hyderabadupdates.com Gallery దేవుడిపై బురదచల్లుడా.. ఇంతకంటె నీచముంటుందా?

దేవుడిపై బురదచల్లుడా.. ఇంతకంటె నీచముంటుందా?

ప్రచారం చేసేవన్నీ అబద్ధాలే. అందులోనూ కుదిరినప్పుడు.. అధికారికంగా, నాయకులే మీడియా ముందుకు వచ్చి దైవద్రోహం చేస్తున్నామనే పాపభీతి కూడా లేకుండా పనిగట్టుకుని అబద్ధాలను ప్రచారం చేయడానికి బరితెగిస్తారు. కుదరని సందర్భాల్లో దొంగచాటుగా, ముసుగులేసుకుని, తప్పుడుప్రచారాలని సోషల్ మీడియాలో హోరెత్తించడానికి దిగజారుతారు. ఏదిఏమైనా సరే.. ప్రతిరోజూ తిరుమలేశుని భక్తుల్లో రకరకాల భయాలు, అపోహలు పుట్టేలా బురద చల్లుతూ ఉండాల్సిందే. వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు ఇదే తమ ప్రాథమిక బాధ్యత అన్నట్టుగా చెలరేగుతున్నాయి. ఇలాంటి దుర్మార్గులు సాగించే విషప్రచారాలకు కౌంటర్లు ఇచ్చుకోవడమూ, ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారం కోసం టీటీడీ వెబ్ సైట్ ను మాత్రమే చూడాలని ప్రతిసారీ ప్రచారం చేసుకోవడం టీటీడీకి అనవసరమైన భారంగా మారుతోంది.తాజాగా సాగుతున్న ఇలాంటి ప్రచారాల్ని గమనిస్తే.. తిరుమలలో వృద్ధులకు ఉచితంగా ప్రత్యేక దర్శన అవకాశం కల్పిస్తుంటారు. దానిపై ఇటీవలి కాలంలో.. ఒక దుష్ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది. భక్తులను తప్పుదోవ పట్టించేలా.. వారిలో భయాలు పుట్టించేలా తప్పుడు ప్రచారాలు మిన్నంటాయి. టీటీడీ ఈ విషయంలో అప్రమత్తమై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. వృద్ధుల దర్శనం గురించి జరుగుతున్న ప్రచారాల్ని నమ్మవద్దని ఒక ప్రకటన విడుదల చేసింది. నిజానికి రోజూ వెయ్యిమంది వయో వృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ మూడునెలల ముందుగా ఆన్ లైన్ కోటా విడుదలట చేస్తుందని, టికెట్ పొందిన వారికరి రూ.50 లడ్డూను ఉచితంగా ఇస్తుందని, తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్ లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారని ప్రకటించారు.అలాగే.. వీరు సాగిస్తున్న తప్పుడు ప్రచారాలు ఎలా ఉంటున్నాయంటే..  అలిపిరి నుంచి రుయావైపు వెళ్లే మార్గంలో ఎవరో ఆకతాయిలు.. గాజుసీసా పెంకులు పడేస్తే.. అలిపిరి మెట్ల మార్గంలో మద్యం తాగిన మందుబాబులు ఖాళీసీసాలను పడేశారంటూ తప్పుడు ప్రచారం ప్రారంభించారు. నిజానికి అలిపిరి ప్రాంతంలో.. అలిపిరినుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో ఎక్కడా అలాంటి దాఖలాలూ లేవు. అవకాశమూ లేదు. ఎక్కడో ఉన్న పెంకులను.. అలిపిరి మెట్లమార్గం అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేయడం వారికే చెల్లింది.ఒకవైపు భూమన కరుణాకరరెడ్డి గోశాలలో ఆవులు చచ్చిపోయాయని, కొన్ని సంవత్సరాలుగా వృథాగా పడి ఉన్న విగ్రహం.. విష్ణుమూర్తిని పక్కన పడేశారని ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. మరోవైపు వైసీపీ దళాలు.. సోషల్ మీడియాలో ఇలా ముసుగులో ఉంటూ.. సాగించే తప్పుడు ప్రచారాలు అదనం. ఇలాంటి దుర్మార్గపు పోకడలను  ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
The post దేవుడిపై బురదచల్లుడా.. ఇంతకంటె నీచముంటుందా? appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

Vijayawada Utsav’s Carnival Earned A place In Guinness Book of World RecordsVijayawada Utsav’s Carnival Earned A place In Guinness Book of World Records

The carnival organized on Mahatma Gandhi Road as part of Vijayawada Utsav-2025 has earned a place in the Guinness Book of World Records. To this end, the representatives of Vibrant

Upendra Dwivedi : డొనాల్డ్ ట్రంప్‌ పై ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలుUpendra Dwivedi : డొనాల్డ్ ట్రంప్‌ పై ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Upendra Dwivedi : ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న ఘటనలను ఉద్దేశ్యించి భారత ఆర్మీ చీఫ్‌ జనరల్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. పాత సమస్యలు పరిష్కరించుకునే లోగా కొత్తవి ఎదురవుతున్నాయని చెప్పారు.