hyderabadupdates.com Gallery Palla Srinivasarao: బొత్సకు జగన్ నుంచి ప్రాణహాని ఉంది – టీడీపీ అధ్యక్షుడు పల్లా 

Palla Srinivasarao: బొత్సకు జగన్ నుంచి ప్రాణహాని ఉంది – టీడీపీ అధ్యక్షుడు పల్లా 

Palla Srinivasarao: బొత్సకు జగన్ నుంచి ప్రాణహాని ఉంది – టీడీపీ అధ్యక్షుడు పల్లా  post thumbnail image

Palla Srinivasarao : విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో కుటుంబ సభ్యులతో కలిసి తాను కూర్చున్న స్టేజి కూలిపోయిన ఘటన వెనుక ప్రభుత్వం యొక్క కుట్ర దాగి ఉందని శాసన మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే తనకు ప్రాణ హాని ఉందని… బొత్స (Botcha Satyanarayana) చేసిన ఆరోపణలపై ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasarao) ఘాటుగా స్పందించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ… బొత్స సత్యనారాయణ అంటే మాకు చాలా గౌరవం. నాకు ప్రాణహాని ఉందని బొత్స ప్రకటించారు. ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా బొత్సకు (Botcha Satyanarayana) ఎటువంటి భయం అవసరం లేదు. బొత్స మాటలను బట్టి చూస్తే. జగన్ రెడ్డి వల్లే బొత్సకు ప్రాణహాని ఉందని అనిపిస్తుంది.
TDP Chief Palla Srinivasarao Shocking Comments
జగన్ రెడ్డిని (YS Jagan) దాటి వెళ్లినా, పార్టీలో ఆయనకన్నా ఎక్కువ పేరు సంపాదించుకొన్నా వాళ్లని అంతం చేస్తాడు. వైఎస్ వివేకాను ఆ కారణంగానే హత్య చేశాడు. ప్రతిపక్ష నేతగా బొత్స (Botcha Satyanarayana) బాగా ఫోకస్ అవుతున్నారు. మండలిలో కూడా ప్రశ్నోత్తరాల సమయంలో బొత్స పనితీరు బాగుంది. బొత్సకు వైసీపీ నుంచే ప్రాణ హానీ ఉందని మాకు అనిపిస్తుంది. బొత్సకు కావాలంటే ప్రభుత్వ పరంగా భద్రత కల్పిస్తామని హామీ ఇస్తున్నాం అని పల్లా స్పష్టం చేసారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ (Palla Srinivasarao) మాట్లాడుతూ… రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో టీసీఎస్, మహేంద్ర, లూలూ, రిలయన్స్, ఎన్టీపీసీ గ్రీన్ టెక్ హైడ్రోజన్, వంటి అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయంటే సీఎం చంద్రబాబు గారి వల్లే అన్నారు. విశాఖకు ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ రాబోతోంది. విశాఖలో ఏఐకి సంబంధించి ఒక డేటా సెంటర్ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ప్రారభించబోతున్నారు. ఢిల్లీలో గూగూల్ కు చెందిన రైడెన్ తో రూ.87,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒప్పందం చేసుకోబోతున్నాం. ప్రసిద్ధి చెందిన డేటా సెంటర్ గా వర్జీనియా ఉంది. రేపు వరల్డ్ డేటా సెంటర్ గా విశాఖ మారబోతోంది. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా చేయాలన్న లక్ష్యంతో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు కృషి చేశారు.
చంద్రబాబుపై నమ్మకంతో అనేక పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయి. విశాఖను డేటా హబ్ గా, డేటా వ్యాలీగా ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లబోతున్నాం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ సాకారంతో నేడు విశాఖ ఐటీ సీటీగా రూపాంతరం చెందబోతోంది. విజన్ 2047 లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంటే… జగన్ రెడ్డి అడుగడుగునా భవిష్యత్ భయంతో అడ్డుపడుతున్నాడు. రాస్ట్ర ప్రయోజనాలను అడ్డుకుంటున్నారు. రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు రాకుండా చూడాలని కుట్రలు చేస్తున్నారు. పెట్టుబడి దారులకు భయాందోళనలు కలిగించేలా జగన్ అల్లర్లు చేస్తున్నారు. పెట్టబడులు పెట్టకండని అనేక ఆర్థిక సంస్థలకు వైసీపీ వాళ్లు లేఖలు రాసి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.
Palla Srinivasarao – పీపీపీకి అర్థం తెలియని వ్యక్తి జగన్
జగన్ రెడ్డి (YS Jagan) మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై తప్పుడు ప్రచారం చేశారు. గత ఐదేళ్లల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కు జగన్ రెడ్డి (YS Jagan) ఒక్కపైసా ఖర్చు చేయలేదు. మెడికల్ కాలేజీల నిర్మాణాలకు రూ.8,700 కోట్లు కావాల్సి ఉంటే వైసీపీ కేవలం రూ.1400 కోట్లు ఖర్చు చేసింది. అది కూడా కేంద్రం నిధులే ఖర్చు చేసింది. ఐదు మెడికల్ కాలేజీలను అరకొర వసతులతో ప్రారంభించారు. ఒక్క కాలేజీని కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయలేదు. ఆస్పత్రి నిర్మాణం లేకుండానే మెడికల్ కాలేజీల బిల్డింగులు నిర్మించారు. సరైన వసతులు, సౌకర్యాలు లేకుండా శంకుస్థాపన చేసి కట్టేశామని ప్రచారం చేసుకుంటున్నారు. పులివెందుల సీఎంగా ఉండి రూ.400 కోట్లతో పులివెందుల మెడికల్ కాలేజీ కట్టారు. అక్కడా కనీసం సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోయాడు. మిగతా కాలేజీల నిర్మాణానికి ఇంకా రూ.7,300 కోట్లు కావాలి. పీపీపీ మోడల్ లో ప్రభుత్వం వెళ్తోంది. రూ.7,300 కోట్లు ఖర్చు చేయాలి.
