hyderabadupdates.com Gallery IPS Suicide: ఐపీఎస్‌ పూరన్‌ కుమార్ భార్యకు సీఎం పరామర్శ

IPS Suicide: ఐపీఎస్‌ పూరన్‌ కుమార్ భార్యకు సీఎం పరామర్శ

IPS Suicide: ఐపీఎస్‌ పూరన్‌ కుమార్ భార్యకు సీఎం పరామర్శ post thumbnail image

IPS Suicide : హరియాణాకు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య (IPS Suicide) ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన బలవన్మరణానికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమని… వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన భార్య, ఐఏఎస్‌ అధికారిణి అమ్నీత్‌ పీ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ… అమ్నీత్‌ను పరామర్శించారు. దాదాపు గంటపాటు ఆమెతో చర్చించారు.
ఈ కేసులో వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని… సాక్ష్యాలు తారుమారు కాకుండా చూడాలని అమ్నీత్‌ పీ కుమార్‌.. సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. విచారణలో జోక్యం చేసుకోకుండా ఉండేందుకు బాధ్యులను సస్పెండ్ చేసి, అరెస్టు చేయాలని అభ్యర్థించారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. మరోవైపు సెక్టార్‌ 11 పోలీస్‌ స్టేషన్‌లో మరో ఫిర్యాదు చేసిన ఆమె.. డీజీపీ కపూర్‌, ఎస్పీ నరేంద్ర బిజార్నియాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. వీరి వేధింపులు, అవమానాలు, కుల వివక్ష కారణంగానే తన భర్త ఆత్మహత్యకు (IPS Suicide) పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పూరన్‌ కుమార్‌ దేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అయితే, వారి పెద్ద కుమార్తె అమెరికా నుంచి రావాల్సి ఉన్నందున.. కుటుంబ అభ్యర్థన మేరకు చండీగఢ్‌ సెక్టార్‌ 16లోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలోనే మృతదేహాన్ని ఉంచారు.
IPS Suicide – పీఎస్‌ అధికారి ఆత్మహత్య కేసులో భార్య సంచలన ఆరోపణలు
ప్రముఖ హర్యానా ఐపీఎస్‌ అధికారి వై.పురాన్‌ కుమార్‌ ఆత్మహత్య (IPS Suicide) కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఐపీఎస్‌ ఆత్మహత్యకు కారణమైన రిటైర్డ్‌ పోలీసు ఉన్నతాధికారులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు పురాన్‌ కుమార్‌ మరణానికి కారణమైన వారిలో పోలీస్‌ శాఖలో పనిచేసిన కీలక ఉన్నతాధికారి పేరు ఉండటమేనని తెలుస్తోంది. తనని పోలీస్‌ శాఖలో రిటైర్డ్‌ ఉన్నతాధికారులు వేధిస్తున్నారని, ఆ వేధింపులు తాళలేక పోతున్నానంటూ ఐపీఎస్‌ పురాన్‌ కుమార్‌ బుధవారం ఛండీఘడ్‌లోని తన నివాసంలో రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బలవన్మరణానికి ముందు ఎనిమిది పేజీల సూసైడ్‌ నోటు రాశారు. అందులో సదరు అధికారుల పేర్లు కూడా రాశారు. అయితే, తన భర్త మరణానికి కారణమైన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ పురాన్‌ కుమార్‌ భార్య, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి అమ్నీత్‌ పీ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
నా భర్త ఐపీఎస్‌ పురాన్‌ కుమార్‌ను పోలీస్‌ శాఖలో పనిచేసి రిటైరైన ఉన్నాతాధికారులు, పలువురు పనిచేస్తున్న వారు వేధింపులకు గురి చేయడం,అవమానించడంతో పాటు మానసిక హింసకు గురి చేశారని వాపోయారు. అందుకే ఆయన మరణించినా.. చండీగఢ్ పోలీసులు పట్టించుకోలేదు.హర్యానా పోలీసు, అడ్మినిస్ట్రేషన్‌లో శక్తివంతమైన ఉన్నతాధికారులు ఈ కేసులో నిందితులుగా ఉండటం,వారు చండీగఢ్ పోలీసులను ప్రభావితం చేయడం వల్ల ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణం’అని సీఎం నయాబ్ సింగ్ సైనీకి రాసిన లేఖలో ఐఏఎస్‌ అధికారిణి అమ్నీత్‌ పీ కుమార్‌ పేర్కొన్నారు.
IPS Suicide – ఏడీజీపీ స్థాయి అధికారికే న్యాయం జరగలేదు – ఖర్గే
హరియాణాకు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పూరన్‌ కుమార్‌ ఆత్మహత్యకు (IPS Suicide) పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. అమానవీయత, సామాజిక అసమానత, సానుభూతి లేమికి ఈ కేసు ఒక నిదర్శనమన్నారు. ‘ఎక్స్‌’ వేదికగా కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించిన ఖర్గే.. ఆ పార్టీ విధానాలే దళిత ఐపీఎస్‌ మృతికి కారణమన్నారు.
‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బలహీన వర్గాల వారికి భాజపా విధానాలు శాపంగా మారాయి. ఏడీజీపీ స్థాయి దళిత అధికారికీ న్యాయం జరగలేదు. సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తిపై బహిరంగంగా దాడి జరిగింది. అయినా వాళ్లు సమర్థించుకుంటున్నారు. దీంతో సబ్‌కా సాత్‌ నినాదం ఓ జోక్‌ అని అర్థం చేసుకోవాలి.
ఓ దళితుడిని మూక హత్య చేసినా ప్రధాని ఖండించలేదు. ఇది కొందరి వ్యక్తులకే పరిమితం కాదు.. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని అణచివేసే అన్యాయ వ్యవస్థకు నిదర్శనం. ఇది రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం’’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు తీవ్ర స్థాయిలో స్పందించారు.
2001 బ్యాచ్‌ హరియాణా క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ (52).. చండీగఢ్‌లో తన నివాసంలో అక్టోబర్‌ 7న ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ బలవన్మరణానికి సీనియర్ల వేధింపులే కారణమని పేర్కొంటూ ఓ సూసైడ్‌ నోట్‌లో పేర్కొనడం సంచలనం రేపుతోంది. ఇదే విషయంపై ఆయన భార్య, ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పి కుమార్.. ముఖ్యమంత్రికి లేఖ రాశారు. లేఖలో ఉన్నతాధికారుల పేర్లు రాసినప్పటికీ చండీగఢ్‌ పోలీసులు ఇప్పటికీ కేసు నమోదు చేయలేదని ఆరోపించారు.
Also Read : Menstrual Leave: కర్ణాటక లో మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు
The post IPS Suicide: ఐపీఎస్‌ పూరన్‌ కుమార్ భార్యకు సీఎం పరామర్శ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Siddaramaiah: ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి దంపతులపై సీఎం ఆగ్రహంCM Siddaramaiah: ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి దంపతులపై సీఎం ఆగ్రహం

CM Siddaramaiah : కర్ణాటకలో జరుగుతున్న సోషల్ అండ్ ఎడ్యుకేషన్ సర్వే కు దూరంగా ఉండాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి, రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి సిద్ధారామయ్య (CM Siddaramaiah) ఘాటుగా స్పందించారు.