hyderabadupdates.com Gallery Bhatti Vikramarka: హైదరాబాద్‌ అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు – భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: హైదరాబాద్‌ అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు – భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: హైదరాబాద్‌ అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు – భట్టి విక్రమార్క post thumbnail image

Bhatti Vikramarka : తెలంగాణ రాష్ట్ర వనరులు, అవకాశాలపై ప్రచారం బాధ్యత నరెడ్కోపై ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అన్నివైపులా హైదరాబాద్ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని చెప్పారు. నరెడ్కో ఆధ్వర్యంలో హైటెక్స్‌లో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రారంభించారు. నరెడ్కో బ్రౌచర్‌ను వారు ఆవిష్కరించారు. మూడు రోజుల పాటు ప్రాపర్టీ షో కొనసాగనుంది. ఇందులో పలు స్థిరాస్తి సంస్థల స్టాళ్లు ఏర్పాటు చేశారు.
Telangana Deputy CM Bhatti Vikramarka Comments
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మాట్లాడుతూ… హైదరాబాద్‌ అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గత రెండేళ్లలో రూ.20 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. మూసీ నది సుందరీకరణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డుతో నగర ముఖ చిత్రం మార్చబోతున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కలిసేలా దీని నిర్మాణం ఉంటుందన్నారు. హైడ్రాతో కొంత భయం ఏర్పడినా ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలు, చెరువులను హైడ్రా కాపాడుతోందని వివరించారు.
‘‘హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని ప్రచారం చేశారు. రాయదుర్గంలో ఎకరా రూ.177 కోట్ల ధర పలకడంతో నగర అభివృద్ధి ఎలా దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పర్యావరణ పరిరక్షణ కోసం హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ బస్సులను నడిపిస్తున్నాం. భవిష్యత్తులో అన్నీ ఇవే ఉంటాయి. వీటికి పన్ను మినహాయింపులు కూడా ఇచ్చాం. మురుగునీటిని శుద్ధి చేయడానికి రూ.4 వేల కోట్ల వ్యయంతో ఎస్టీపీలను నిర్మించబోతున్నాం. నగరం నలువైపులా మెట్రోను విస్తరిస్తున్నాం. విద్య, వైద్య రంగంపై మరింత దృష్టిసారిస్తున్నాం. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో 100 స్కూళ్లను నిర్మించబోతున్నాం. ఇప్పటికే ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణంలో ఉన్నాయి. నరెడ్కో ప్రతినిధులు సీఎస్‌ఆర్‌ నిధులను విద్య, వైద్య రంగంపై పెద్దమొత్తంలో ఖర్చు చేయండి. విల్లాలు, హై రైజ్ బిల్డింగులకే పరిమితం కావొద్దు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేయండి. సంపద సృష్టికర్తలుగా రియల్టర్లు, బిల్డర్లను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుంది. మీ సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు.
తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతలు
తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. ‘‘కుంకటి వెంకటయ్య అలియాస్‌ వికాస్‌, మొగిలిచర్ల వెంకట్రాజు అలియాస్‌ చందు, తోడెం గంగ అలియాస్‌ సోనీ (ఛత్తీస్‌గఢ్‌) మావోయిస్టు పార్టీ నుంచి బయటికొచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఈ ముగ్గురూ మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీ స్థాయి నాయకులు. సిద్దిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటయ్య 1990లో పీడబ్ల్యూడీ ఏర్పాటు చేసిన రైతు కూలీ సభలకు హాజరై.. అదే ఏడాది అజ్ఞాతంలోకి వెళ్లారు.
పిడబ్ల్యూడీ కమాండర్‌ బాలన్న ఆధ్వర్యంలో దళంలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 35 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకుని.. జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామానికి చెందిన మొగిలిచర్ల వెంకటరాజు(45)… 11 ఏళ్ల వయసులోనే విప్లవగీతాలకు ఆకర్షితుడై మావోయిస్టు ఉద్యమంలో చేరారు. 1993లో నర్సంపేట దళంలో రిక్రూట్‌ అయి రాష్ట్రస్థాయి కమిటీలో వివిధ హోదాల్లో పనిచేశారు. మావోయిస్టులతో వచ్చిన సైద్ధాంతిక విభేదాల కారణంగా, పోలీసులు ఇచ్చిన పిలుపును అందుకుని అతని భార్య తోడెం గంగతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇటీవల కాలంలో 403 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు’’ అని డీజీపీ తెలిపారు.
Also Read : Martlet Missiles: ఇండియన్ ఆర్మీ చేతికి ‘మార్ట్‌లెట్‌’ మిసైల్స్
The post Bhatti Vikramarka: హైదరాబాద్‌ అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు – భట్టి విక్రమార్క appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ISRO LVM3: ఇస్రో బాహుబలి రాకెట్‌ ప్రయోగం సక్సెస్ISRO LVM3: ఇస్రో బాహుబలి రాకెట్‌ ప్రయోగం సక్సెస్

ISRO LVM3 : బహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు శ్రీహరి కోట నుంచి LVM3-M5 రాకెట్‌‌ను సక్సెస్‌ఫుల్‌గా నింగిలోకి ప్రయోగించారు. ఆదివారం సాయంత్రం 5.26 నిమిషాలకు రాకెట్ నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిరింది. ఈ LVM3-M5