hyderabadupdates.com Gallery లెనిన్‌ లాస్ట్‌ షెడ్యూల్‌!

లెనిన్‌ లాస్ట్‌ షెడ్యూల్‌!

అక్కినేని అఖిల్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లెనిన్ షూటింగ్ దాదాపు పూర్తయ్యే దశలోకి వచ్చింది. ఈ సినిమాను మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మొత్తం టాకీ పార్ట్‌లో 80 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన ఒక షెడ్యూల్‌తో సినిమా మొత్తం పూర్తి అవుతుందని సమాచారం.

తాజాగా టీమ్ ఆ చివరి షెడ్యూల్‌ కోసం ప్లాన్ సిద్ధం చేసింది. ఈ షెడ్యూల్‌లో అఖిల్‌పై యాక్షన్ సీన్స్‌తో పాటు ఒక ప్రత్యేకమైన పాటను కూడా చిత్రీకరించనున్నారు. సుమారు పది రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుందని, రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా భారీ సెట్‌ను కూడా నిర్మించినట్టు తెలుస్తోంది.

ఈ కథ రాయలసీమ నేపథ్యంతో, ముఖ్యంగా చిత్తూరు ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. ఇందులో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా కనిపించనుంది. అఖిల్, శ్రీలీల జోడీ స్క్రీన్‌పై కొత్తగా, ఫ్రెష్‌గా కనిపించబోతోందని టాక్. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్, ఎమోషనల్ సీన్స్ బాగుంటాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
The post లెనిన్‌ లాస్ట్‌ షెడ్యూల్‌! appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

NDA Alliance: బిహార్ ఎన్డీయే కుదిరిన సీట్ల సర్దుబాటుNDA Alliance: బిహార్ ఎన్డీయే కుదిరిన సీట్ల సర్దుబాటు

    బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో అధికార ఎన్డీయే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. 243 అసెంబ్లీ సీట్లకు గాను 101 బీజేపీకి, 101 జేడీయూకి సర్దుబాటు చేసుకునేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రమంత్రి చిరాగ్‌

తిరుమలలో అంగ‌రంగ వైభవంగా రథ సప్తమితిరుమలలో అంగ‌రంగ వైభవంగా రథ సప్తమి

తిరుమల : కోట్లాది భ‌క్తుల కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడింది. సూర్య జయంతిని పురస్కరించుకుని ఆదివారం తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది.ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు

మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమలుపై నారా లోకేష్ ఆరామ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమలుపై నారా లోకేష్ ఆరా

ఎన్టీఆర్ జిల్లా : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. మైల‌వ‌రం పాఠ‌శాల‌ను ఆయ‌న ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. భోజనం నాణ్యతపై ప్రతివారం తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని, ఐవీఆర్ఎస్ ద్వారా వారి ఫీడ్ బ్యాక్