hyderabadupdates.com Gallery మాజీ మంత్రి అతి.. కేసులో చిక్కుకోక తప్పదా?

మాజీ మంత్రి అతి.. కేసులో చిక్కుకోక తప్పదా?

అనుచరుడిని విచారణ కోసం పోలీసులు స్టేషన్‌కు పిలిస్తే మాజీ మంత్రి అక్కడకు వచ్చి నానా హడావుడి చేశారు. అనుచరులందరినీ గుంపులుగా వెంటబెట్టుకొచ్చి పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించారు. వారిని బెదిరించారు. విచారణ కోసం పిలిపించిన నిందితుడిని పోలీసులు అనుమతి లేకుండా బయటకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. సర్కిల్ ఇన్స్‌పెక్టరును నానా దుర్భాషలాడారు. ఇన్ని జరిగిన తర్వాత పోలీసులు మాత్రం ఊరుకుంటారా? ఊరుకుంటే ఆయన బెదిరింపులకు జడుసుకొన్నట్లుగా అవుతుంది కదా? అందుకే కేసులు నమోదు చేసి దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తున్నారు. ఇదంతా గోటితో పోయేదానిని గొడ్డలిదాకా తెచ్చుకుంటున్న మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఓవరాక్షన్ కు సంబంధించిన వ్యవహారం!కొన్ని రోజుల కిందట మెడికల్ కాలేజీల వద్ద నిరసనలు చేపట్టడానికి సంబంధించి పోలీసులు కొందరికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. ఈ క్రమంలోభాగంగానే.. ఏ8గా ఉన్న వైసీపీ నాయకుడు మేకల సుబ్బన్నను కూడా విచారణ నిమిత్తం పిలిచారు. ఆ వెంటనే తన బలగాలతో కలిసి స్టేషనుకు వచ్చిన పేర్ని నాని.. సర్కిల్ ఇన్స్‌పెక్టరును నానా మాటలు అన్నారు. తీవ్రంగా బెదిరించారు. మా ప్రభుత్వం వస్తే మీ సంగతి చూస్తా అంటూ రెచ్చిపోయారు. సుబ్బన్నను చట్టప్రకారం విచారణకోసం పిలిచామని విచారించిన తర్వాత పంపేస్తాం అని సీఐ నచ్చజెబుతున్నప్పటికీ.. పేర్ని నాని పట్టించుకోలేదు. ఒక రేంజిలో ఎగిరెగిరిపడ్డారు. సుబ్బన్నను ఉరి తీస్తావా.. ఉరి వేసేయ్..  ఇప్పుడే ఉరేసేయ్.. అంటూ రంకెలు వేశారు. మాజీ మంత్రి చేసిన ఈ ఓవరాక్షన్ మొత్తం వీడియోలు బయటకు వచ్చాయి.అయితే స్టేషను మీదకు వచ్చి ఇలా రాద్ధాంతం చేయడాన్ని పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. సీఐ విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించినందుకు మాజీ మంత్రి మీద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు  మీడియాకు వెల్లడించారు. సీఐను బెదిరించడం, దురుసుగా ప్రవర్తించడం సరికాదని ఆయన అంటున్నారు. పోలీసుస్టేషనుకు ఎవరైనా రావొచ్చునని, వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చునని అంతే తప్ప అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని విడిపించుకు వెళ్లిపోతా అని దూకుడు ప్రదర్శించడం తగదని ఎస్పీ అంటున్నారు.తన అనుచరుడికి ఫేవర్ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడానికి స్టేషన్ మీదికి దూసుకెళ్లిన పేర్ని నాని.. కొత్త కేసుల్లో ఇరుక్కునేలా కనిపిస్తున్నదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. 
The post మాజీ మంత్రి అతి.. కేసులో చిక్కుకోక తప్పదా? appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

Murder: రామచంద్రాపురంలో బాలిక మృతి ఘటనలో వీడిన మిస్టరీMurder: రామచంద్రాపురంలో బాలిక మృతి ఘటనలో వీడిన మిస్టరీ

  డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో రామచంద్రాపురంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మైనర్ బాలిక కేసులో మిస్టరీ వీడింది. ఈ నెల 4న తన ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ బాలిక మృతదేహం కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం

సేతుపతి కోసం లెజండ్రీ మ్యూజిక్‌ డైరెక్టర్‌!సేతుపతి కోసం లెజండ్రీ మ్యూజిక్‌ డైరెక్టర్‌!

ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమలో రకరకాల క్రేజీ కాంబినేషన్ లు రూపుదిద్దుకుంటున్నాయి. వాటిలో ఒకటి మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు నటనతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతిల కలయిక. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ లో మంచి భాగం పూర్తయ్యిందని సమాచారం.

తెలంగాణ ముద్దుబిడ్డ సూదిని జైపాల్ రెడ్డితెలంగాణ ముద్దుబిడ్డ సూదిని జైపాల్ రెడ్డి

హైద‌రాబాద్ : భార‌త దేశం గ‌ర్వించ ద‌గిన అరుదైన నాయ‌కుడు మాజీ కేంద్ర మంత్రి, దివంగ‌త సూదిని జైపాల్ రెడ్డి అని అన్నారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. రాజకీయాలకు విలువల విలువ తెలిపి, ప్రజాసేవకు నిస్వార్థమే పరమార్థమని చెప్పిన అరుదైన