hyderabadupdates.com Celeb Gallery నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక

నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక

నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక post thumbnail image

తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ అయింది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుండగా 14న కౌంటింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్‌ లో 3,98,982 మంది ఓటర్లు ఉండగా ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు కీలకం కానుంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీతా గోపినాథ్‌ను ప్రకటించింది బీఆర్ఎస్.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రెండు దశల్లో బిహార్ ఎన్నికలు జరుగుతాయని సీఈసీ జ్ఞానేశ్ కుమార్. నవంబర్ 6,11న పోలింగ్..నవంబర్ 14న కౌంటింగ్ జరుగుతుందని వెల్లడించారు. ఓటర్ల జాబితాలో సవరణలకు ఇంకా అవకాశం ఉందన్నారు. 243 స్థానాలు కలిగిన బీహార్‌ అసెంబ్లీలో 7.43 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇకపై నుండి ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంటాయని తెలిపారు.

సెప్టెంబర్ 30న ఓటర్ల జాబితాను ప్రచురించినట్లు తెలిపారు. పూర్తిగా ప్రక్షాళన చేశామని తెలిపారు. ఆగస్టు 1న పూర్తి ఎన్నికల జాబితాను పరిశీలించినట్లు తెలిపారు. ప్రతీ పోలింగ్ స్టేషన్‌లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని తెలిపారు. 85 ఏళ్ల కంటే పై బడిన వారు, 40 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం కలిగిన వారికి ఇంటి నుండే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల జాబితాలో ఓటర్ పేరు నమోదైన 15 రోజుల్లో కొత్త కార్డులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

వందేళ్లు పై బడిన ఓటర్లు 14 వేల మంది ఉన్నట్లు తెలిపారు జ్ఞానేశ్ కుమార్. ఈ సారి 14 లక్షల మంది కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. 90,712 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని..వందశాతం వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించనున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా పోస్టులపై గట్టి నిఘా పెట్టినట్లు తెలిపారు. బిహార్ ఎన్నికల నుండి కొత్తగా 17 సంస్కరణలు చేపట్టామని వీటిని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు.

The post నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక appeared first on Adya News Telugu.

Related Post