hyderabadupdates.com movies కింగ్ తాలూకాలో అభిమాని ఎమోషన్స్

కింగ్ తాలూకాలో అభిమాని ఎమోషన్స్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందిన ఆంధ్రకింగ్ తాలూకా నవంబర్ 28 విడుదల కానుంది. ఇంకో యాభై రోజుల కంటే తక్కువ సమయమే ఉండటంతో టీమ్ ప్రమోషన్లు మొదలుపెట్టేసింది. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ కాగా ఇవాళ టీజర్ ని తీసుకొచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం, ఉపేంద్ర టైటిల్ రోల్ పోషించడం, వివేక్ మెర్విన్ సంగీతం ఇలా చాలా ఆకర్షణలతో అంచనాలు పెంచేలా రూపొందిన ఈ ప్రాజెక్టు బిజినెస్ పరంగా కూడా క్రేజ్ సంపాదించుకుంది. ఇక టీజర్ విషయానికి వస్తే స్టోరీ పూర్తిగా రివీల్ చేయకుండా కట్ చేశారు.

ఒక చిన్న పట్టణం. అందులో మధ్యతరగతికి చెందిన ఓ కుర్రాడు (రామ్). చిన్నప్పటి నుంచే తండ్రి (రావు రమేష్) చూపించిన సినిమా పిచ్చి నరనరాల్లో ఎక్కేసి ఆంధ్రకింగ్ బిరుదున్న హీరో (ఉపేంద్ర) ని ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానిస్తూ ఉంటాడు. మొదటి రోజు ఫస్ట్ షో చూడనిదే, సంబరాలు చేస్తేనే జీవితంలో ఏదో సాధించినట్టు ఫీలవుతాడు. ఇతగాడికో లవ్ స్టోరీ (భాగ్యశ్రీ బోర్సే) కూడా ఉంటుంది. ఇలా లైఫ్ సాగుతూ ఉండగా అనుకోని సంఘటనలు జరుగుతాయి. తాను ప్రేమించే హీరోని ఇతరులు అవమానించే పరిస్థితి వస్తుంది. అదెందుకు జరిగింది, ఇతని లక్ష్యం ఏమిటి, చివరికి ఏం సాధించాడనేది తెరమీద చూడాలి.

చాలా గ్యాప్ తర్వాత రెగ్యులర్ మాస్ వదిలి రామ్ తనకు సూటయ్యే పాత్రలో ఫ్రెష్ గా ఉన్నాడు. లుక్స్, యాక్టింగ్ అన్నీ ఒకప్పటి రామ్ ని గుర్తు చేశాయి. ఉపేంద్రని బహుశా ట్రైలర్ కోసం దాచి పెట్టరేమో ఇందులో చూపించలేదు. భాగ్యశ్రీ బోర్సే లుక్స్ సాంప్రదాయ బద్దంగా లవ్లీగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంటెంట్ కు తగ్గట్టు సాగింది. మలయాళం, హిందీలో వచ్చాయి కానీ తెలుగులో ఇలా హీరో – ఫ్యాన్ మధ్య ఎమోషన్ ని తీసుకుని సినిమాలు తీసినవాళ్లు లేరు. దర్శకుడు మహేష్ బాబు మొదటిసారి ఆ ప్రయోగం చేశారు. కమర్షియల్ మీటర్ మిస్ కాకుండా తీసిన ఆంధ్రకింగ్ తాలూకా మీద ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు.

Related Post

ఏవండీ.. జాగ్ర‌త్త‌: బాబుకు భువ‌నేశ్వ‌రి, జ‌గ‌న్‌కు భార‌తి జాగ్ర‌త్త‌లు!ఏవండీ.. జాగ్ర‌త్త‌: బాబుకు భువ‌నేశ్వ‌రి, జ‌గ‌న్‌కు భార‌తి జాగ్ర‌త్త‌లు!

ఏపీ ముఖ్య‌మంత్రిగా నిత్యం బిజీగా ఉంటున్న చంద్ర‌బాబు, విప‌క్ష(ప్ర‌ధాన కాదు) నేత‌గా, మాజీ ముఖ్య మంత్రిగా ఉన్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. దీపావ‌ళి వేళ స‌తీమ‌ణుల‌తో క‌లిసి పండుగను ఘ‌నంగా జ‌రుపుకొన్నారు. అయితే.. ఇరువురు క‌లిసికాదు.. వేర్వేరుగానే సుమా!. చంద్ర‌బాబు త‌న