hyderabadupdates.com movies మరి ఆ డిమాండ్ల మాటేంటి దీపికా?

మరి ఆ డిమాండ్ల మాటేంటి దీపికా?

స్పిరిట్, కల్కి-2 లాంటి భారీ చిత్రాల నుంచి దీపికా పదుకొనే తప్పుకోవడం ఈ మధ్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ‘కల్కి’లో కీలక పాత్ర పోషించిన ఆమె.. రెండో భాగానికి దూరం కావడం చర్చనీయాంశం అయింది. ఇది ‘కల్కి’ టీంకు, ఆ సినిమాను ఇష్టపడ్డ వాళ్లకు ఎంతో ఇబ్బంది కలిగించే విషయమే. అదే సమయంలో దీపికకు కూడా అదంత మేలు కలిగించే నిర్ణయంలా అనిపించలేదు.

అయినా దీపిక ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందనే విషయంలో పెద్ద చర్చే జరిగింది. దీపిక డిమాండ్లకు తట్టుకోలేకే స్పిరిట్, కల్కి-2 టీమ్స్ ఆమెను తప్పించినట్లు జోరుగా ప్రచారం జరిగింది. దీని గురించి దీపిక ఇప్పటిదాకా స్పందించలేదు. ఆమె పీఆర్ టీం మాత్రం సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడి చేస్తూ వచ్చింది. ఇప్పుడు స్వయంగా దీపికే ఈ విషయం మీద స్పందించింది.

సినీ పరిశ్రమలో పని వాతావరణం గురించి ఆమె మాట్లాడింది. రోజుకు 8 గంటలే పని చేయాలని తనకు తాను ఒక నియమం పెట్టుకున్నానని.. దానికి అడ్జస్ట్ కాని వాళ్లు తనతో పని చేయాల్సిన అవసరం లేదని ఆమె తేల్చేసింది. అదే సమయంలో ఎప్పట్నుంచో 8 గంటలు మాత్రమే పని చేస్తున్న మగ సూపర్ స్టార్లు లేరా.. వాళ్లు శుక్రవారం వరకే పని చేసి, వీకెండ్స్‌ సెలవు తీసుకుంటారన్నది తెలియదా అని ఆమె ప్రశ్నించింది. ఐతే కేవలం ఈ ఒక్క కండిషన్ వల్లే దీపికాను స్పిరిట్, కల్కి-2 టీమ్స్ దూరం చేసుకున్నాయా అన్నది ప్రశ్న. 8 గంటల నిడివిలో దీపికతో పని చేయించుకోవడం వాళ్లకు పెద్ద సమస్యేమీ కాదు.

కానీ అంతకుమించి ఆమె పెట్టిన కండిషన్లకు, డిమాండ్లకు జడిసే ఆమెను దూరం పెట్టారన్నది స్పష్టం. ‘కల్కి’కి తీసుకున్న పారితోషకం కంటే దాదాపు 50 శాతం అదనంగా అడగడం నిజమా కాదా అన్నది ప్రశ్న. అలాగే దాదాపు 25 మంది దాకా ఉణ్న దీపిక స్టాఫ్‌కు ప్రయాణ, వసతి, ఇతర ఖర్చులు నిర్మాణ సంస్థే భరించాల్సిన పరిస్థితి రావడంతో.. ఇవన్నీ తట్టుకోలేకే ఆమెకు టాటా చెప్పారన్నది ఆయా చిత్ర వర్గాల సమాచారం. తన పీఆర్ టీం ద్వారా సెట్ చేసుకున్న ఇంటర్వ్యూలో కేవలం 8 గంటల పని విధానం గురించి మాత్రమే ప్రశ్న అడిగించుకుని.. దానికి ముందే ప్రిపేర్ చేసిపెట్టుకున్న జవాబు చెప్పి ఈ వివాదంలో తన తప్పేమీ లేదని చాటాలని దీపిక ప్రయత్నిస్తోందని క్లియర్‌గా తెలిసిపోతోంది. అందుకే దీపిక మీద మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు తప్పట్లేదు.

Related Post

సుప్రీమ్ హీరో సంబరాలు చాలా సీరియస్సుప్రీమ్ హీరో సంబరాలు చాలా సీరియస్

యాక్సిడెంట్ తర్వాత చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్న మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త మూవీ సంబరాల ఏటి గట్టు ఎన్నో నెలలుగా నిర్మాణంలో ఉంది. వాస్తవానికి ముందు అనుకున్న ప్రకారమైతే సెప్టెంబర్ 25 వచ్చేయాలి. కానీ షూటింగ్

నంది అవార్డులంటే అంత చులకనానంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే టాలీవుడ్ ఆస్కార్ తో సమానం. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ పురస్కారాల కోసం తెలుగు పరిశ్రమలో ప్రతి ఒక్కరు పరితపించి

బ్లాక్ డ్రెస్ లో మెరిసిన అలియా భట్బ్లాక్ డ్రెస్ లో మెరిసిన అలియా భట్

అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు, తల్లి పాత్రలో చిన్నారి రాహా సంరక్షణ… అన్నింటినీ చక్కగా చూసుకుంటోంది. ఎక్కడా హడావుడి కనిపించదు. అన్నీ సవ్యంగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది.