hyderabadupdates.com movies బాలయ్య ఎఫెక్ట్: జనసేన కూల్ అయిందా..!

బాలయ్య ఎఫెక్ట్: జనసేన కూల్ అయిందా..!

టీడీపీ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఇటీవలి కాలంలో అంతర్గతంగా అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా బాలయ్య సభలో చేసిన వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో కలకలం రేపాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. దీంతో బాలయ్యపై మీమ్స్, కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడమే కాకుండా పరిస్థితిని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలావుండగా, తాజాగా బాలయ్య చేసిన పనితో జనసేన వర్గాలు కూల్ అయ్యాయనే చర్చ సాగుతోంది.

జనసేన ఎమ్మెల్యే, కాకినాడ రూరల్ ప్రతినిధి పంతం నానాజీ కుమారుడి వివాహం విజయవాడలో శుక్రవారం జరిగింది. ఈ వేడుకకు బాలయ్య హాజరయ్యారు. అక్కడ ఆయన జనసేనకు చెందిన పలువురు నాయకులతో సత్సహజంగా కలిసిపోయారు. వారితో పలు విషయాలపై మాట్లాడి, నవ్వుతూ సంభాషించారు. పంతం కుమారుడిని, కాబోయే కోడలిని ఆశీర్వదించిన బాలయ్య కొంతసేపు మండపంలోనే ఉన్నారు.

దీంతో జనసేన వర్గాల్లో సంతృప్తి వ్యక్తమైందని తెలుస్తోంది. ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన నాయకులు ఇప్పుడు కొంత సడలినట్టుగా కనిపిస్తున్నారు. అప్పట్లో కొందరు బాలయ్య నుంచి క్షమాపణలు కోరగా, మరికొందరు సీఎం చంద్రబాబు ఆయన్ని అడ్డుకోవాలని వ్యాఖ్యానించారు.

అయితే ఇప్పుడు బాలయ్య నానాజీ కుటుంబ వేడుకలో పాల్గొనడం, ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకపోవడం ద్వారా తాను, జనసేన మధ్య ఎలాంటి విభేదాలు లేవన్న సంకేతం ఇచ్చినట్టుగా అనిపించింది.

మరి ఈ వ్యవహారం ఇంతటితో ముగిసిందా? లేక జనసేన వర్గాల్లో ఇంకా అసంతృప్తి మిగిలే ఉందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ప్రస్తుతం బాలయ్య వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Related Post

ప్రశాంత్ కిశోర్ పార్టీ.. అభ్యర్దులతో షాక్ ఇచ్చాడుగా!ప్రశాంత్ కిశోర్ పార్టీ.. అభ్యర్దులతో షాక్ ఇచ్చాడుగా!

ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిశోర్ జన్ సూరాజ్ పార్టీనీ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే బీహార్ ఎన్నికల కోసం తమ మొదటి అభ్యర్థుల లిస్ట్‌ను రిలీజ్ చేసి ఆశ్చర్యం కలిగించారు. ఎందుకంటే ఈ లిస్ట్‌లో మామూలు

Puri Jagannadh–Vijay Sethupathi film’s title & teaser release postponed
Puri Jagannadh–Vijay Sethupathi film’s title & teaser release postponed

In the wake of the devastating Karur tragedy, the team of the upcoming pan-Indian film starring Vijay Sethupathi and directed by Puri Jagannadh has postponed their title and teaser launch