Perni Nani : మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నానిపై (Perni Nani) చిలకలపూడి పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. మచిలీపట్నం ఆర్‌ఆర్ పేట పీఎస్‌లో సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేసాన్న అభియోగంపై పేర్ని నానితో సహా 29 మందిపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై అభియోగం నమోదు చేశారు. ఈ మేరకు పేర్ని నానికి
వైసీపీ చలో మెడికల్ కాలేజీ నేపథ్యంలో పేర్ని నాని (Perni Nani) ఆధ్వర్యంలో వైసీపీ నేతలు మెడికల్ కళాశాల వద్ద ఇటీవల నిరసన చేపట్టారు. కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయని… నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనితో పోలీసులతో వైసీపీ (YSRCP) నాయకులు వాగ్వాదానికి దిగి లాఠీలు లాక్కున్నారు. ఈ ఘటనలో 400 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసు స్టేషన్ కు విచారణకు రావాలని పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. అయితే తాము చెప్పేవరకూ పోలీసుల వద్దకు ఎవరూ వెళ్లొద్దంటూ వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. దీనితో సుబ్బన్నను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ విషయం తెలిసి పేర్ని నాని పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలతో కలిసి మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. నేరుగా సీఐ గదిలోకి వెళ్లి బెదిరింపులకు దిగారు. పలువురు వైసీపీ నేతలు కూడా పోలీసులను అవహేళన చేస్తూ మాట్లాడారు. అలా మాట్లాడం సరికాదంటూ సీఐ ఏసుబాసు అనడంతో పేర్నినాని రెచ్చిపోయారు. ఆయనకు వేలు చూపిస్తూ… మావాళ్లనే తీసుకొస్తావా.. అంటూ రెచ్చిపోయి బెదిరింపులకు దిగారు. దీనితో సీఐపై పేర్ని నాని బెదిరింపులకు పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి పేర్ని నానితో పాటు మరో 29 మందిపై కేసు నమోదు చేశారు.
Perni Nani – స్టేషన్‌కు వెళ్లి మరీ పోలీసులను బెదిరించడం దారుణం – మంత్రి అనిత
మాజీమంత్రి పేర్ని నాని మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరీ పోలీసులను బెదిరించడం దారుణమని ఏపీ హోం మంత్రి అనిత అన్నారు. అతని చర్యలు పోలీసులను అవమానించేలా ఉన్నాయన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో శనివారం హోం మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పేర్ని నానిపై చర్యలు తీసుకుంటామన్నారు. తప్పు చేసిన వారికి నోటీసులిస్తామని, కేసులు పెడతామని హెచ్చరించారు.
‘‘ప్రజలు బుద్ధి చెప్పినా వైకాపా నేతల తీరు మారలేదు. నకిలీ మద్యం తయారీపై కఠిన చర్యలు తప్పవు. సొంత పార్టీ నేతలున్నా చర్యలకు వెనుకాడం. అక్రమాలకు పాల్పడిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నకిలీ మద్యం తయారీలో భాగస్వాములందరిపై కేసులు పెడతాం. అందులోని సూత్రధారులనూ బయటపెడతాం. దీని వెనుక ఉన్న కుట్రలను ఛేదిస్తాం’’ అని పేర్కొన్నారు. అనంతరం వెదురుకుప్పం మండలం దేవలంపేటలో ఇటీవల జరిగిన అంబేడ్కర్ విగ్రహం కాల్చివేత ఘటన నేపథ్యంలో.. ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. దళితులకు న్యాయం చేయలేని వైసీపీ పెద్దలు వారి ముసుగులో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దళితుల జోలికొస్తే తీవ్ర చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Also Read : Kinjarapu Rammohan Naidu: నవంబర్ 15 నుంచి విజయవాడ- సింగపూర్ మధ్య ఇండిగో విమాన సర్వీసు
The post Ex Minister Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Ex Minister Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు
Categories: