hyderabadupdates.com Gallery Nalgonda Police: అధిక వడ్డీ పేరుతో రూ.50 కోట్ల మోసం చేసిన నిందితుడి అరెస్టు

Nalgonda Police: అధిక వడ్డీ పేరుతో రూ.50 కోట్ల మోసం చేసిన నిందితుడి అరెస్టు

Nalgonda Police: అధిక వడ్డీ పేరుతో రూ.50 కోట్ల మోసం చేసిన నిందితుడి అరెస్టు post thumbnail image

Nalgonda Police : అధిక వడ్డీ పేరుతో రూ.50 కోట్ల మేర మోసానికి పాల్పడిన నిందితుడిని నల్గొండ (Nalgonda Police) జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రెండు విలువైన కార్లు, ఆస్తి పత్రాలు, బాధితులకు ఇచ్చిన ప్రామిసరీ నోట్లు, 7 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ కేసు వివరాలను వెల్లడించారు.
Nalgonda Police Shocking
పీఏ పల్లి (PA Palli) మండలం, వద్దిపట్ల గ్రామానికి చెందిన రమావత్‌ బాలాజీ 2020లో ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ వ్యాపారం ప్రారంభిస్తానని చెప్పి… బంధువుల వద్ద రూ.5 లక్షలు రూ.2ల వడ్డీకి తీసుకున్నాడు. వ్యాపారంలో నష్టపోయి… రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం వైపు అడుగులు వేశాడు. రూ.6 వడ్డీ చొప్పున అదే గ్రామానికి చెందిన వారి దగ్గర నుంచి రూ.15 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. సకాలంలో వడ్డీ చెల్లిస్తూ నమ్మకం కలిగించాడు. మరికొంత మంది ఏజెంట్లను నియమించుకొని… చుట్టుపక్కల గిరిజన తండాల్లో అధిక వడ్డీకి అప్పులు తీసుకున్నాడు. ఈ డబ్బుతో బంధువులు, స్నేహితుల పేరిట వ్యవసాయ భూములు, ఇళ్లు, ఖరీదైన కార్లు, బైక్‌లు కొనుగోలు చేసి జల్సాలు చేసేవాడు.
ఇంకా అధిక డబ్బులు వసూలు చేసే ఉద్దేశంతో నెలకు రూ.10 వడ్డీ ఇస్తానని జనాలను నమ్మించి రూ.కోట్లలో డబ్బులు వసూలు చేసి… వడ్డీ మాత్రమే ఇచ్చి బాధితుల వద్ద ఉన్న ప్రామిసరీ నోటు వెనుక వడ్డీ ఇచ్చినట్లు రాసి ఇచ్చేవాడు. బ్యాంక్‌లో వచ్చే వడ్డీ కంటే పది రేట్లు ఎక్కువ వడ్డీ ఇవ్వడంతో జనాలు ఆకర్షితులై బాలాజీ నాయక్‌కి అధికమొత్తంలో డబ్బులు ఇచ్చారు. గత కొన్ని నెలలుగా బాధితులకు అసలు, వడ్డీ డబ్బులు ఇవ్వలేకపోయే సరికి.. వారంతా అతడిపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు. దీంతో వారి నుంచి తప్పించుకొని పారిపోయాడు. తాజాగా నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. రిమాండ్‌కి తరలించారు.
Also Read : Afghanistan: అఫ్గాన్ మంత్రి ప్రెస్‌మీట్‌ లో మహిళలపై ‘నిషేధం’ ఆరోపణపై స్పందించిన కేంద్రం
The post Nalgonda Police: అధిక వడ్డీ పేరుతో రూ.50 కోట్ల మోసం చేసిన నిందితుడి అరెస్టు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post