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. డివోషనల్ యాక్షన్ డ్రామా స్టైల్ లో వచ్చిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజే మంచి రెస్పాన్స్ తో పాటు వసూళ్ల పరంగా కూడా బలమైన స్టార్ట్ సాధించింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ కి యూనిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది.

రిలీజ్ డేలోనే ఈ సినిమా దాదాపు 18 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ అందుకుంది. అయితే రెండో రోజు మాత్రం ఊహించని విధంగా వసూళ్లు తగ్గిపోయాయి. సాధారణంగా నార్త్ లో వర్కింగ్ డే అయినప్పటికీ, సినిమాకి టాక్ బాగుంటే కలెక్షన్లు మెరుగ్గానే కొనసాగుతాయి. కానీ కాంతార ప్రీక్వెల్ కి మాత్రం మొదటి రోజు తో పోలిస్తే రెండో రోజు దాదాపు 5 కోట్ల వరకూ తగ్గిపోయాయి. దీంతో రెండో రోజు కలెక్షన్లు సుమారు 13.5 కోట్ల వద్ద ఆగిపోయాయి.

ఇక వీకెండ్ లోని శనివారం, ఆదివారం రోజుల్లో మళ్లీ వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.
The post నార్త్ లో డౌన్‌ అయిన కాంతారా వసూళ్లు! appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

Maithili Thakur: బీజేపీలో చేరిన బిహార్ ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్Maithili Thakur: బీజేపీలో చేరిన బిహార్ ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్

Maithili Thakur : యువ ఫోక్ సింగర్‌ గా మంచి పేరు తెచ్చుకున్న మైథిలి ఠాకూర్ (Maithili Thakur) బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. 25 ఏళ్ల మైథిలీ ఠాకూర్‌ కు దర్బంగాలోని అలీనగర్

శెభాష్ లోకేష్.. మంచి మాట ఎవ్వరు చెప్పినా..శెభాష్ లోకేష్.. మంచి మాట ఎవ్వరు చెప్పినా..

మంచి మాట ఎవ్వరు చెప్పినా వినాలంటారు పెద్దలు. నాకు తోచింది మాత్రమే చేసుకుంటూ పోతాననే మోనార్క్ పోకడలు లేకుండా.. పెద్దా చిన్నా స్థాయీ భేదాలను ఎంచకుండా మంచి సలహా ఎవ్వరు చెప్పినా సరే.. విని, ఆచరించడానికి పూనుకున్నప్పుడే.. పాలకులు కూడా న్యాయం