వైసీపీ ప్రవేశపెట్టిన జీఓ ప్రకారం ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీల పూర్తికి ఇంకా 15 ఏళ్లు పడుతుంది. ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మీరు ఇచ్చిన ఫీజు విధానం చూస్తే ఆల్ ఇండియా కోటాకు 15 శాతం పెట్టారు. 85 శాతం లో 50 శాతం కన్వీనర్ కోటా పెట్టారు. మిగిలింది 35 శాతంలో 15 శాతం రూ.12 లక్షలు. మిగతాది రూ.20 లక్షల చొప్పున పెట్టారు. త్వరగా మెడికల్ కాలజీల నిర్మాణాలు పూర్తి కావాల్సిన అవసరం ఉంది. ది పెట్టబడుల ద్వారా సాధ్యమవుతుంది.
మీ తండ్రి వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు డబ్బులు ఇచ్చే విధానమే కదా. అప్పుడే ప్రభుత్వ కళాశాలలు పెట్టొచ్చు కదా.? ప్రజలకు వేగవంతంగా సేవలు అందాలన్న ఉద్దేశంతోనే పీపీపీ మోడల్ తీసుకొచ్చాం. ఈ విధానంపై జగన్ రెడ్డి తేడా తెలుసుకోవాలి. పోర్టుల్లో కూడా పీపీపీ మోడల్ లోనే నిర్మాణాలు జరుగుతున్నాయి. జగన్ లో భయం పట్టుకుంది. జగన్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. అందుకే ఆందోళనలో ఏదేదో చేస్తున్నాడు. ఏదేదో మాట్లాడుతున్నాడు. కేంద్రం నిర్మిస్తున్న ప్రాజెక్టులను చూస్తే చాలా సమయం పడుతుంది. అందుకే పోలవరం ప్రాజెక్ట్ ను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడాము
విశాఖ స్టీల్ ప్లాంట్ పై జగన్ రెడ్డి (YS Jagan) తప్పుడు ప్రచారం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కు కేంద్రం నుంచి ప్రత్యేక సాయం ద్వారా రూ.11,440 కోట్లు సాధించాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకున్నాం. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రైవేట్ పరం కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాం. స్టీల్ ప్లాంట్ ను మేనేజ్ మెంట్, కార్మిక సంఘాలు లాభాల బాటలో తేవాల్సిన అవసరం ఉంది. కేంద్రం, రాష్ట్రం సహకారం అందిస్తాం. 32 సెక్షన్లను ప్రైవేట్ పరం చేయడం లేదు. ఇప్పటికీ కాంట్రాక్టర్లే అక్కడ పని చేస్తున్నారు. 1000 మంది 32 భాగాలుగా పనిచేస్తున్నార్నది జగన్ రెడ్డి గమనించాలి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
కల్తీ మద్యానికి ఆద్యుడు జగనే
జగన్ రెడ్డి పాపాలు నేడు ప్రజలకు శాపాలుగా మారాయి. కల్తీ మద్యం మొత్తం కుంభకోణం జగన్ రెడ్డి ప్రోత్సహించిందే. కొందరు వైసీపీ ముసుగు వేసుకొని టీడీపీలోకి వచ్చారు. వాళ్లను ప్రక్షాళన చేస్తున్నాం. తప్పు చేస్తే కచ్చితంగా శిక్ష వేస్తాం. తప్పు చేశారనే పార్టీ నుంచి కల్తీమద్యం కేసులో సస్పెండ్ చేశాం. జగన్ రెడ్డి తన హయాంలో కల్తీ మద్యం కుంభకోణం బయటపడినా ఒక్క వైసీపీ నేతపై కూడా చర్యలు తీసుకోలేదు.
నెల్లూరులో స్మార్ట్‌ స్ట్రీట్‌ వెండింగ్‌ మార్కెట్‌ ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు
నెల్లూరు నగరంలోని మైపాడు గేటులో స్మార్ట్‌ స్ట్రీట్‌ వెండింగ్‌ మార్కెట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. రూ.7 కోట్లతో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన స్మార్ట్‌ కంటెయినర్‌ షాపులను వర్చువల్‌గా సీఎం ప్రారంభించారు. వీధి వ్యాపారులకు ఇబ్బంది లేకుండా స్థిర వ్యాపారం చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. 30 మాడ్యులర్‌ కంటెయినర్లతో 120 షాపులు ఏర్పాటు చేశారు. ఒక్కో కంటెయినర్‌లో నాలుగు షాపులు ఏర్పాటు చేశారు. మహిళలు, దివ్యాంగులు, వెనకబడిన వర్గాలకు లబ్ధి కలిగేలా వినూత్న ప్రయత్నం చేశారు. ఈ కొత్త ఆలోచనపై మంత్రి నారాయణ, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులని సీఎం అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ ఛైర్మన్లు, కూటమి నేతలు పాల్గొన్నారు.
Also Read : Ramachander Rao: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో గెలుపు మాదే – బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు
The post Palla Srinivasarao: బొత్సకు జగన్ నుంచి ప్రాణహాని ఉంది – టీడీపీ అధ్యక్షుడు పల్లా  appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CJI B R Gavai: తనపై దాడికి యత్నం ఘటనపై స్పందించిన సీజేఐ గవాయ్‌CJI B R Gavai: తనపై దాడికి యత్నం ఘటనపై స్పందించిన సీజేఐ గవాయ్‌

