hyderabadupdates.com movies కల్ట్ స్నేహాన్ని విడగొట్టిన చిన్న అపార్థం

కల్ట్ స్నేహాన్ని విడగొట్టిన చిన్న అపార్థం

ఇస్మాయిల్ దర్బార్. బాలీవుడ్ కు చెందినవాడే అయినా ఈయన పేరు తెలియని మ్యూజిక్ లవర్స్ ఉండరు. తెలుగులో మంచు విష్ణు మొదటి మూవీకి సంగీతం అందించింది ఈయనే. చేసినవి తక్కువ సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇస్మాయిల్ దర్బార్ మొదటి సినిమా హం దిల్ దే చుకే సనమ్. 1999లో రిలీజైన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ పాటలు అప్పటి జనాన్ని ఊపేశాయి. మసాలా సాంగ్స్ లో మునిగి తేలుతున్న జనాల చెవుల్లో అమృతం పోసిన ఫీలింగ్ కలిగింది. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో పని చేసిన అనుభవం చాలా పేరు తెచ్చిన మాట వాస్తవం.

తర్వాత షారుఖ్ ఖాన్ దేవదాస్ తోనూ ఈ కాంబో మేజిక్ రిపీట్ అయ్యింది. తర్వాత వీళిద్దరి కాంబోలో ఏ చిత్రం రాలేదు. విభేదాలు వచ్చాయన్నారు కానీ కారణాలు బయట పెట్టలేదు. ఇంత కాలం తర్వాత ఇస్మాయిల్ దర్బార్ దాని గురించి మాట్లాడారు. ఆ మధ్య నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన హీరామండి వెబ్ సిరీస్ గుర్తుందిగా. నిజానికది ఎప్పుడో పాతిక సంవత్సరాల క్రితం రాసుకున్న సబ్జెక్టట. ఆ టైంలో ఒక దినపత్రికలో దీని గురించి రాసిన జర్నలిస్టు హీరామండికి ఇస్మాయిల్ సంగీతం ఆయువుపట్టుగా నిలవనుందని ఓ రేంజ్ లో పొగుడుతూ ఆర్టికల్ రాశాడు. ఇది సంజయ్ లీలా భన్సాలీకి కోపం తెప్పించింది.

అడిగి మరీ కావాలని ఇస్మాయిల్ దర్బార్ ఇది రాయించుకున్నాడని భావించిన సంజయ్ లీలా భన్సాలీ ఇక్కడితో వదిలేయమని చెప్పి ఏకంగా ఫ్రెండ్ షిప్ నే వద్దనుకున్నారు. తప్పు చేయకపోయినా నిలదీసినందుకు ఈయనా పక్కకు వచ్చేశారు. తర్వాత సంజయ్ పిఆర్ టీమ్ పలు మార్గాల్లో తిరిగి కలిపేందుకు ప్రయత్నాలు చేసింది కానీ ఇస్మాయిల్ ఒప్పుకోలేదు. వంద కోట్లు ఇచ్చి పని చేయమన్నా తాను భన్సాలీతో చేతులు కలిపే సమస్యే లేదని తెగేసి చెబుతున్నారు. రెహమాన్ కు ఆస్కార్ వచ్చినప్పుడు తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఇస్మాయిల్ దర్బార్ దాని తర్వాతే అవకాశాలు తగ్గిపోయి ఎక్కువ సినిమాలు చేయలేదు.

Related Post

`చిరంజీవి` పేరును వాడుకుంటే జైలుకే: కోర్టు తీర్పు`చిరంజీవి` పేరును వాడుకుంటే జైలుకే: కోర్టు తీర్పు

సోష‌ల్ మీడియా స‌హా ప్రైవేటు సంస్థ‌లు కూడా ఇటీవ‌ల కాలంలో సెల‌బ్రిటీల పేర్లు, ఫొటోల‌ను వినియోగించ‌డం ఫ్యాషన్‌గా మారిపోయింది. కొన్ని కొన్ని సంద‌ర్బాల్లో సెల‌బ్రిటీల గ‌ళాన్ని కూడా అనుక‌రిస్తున్నారు. ఇక‌, ఏఐ వ‌చ్చిన త‌ర్వాత‌.. మార్ఫింగ్‌వీడియోలు సృష్టించి.. కంటెట్‌తో ప్ర‌చారం చేస్తున్నారు.