hyderabadupdates.com Gallery సేతుపతి కోసం లెజండ్రీ మ్యూజిక్‌ డైరెక్టర్‌!

సేతుపతి కోసం లెజండ్రీ మ్యూజిక్‌ డైరెక్టర్‌!

ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమలో రకరకాల క్రేజీ కాంబినేషన్ లు రూపుదిద్దుకుంటున్నాయి. వాటిలో ఒకటి మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు నటనతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతిల కలయిక. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ లో మంచి భాగం పూర్తయ్యిందని సమాచారం. ఇప్పుడు ఈ చిత్ర యూనిట్ నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ ప్రాజెక్ట్ కి సంగీతం అందిస్తున్న వ్యక్తి గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా హర్ష వర్ధన్ రామేశ్వర్ ఎంపికయ్యాడు. తాజాగా “అనిమల్” చిత్రానికి ఇచ్చిన సంగీతం వల్ల జాతీయ అవార్డు అందుకున్న ఆయన, ఇప్పుడు పూరి జగన్నాథ్ తో జతకట్టడం సినిమా మీద మరింత ఆసక్తిని పెంచింది. పూరి సినిమాల్లో ఉండే ఎనర్జీ, మాస్ ఎలిమెంట్స్ కి హర్ష వర్ధన్ సంగీతం ఎలా సరిపోతుందో చూడాలి.

ఇక మరోవైపు త్రివిక్రమ్ – వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రానికి కూడా ఇదే సంగీత దర్శకుడు ఉండబోతున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది.
The post సేతుపతి కోసం లెజండ్రీ మ్యూజిక్‌ డైరెక్టర్‌! appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

ఇంటిల్లిపాదికి ‘అన‌గ‌న‌గా ఒక రోజు’ పండ‌గేఇంటిల్లిపాదికి ‘అన‌గ‌న‌గా ఒక రోజు’ పండ‌గే

హైద‌రాబాద్ : యంగ్ హీరో, హీరోయిన్లు న‌వీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌద‌రి క‌లిసి న‌టించిన తాజా చిత్రం అన‌గ‌న‌గా ఒక రోజు పాజిటివ్ టాక్ ను స్వంతం చేసుకుంది. ప‌లు సినిమాలు సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. మెగాస్టార్

Sudan Rebels: సూడాన్‌ లో బందీలైన భారతీయుల కోసం ముమ్మర యత్నాలుSudan Rebels: సూడాన్‌ లో బందీలైన భారతీయుల కోసం ముమ్మర యత్నాలు

  సూడాన్‌ సైన్యం, సూడాన్‌ పారామిలటరీ విభాగాల మధ్య నెలల తరబడి జరుగుతున్న అంతర్యుద్దంతో రావణకాష్టంగా కాలిపోతున్న సూడాన్‌లో చిక్కుకుపోయిన, బందీలుగా మారిన భారతీయులను విడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ దేశ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు భారత్‌ లో సూడాన్‌

మార్చిలో రానున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్మార్చిలో రానున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్

హైద‌రాబాద్ : డైన‌మిక్ డైరెక్ట‌ర్ గా పేరు పొందిన హ‌రీష్ శంక‌ర్ మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగా తాను డిఫ‌రెంట్ క‌థ‌తో ప‌వ‌ర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ , శ్రీ‌లీల‌తో