hyderabadupdates.com Gallery Bonthu Rammohan: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిగా బొంతు

Bonthu Rammohan: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిగా బొంతు

Bonthu Rammohan: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిగా బొంతు post thumbnail image

Bonthu Rammohan : జూబ్లీహిల్స్‌ అభ్యర్థి ఎంపికపై బీజేపీలో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, మాజీ మేయర్‌ కాంగ్రెస్‌ ఉపాధ‍్యక్షుడు బొంతు రామ్మోహన్‌ (Bonthu Rammohan) పేరును ఎంపీ అర్వింద్‌ ప్రతిపాదించారు. బొంతు రామ్మోహన్‌ ను పార్టీలోకి తీసుకుని టికెట్‌ ఇవ్వాలని… తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావుకు ఎంపీ అర్వింద్‌ విజ్ఞప్తి చేశారు. బొంతు రామ్మోహన్‌కు (Bonthu Rammohan) ఏబీవీపీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉందని తెలిపారు.
అయితే అర్వింద్ చేసిన ప్రతిపాదనపై బీజేపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఖరారు చేసేందుకు బీజేపీ ఇప్పటికే త్రిసభ్య కమిటీని నియమించింది. మాజీ ఎంపీ పోతుగంటి రాములు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, సీనియర్ నేత కోమల ఆంజనేయులుతో కూడిన కమిటీ ఇప్పటికే నియోజకవర్గ నేతలతో సుధీర్ఘంగా చర్చించి వారి అభిప్రాయాలు సేకరించింది.
Bonthu Rammohan – మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ కేటాయించకపోవడంపై మాజీ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత అంజన్‌కుమార్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్‌ రాకుండా చేసిందెవరో త్వరలో చెబుతానని షాకింగ్ కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీకి తాను అర్హుడిని కాదా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసింది ఎవరూ..? అని నిలదీశారు అంజన్‌ కుమార్‌ యాదవ్‌.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో తనను సంప్రదించరా..? అని ఫైర్ అయ్యారు. లోకల్‌, నాన్‌ లోకల్‌ సమస్య ఇప్పుడే ఎందుకొచ్చింది..? అని ప్రశ్నించారు. కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా..? అని నిలదీశారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎక్కడైనా పోటీ చేయొచ్చని స్పష్టం చేశారు అంజన్‌కుమార్‌ యాదవ్‌.
అయితే, జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ నామినేషన్‌కి సిద్ధం అయ్యారు అంజన్ కుమార్. బుజ్జగింపుల పర్వంలో భాగంగా అంజన్ కుమార్‌ని కలిశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అంజన్ కుమార్ యాదవ్‌ని కలిశారు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్. వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read : Sabarimala: శబరిమల ఆలయంలో యోగదండం మాయం ?
The post Bonthu Rammohan: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిగా బొంతు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Cyclone Senyar: ఏపీకి ‘సెనియార్‌’ తుపాను ముప్పుCyclone Senyar: ఏపీకి ‘సెనియార్‌’ తుపాను ముప్పు

    మోంథా తుఫాన్ నుండి కోలుకుంటున్న ఏపీకు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ప్రస్తుత ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారానికి దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇది 24వ తేదీ నాటికి

VVPAT Slips: బిహార్‌లో రోడ్డు పక్కన వీవీప్యాట్‌ స్లిప్పులుVVPAT Slips: బిహార్‌లో రోడ్డు పక్కన వీవీప్యాట్‌ స్లిప్పులు

    బిహార్‌లోని సమస్తీపుర్‌ జిల్లాలో రోడ్డు పక్కన అధిక సంఖ్యలో వీవీప్యాట్‌ స్లిప్పులు చెల్లాచెదురుగా పడి ఉండడం కలకలం రేపింది. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన ఎన్నికల సంఘం… ఓ సహాయ రిటర్నింగ్‌ అధికారిని (ఏఆర్‌వో) సస్పెండ్‌ చేయడంతో పాటు