hyderabadupdates.com movies NTR ‘డ్రాగన్’ మళ్ళీ మాట తప్పుతుందా ?

NTR ‘డ్రాగన్’ మళ్ళీ మాట తప్పుతుందా ?

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వార్ 2 డిజాస్టర్ ని మర్చిపోయి తమ దృష్టంతా ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) మీద పెడుతున్నారు. ఇటీవలే కొంత బ్రేక్ తీసుకున్న టీమ్ త్వరలో రీ స్టార్ట్ చేసే ప్రయత్నాల్లో ఉంది. ఒక కీలక షెడ్యూల్ అయ్యాక హఠాత్తుగా విరామం తీసుకున్న నీల్ బృందం దానికి కారణాలు బయటికి తెలియనివ్వలేదు కానీ నిర్మాత రవి శంకర్ ఇవాళ డ్యూడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చారు. ఈ నెలాఖరులో డ్రాగన్ పునఃప్రారంభమవుతుందని, ఇక్కడితో మొదలుపెట్టి 2026 వేసవి దాకా ఏకధాటిగా జరుగుతుందని చెప్పారు. ఇక్కడే అభిమానులు టెన్షన్ పడే పాయింట్ ఉంది.

అఫీషియల్ గా డ్రాగన్ లాక్ చేసుకున్న రిలీజ్ డేట్ వచ్చే ఏడాది జూన్ 25. అధికారిక ప్రకటన నెలల క్రితమే ఇచ్చారు. ఇప్పుడు సమ్మర్ దాకా షూటింగ్ చేస్తూనే ఉంటే పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్, డబ్బింగ్, ప్యాన్ ఇండియా ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇతర రాష్ట్రాల టూర్లు ఇవన్నీ ఎప్పుడు చేయాలనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఒకవేళ అదే కనక నిజమైతే డ్రాగన్ మళ్ళీ డేట్ మార్చుకుని దసరాకు షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. ప్రశాంత్ నీల్ కు ఈ వాయిదాలు కొత్త కాదు. సలార్ పార్ట్ 1 శౌర్యంగపర్వం సెప్టెంబర్ డేట్ వేసుకుని ఓవర్సీస్ అడ్వాన్స్ టికెట్లు అమ్మాక వాయిదా వేసుకుని డిసెంబర్ కు వెళ్ళిపోయింది.

కాబట్టి డ్రాగన్ కు కూడా అదే పరిస్థితి తలెత్తినా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. సో జూన్ మీద ఆశలు తగ్గించుకోవడం బెటరేమో. హీరోయిన్ రుక్మిణి వసంత్ ఈ కారణంగానే కాంతారా చాప్టర్ 1 ఏ లెజెండ్ ప్రమోషన్లతో పాటు అంతకు ముందు మదరాసి పబ్లిసిటీని పూర్తి స్థాయి సమయం కేటాయించగలిగింది. ఆరేడు దశాబ్దాల క్రితం ప్రపంచాన్ని ఊపేసిన ఒక సెన్సేషనల్ బ్యాక్ డ్రాప్ తీసుకున్న ప్రశాంత్ నీల్ ఎన్నడూ చూడని రీతిలో తారక్ ని ప్రెజెంట్ చేయబోతున్నట్టు తెలిసింది. ఇప్పుడిదే ఇంత ఆలస్యమైతే దేవర 2 ఎంత లేట్ అవుతుందో వేరే చెప్పాలా. సో యంగ్ టైగర్ ఫ్యాన్స్ లాంగ్ వెయిటింగ్ తప్పదు.

#NTRNeel/#Dragon:“The new schedule will begin at the end of this month and continue without any breaks until summer next year.” pic.twitter.com/qTnfheY0pp— Gulte (@GulteOfficial) October 9, 2025

Related Post

గూగుల్ రాక: జనాలకు మేలెంత?గూగుల్ రాక: జనాలకు మేలెంత?

ఏపీ ప్రభుత్వం మంగళవారం ఢిల్లీలో గూగుల్, దాని అనుబంధ సంస్థ రైడైన్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం విశాఖలో భారీ పెట్టుబడి రానుంది. ఇది ఆసియాలోనే అతి పెద్ద గూగుల్ పెట్టుబడిగా చెబుతున్నారు. 88 వేల కోట్ల రూపాయలను తొలిదశలో