CJI B R Gavai : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌. గవాయ్‌పై దాడికి యత్నించిన ఘటన ఇటీవల కలకలం రేపింది. దీన్ని పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. తాజాగా దీనిపై సీజేఐ జస్టిస్‌

Kiran Mazumdar Shaw: వివాదం వేళ సీఎం, డిప్యూటీ సీఎంతో కిరణ్‌ మజుందార్‌ షా భేటీKiran Mazumdar Shaw: వివాదం వేళ సీఎం, డిప్యూటీ సీఎంతో కిరణ్‌ మజుందార్‌ షా భేటీ

    ఇటీవల బెంగళూరు నగర రహదారులు, చెత్తపై తీవ్ర విమర్శలు చేసిన బయోకాన్‌ సీఎండీ కిరణ్‌ మజుందార్‌ షా ప్రభుత్వ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. కిరణ్‌ మజుందార్‌ కు మద్దతుగా పారిశ్రామిక వేత్త హర్ష్‌ గొయెంకా.. సమస్యకు పరిష్కారం

India: అటవీ విస్తీర్ణంలో భారత్‌కు తొమ్మిదో స్థానంIndia: అటవీ విస్తీర్ణంలో భారత్‌కు తొమ్మిదో స్థానం

India : ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణంలో భారత్‌ తొమ్మిదో స్థానానికి చేరుకుంది. వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధిలో మూడో స్థానాన్ని నిలుపుకొందని బుధవారం విడుదలైన గ్లోబల్‌ ఫారెస్ట్‌ రిసోర్స్‌ అసెస్‌మెంట్‌-2025 నివేదికలో వెల్లడైంది. గతేడాది పదో స్థానంలో ఉన్న భారత్‌