
ఆదివాసీల హక్కుల పోరాటం కోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం అని తెలిపారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. కొమురం భీం వర్థంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి నివాళులర్పించారు కవిత.
గుస్సాడీ ఉత్సవాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా ప్రతి గూడెంకు రూ.25 వేలు ఇచ్చేది..కాంగ్రెస్ ప్రభుత్వం పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుని ఈ ఉత్సవాల కోసం రూ.50 వేలు ఇవ్వాలి అన్నారు.
ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించే ఈ సంస్కృతిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత…కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గూడెంలలో అభివృద్ధి ఆగిపోయింది అన్నారు. మహిళలకు కనీసం ప్రసూతి సౌకర్యాలు లేని పరిస్థితి ఏర్పడింది… ఈ సమస్యలపై కొమురం భీం స్ఫూర్తితో జాగృతి పోరాటం చేస్తుంది అని తెలిపారు. జల్, జంగల్, జమీన్ అనే గొప్ప సంకల్పంతో ఆదివాసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన వీరుడు కొమురం భీం… ఆయన నినాదం, పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగింది అన్నారు. అలాంటి మహానీయుడి త్యాగాలను ఆయన వర్థంతి సందర్భంగా మరోసారి స్మరించుకుందాం అని పిలుపునిచ్చారు కవిత.
తెలంగాణ మన్నెం పులి, ఆదివాసీ బొబ్బిలి కొమురం భీమ్ …తమ జాతి కోసం ఎలా పోరాటం చేయాలో దేశం మొత్తం తరతరాలు చెప్పుకునేలా గొప్ప పోరాటం చేసిన బిడ్డ కొమురం భీమ్ అన్నారు. కొంతమంది జననం చరిత్ర అయితే.. కొంతమంది మరణం చరిత్ర అవుతుంది…కొమురం భీమ్ తన మరణంతో ఆదివాసీలకు ఎన్నో హక్కులను పర్మినెంట్ గా సాధించి పెట్టారు…’మావా నాటే మావా రాజ్’ అంటే మా గూడెంలో మా రాజ్యమే ఉండాలన్న నినాదం ఆయన తీసుకొచ్చారు అన్నారు.
The post ఆదివాసీ హక్కుల కోసం కవిత పోరు! appeared first on Adya News Telugu.