hyderabadupdates.com movies కాంతార మరోసారి కుమ్మేసింది

కాంతార మరోసారి కుమ్మేసింది

నిన్న మరో వీకెండ్ పూర్తిగా కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. మొన్నటిదాకా వీక్ డేస్ వసూళ్లలో చెప్పుకోదగ్గ డ్రాప్ చూపించిన కాంతారా శనివారం ఆదివారం అనూహ్యంగా పుంజుకుని థియేటర్లను నింపేసింది. చాలా చోట్ల ఎక్స్ ట్రా షోలు యాడ్ చేయడం కనిపించింది. కొత్తగా రిలీజైన శశివదనే, ఆరి, కానిస్టేబుల్, మటన్ సూప్ లాంటివి కనీస స్థాయిలో మెప్పించలేకపోవడం కాంతారకు వరంగా మారింది. ఓజికి డీసెంట్ ఆక్యుపెన్సీలు కనిపించినా రిషబ్ శెట్టి అంత దూకుడుగా పవన్ కళ్యాణ్ లేకపోవడం ఫిగర్స్ లో కనిపిస్తోంది. రెండింటి మధ్య వారం వ్యత్యాసం ఉండటం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.

అయిదు వందల కోట్ల గ్రాస్ మొదటి పది రోజుల లోపే సునాయాసంగా దాటేసిన కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ ఇంకో మూడు నాలుగు రోజుల్లో ఏడు వందల కోట్లు ఈజీగా అందుకుంటుంది. కాకపోతే ఈ వీక్ యూత్ ఫుల్ మూవీస్ ఉన్న నేపథ్యంలో కలెక్షన్లు తగ్గే అవకాశాలు లేకపోలేదు. డ్యూడ్, కె ర్యాంప్, తెలుసు కదా, మిత్రమండలిలో ఒకటి రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా కొంత ప్రభావం కాంతార చాప్టర్ 1 మీద ఉంటుంది. నిన్న ఒక్క రోజే సుమారు యాభై అయిదు కోట్ల దాకా గ్రాస్ వచ్చి ఉండొచ్చని ట్రేడ్ అంచనా. హోంబాలే నుంచి అధికారిక నెంబర్లు రావడానికి కొంత టైం పట్టొచ్చు.

ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ కోసం పోరాడుతున్న కాంతార చాప్టర్ 1 ఇండియాలో మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హిందీలో రెస్పాన్స్ పెరుగుతున్న వైనం గుర్తించిన రిషబ్ శెట్టి ప్రత్యేకంగా అక్కడి సింగల్ స్క్రీన్లకు వెళ్లి మరీ ఫ్యాన్స్ ని పలకరిస్తున్నాడు. వరసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. బాలీవుడ్ లో వంద కోట్లు దాటుతుందని ఎవరూ ఊహించలేదు. ఇక కర్ణాటక కలెక్షన్లు అరాచకం అనిపిస్తున్నాయి. ఏపీ తెలంగాణలో మైత్రి సంస్థ రిటర్నబుల్ కింద పంపిణీ చేయడంతో లాభ నష్టాల లెక్కలు అంత సులభంగా బయటికి రాకపోవచ్చు. మొత్తానికి కాంతార మళ్ళీ కుమ్మేసిన మాట వాస్తవం.

Related Post