hyderabadupdates.com movies యూత్ మసాలాతో ‘డ్యూడ్’ ప్రేమకథ

యూత్ మసాలాతో ‘డ్యూడ్’ ప్రేమకథ

లవ్ టుడే ముందు వరకు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పేరు ప్రదీప్ రంగనాథన్. అది సూపర్ హిట్ అవ్వడంతో యూత్ కి ఫాస్ట్ గా కనెక్ట్ అయిపోయాడు. తర్వాత డ్రాగన్ కూడా మంచి విజయం సాధించడంతో ఫ్యాన్స్ మరింత పెరిగారు. ఈసారి డ్యూడ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పేరుకి తమిళ సినిమా అయినప్పటికీ నిర్మించింది మన తెలుగు నిర్మాతలే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ లవ్ కం యూత్ ఎంటర్ టైనర్ కు కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించాడు. అల్లు అర్జున్ – అట్లీ మూవీకి సంగీతం సమకూరుస్తున్న సాయి అభ్యంక్కర్ ఈ డ్యూడ్ కి కంపోజర్ కావడం అసలు విశేషం.

ట్రైలర్ లో కథేంటో ఎక్కువ దాచకుండా చెప్పేశారు. అనగనగా ఒక కుర్రాడు (ప్రదీప్ రంగనాథన్). టిపికల్ ఆటిట్యూడ్ ఉన్న క్యాటగిరీలో నెంబర్ వన్ వచ్చే టైపు. ఇతని విచిత్రమైన మనస్తత్వాన్ని ఒక అమ్మాయి (మమిత బైజు) ఇష్టపడి ప్రేమిస్తుంది. ఆమె నాన్న (శరత్ కుమార్) కు కూడా ఇతను నచ్చేస్తాడు. తీరా పెళ్ళికి వెళ్లే టైంలో ఒక ట్విస్టు ఎదురవుతుంది. కుర్రాడి జీవితం రివర్స్ గేర్ లో వెళ్తుంది. ఈలోగా మరో యువతి (నేహా శెట్టి) పరిచయం వివాహం దాకా వస్తుంది. కానీ ఇదీ జరగదు. అసలు డ్యూడ్ లైఫ్ లో ఇన్ని మిస్టరీలు ఎందుకు జరిగాయి, చివరికి అతను ఏం చేశాడనేది అక్టోబర్ 17 తెలుసుకోవాలి.

డ్రాగన్ ఫార్ములానే ఫాలో అయిన దర్శకుడు కీర్తీశ్వరన్ ఈసారి ప్రదీప్ క్యారెక్టర్ లో డెప్త్ ని మరింత పెంచాడు. అతని బాడీ లాంగ్వేజ్ కి సూటయ్యే డైలాగులు, మ్యానరిజంస్ తో నింపేశాడు. యువతకు వేగంగా కనెక్ట అయ్యే ఇలాంటి ఎలిమెంట్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తాయో చూడాలి. ఈసారి విచిత్రంగా హీరోతో పాటు పిల్లనిచ్చే మావయ్య, అత్తయ్యలతో లౌడ్ కామెడీ చేయించిన దర్శకుడు వెరైటీ ప్రయోగాలు చాలానే చేసినట్టున్నాడు. సాయి అభ్యంక్కర్ మ్యూజిక్ అనిరుద్ స్టైల్ లో అనిపించినా ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది. మొత్తానికి కుర్రకారులో అంచనాలు రేపడంతో డ్యూడ్ తొలి అడుగు సరిగానే పడిందని చెప్పాలి.

Related Post

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలిఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు. “ఏదో ఇచ్చేశాం.. మీరేదో ఖ‌ర్చు చేసేశాం.. అంటే కుద‌ర‌దు. ప్ర‌తి రూపాయికీ ఫ‌లితం చూపించాలి. అది ఎలా వినియోగం అవుతోంది? ఎవ‌రికి

నిర్మాత మాట… 1 నేనొక్క‌డినే ఇప్పుడొచ్చినా…నిర్మాత మాట… 1 నేనొక్క‌డినే ఇప్పుడొచ్చినా…

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్‌ల క్రేజీ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన 1 నేనొక్క‌డినే సినిమాపై విడుద‌ల‌కు ముందు అంచ‌నాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. ఇద్ద‌రూ క‌లిసి ఇండ‌స్ట్రీ హిట్‌ను డెలివర్ చేస్తార‌ని అభిమానులు ఆశించారు. కానీ తెలుగు

ఎన్నిక‌ల హామీ… 642 కుక్క‌ల‌ను చంపేశారు… మ‌న ద‌గ్గ‌రే!ఎన్నిక‌ల హామీ… 642 కుక్క‌ల‌ను చంపేశారు… మ‌న ద‌గ్గ‌రే!

ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను నాయ‌కులు నెర‌వేరుస్తారా? అంటే.. త‌మ‌కు అవ‌కాశం ఉన్న మేర‌కు.. త‌మ‌కు ఇబ్బంది లేని హామీల‌ను నెర‌వేరుస్తారు. అయితే.. ఎంత వేగంగా నాయ‌కులు స‌ద‌రు హామీల‌ను అమ‌లు చేస్తార‌న్న‌ది.. ఇచ్చిన హామీ స్థాయిని బ‌ట్టే ఆధార‌ప‌డి ఉంటుంది. కొంద‌రు