hyderabadupdates.com movies సంక్రాంతి మేజిక్ అంత ఈజీ కాదు

సంక్రాంతి మేజిక్ అంత ఈజీ కాదు

2025 టాప్ బ్లాక్ బస్టర్స్ లో సంక్రాంతికి వస్తున్నాం స్థానం చాలా స్పెషల్. ఓజి ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా ప్యాన్ ఇండియా ఫ్లేవర్ లేకుండా కేవలం తెలుగు వెర్షన్ తోనే వెంకటేష్ చేసిన వసూళ్ల అరాచకం అంతా ఇంతా కాదు. దీని ప్రభావం వల్లే మన శంకరవరప్రసాద్ గారుకి ఉండాల్సిన డిమాండ్ కన్నా ఎక్కువ రేట్ పలుకుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన మేజిక్ అది. ఏ మాత్రం లాజిక్ లేని కథను తీసుకుని ఫ్యామిలీ ఆడియన్స్ కడుపుబ్బా నవ్వేలా తీర్చిదిద్దిన తీరు కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఇందులో చూపించిన నేటివిటీ, కంటెంట్ అన్ని భాషలకు సూటవ్వదు. అందుకే ఇప్పటిదాకా రీమేక్ జరగలేదు.

తాజాగా హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా దిల్ రాజే నిర్మాతగా తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాలీవుడ్ టాక్. నార్త్ ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు కొన్ని కీలక మార్పులు చేసుకుని షూటింగ్ కు వెళ్లేలా నిర్ణయం తీసుకున్నారట. కాకపోతే దర్శకుడు ఇంకా లాక్ కాలేదు. కామెడీ మీద మంచి పట్టున్న వాళ్లయితేనే బెటర్. అనిల్ కేమో ఆసక్తి లేదు. రోహిత్ శెట్టి లాంటి వాళ్ళు అందుబాటులో లేరు. సో సరైన ఆప్షన్ ని వెతికి పట్టుకోవడం సవాల్ గా మారిందట. అక్షయ్ వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ప్రస్తుతం తనతో ఒప్పం రీమేక్ చేస్తున్న ప్రియదర్శన్ ని రిక్వెస్ట్ చేయడానికి చూస్తున్నారట. కానీ ఆయన నో అనొచ్చు.

అధికారిక ప్రకటన రాలేదు కానీ సంక్రాంతికి వస్తున్నాం మేజిక్ ని రీ క్రియేట్ చేయడం మాత్రం పెద్ద సవాలే. ఒకప్పుడు పెళ్ళాం ఊరెళితే, రెడీ లాంటి సూపర్ హిట్లు హిందీలోనూ గొప్ప విజయం సాధించాయి. కానీ అప్పటి ఆడియన్స్ ఇప్పటి ప్రేక్షకుల అభిరుచులకు మధ్య బోలెడు వ్యత్యాసం వచ్చేసింది. కాకపోతే సరిగా రాసుకుంటే మెప్పించే అవకాశాలు లేకపోలేదు. అంతంతమాత్రం ఉన్న సన్నీ సంస్కారికి తులసి కుమారి లాంటి ఫ్లాపులకే ఓ మోస్తరు వసూళ్లు ఇచ్చిన అక్కడి జనాలు సంక్రాంతికి వస్తున్నాం లాంటి వాటిని ఎగబడి చూస్తారు. చిక్కల్లా వాళ్ళ సెన్సిబిలిటీస్ కు తగ్గట్టు ఛేంజెస్ చేయడమే.

Related Post

ఈ దీపావళికి ఇదే పెద్ద సర్ప్రైజ్ఈ దీపావళికి ఇదే పెద్ద సర్ప్రైజ్

ఈ దీపావళికి మూడు రోజుల వ్యవధిలో నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. అన్ని సినిమాలూ ప్రామిసింగ్‌గా కనిపించడంతో గత దీపావళి లాగే ఈసారి కూడా 100 పర్సంట్ సక్సెస్ రేట్ చూస్తామా అన్న ఆశలు కలిగాయి. కానీ పండుగ రేసులో ముందుగా వచ్చిన ‘మిత్రమండలి’

యానిమల్ సంగీత దర్శకుడి దశ తిరిగిందియానిమల్ సంగీత దర్శకుడి దశ తిరిగింది

హర్షవర్షన్ రామేశ్వర్. ఈ పేరు మ్యూజిక్ లవర్స్ కు బాగా పరిచయమే కానీ సాధారణ ప్రేక్షకులకు తమన్, దేవిశ్రీ ప్రసాద్ గురించి తెలిసినంతగా ఇతని గురించి అవగాహన తక్కువ. అర్జున్ రెడ్డికి పాటలు కంపోజ్ చేసింది రదనే కానీ బ్యాక్ గ్రౌండ్