hyderabadupdates.com movies ట్రైలర్లు పాటలు… ప్రతీదీ వాయిదా అంటే ఎలా

ట్రైలర్లు పాటలు… ప్రతీదీ వాయిదా అంటే ఎలా

ఒకప్పుడు అంటే పాతికేళ్ల క్రితం సినిమా ప్రింట్లు థియేటర్లకు చేరుకోవడంలో ఆలస్యం జరిగి వాయిదాలు పడటమనేది సహజంగా జరిగేది. ఇది ఎన్నోసార్లు చూసిందే. శాటిలైట్ పరిజ్ఞానం వచ్చిన తర్వాత ఈ సమస్య తీరింది. నేరుగా ఉపగ్రహం ద్వారా స్క్రీనింగ్ చేయడమనే ప్రక్రియ ఎన్నో ఇబ్బందులు తొలగించింది. అయినా సరే ఆర్థిక కారణాల వల్ల పలు సందర్భాల్లో కేడీఎంలు రాక డౌన్ లోడ్ చేసిన మూవీని ప్లే చేయలేక ఎగ్జిబిటర్లు ఎదురుకుంటున్న సమస్యలు లేకపోలేదు. సరే మెయిన్ సినిమా రిలీజ్ అంటే ఏదో అనుకోవచ్చు కానీ ఇప్పుడీ పోస్ట్ పోన్ల పర్వం ట్రైలర్లు, లిరికల్ వీడియోలకు పాకిపోయింది.

తెలుసు కదా ట్రైలర్ ని మీడియా లాంచ్ ఈవెంట్ లో ప్రదర్శించాక గంటల తరబడి వెయిటింగ్ తర్వాత కూడా యూట్యూబ్ లో వదల్లేదు. ఏం జరిగిందో అర్థం కాక ఫ్యాన్స్ అయోమయం చెందారు. వేడుకకు వెళ్లిన వాళ్ళు కంటెంట్ గురించి పెడుతున్న ట్వీట్లు ఆసక్తి పెంచుతుండగా ఎంతకీ రాని ఆన్ లైన్ ట్రైలర్ కోసం అభిమానులు చాలానే ఎదురు చూశారు. చివరికి లేట్ ఆఫ్టర్ నూన్ వదిలారు. ఇక మన శంకరవరప్రసాదు గారు నుంచి మీసాల పిల్ల సాంగ్ ముందు చెప్పిన ప్రకారం అక్టోబర్ 13 నాలుగు గంటల తర్వాత వచ్చేయాలి. కానీ చావు కబురు చల్లగా చెప్పినట్టు రేపటికి వాయిదా అంటూ తర్వాత ప్రకటించారు.

ఇలా జరగడం కొత్తేమి కాదు. పవన్ కళ్యాణ్ ఓజి ట్రైలర్ విషయంలో జరిగిన రచ్చ గుర్తుందిగా. ఈవెంట్ లో ప్లే చేసిన కంటెంట్ ని అందరికి అందుబాటులోకి తీసుకురావడానికి పది గంటల పైనే సమయం పట్టింది. గతంలో ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ లాంటి హీరోలు సైతం ఈ ప్రమోషనల్ కంటెంట్లు చెప్పిన టైంకి రాకపోవడమనే ప్రాబ్లమ్ ని అందరూ ఫేస్ చేశారు. ఇకనైనా దర్శక నిర్మాతలు అభిమానుల సమయానికి విలువిచ్చి ప్రకటించిన సమయానికి టీజర్లు, పాటలు వదలాలని కోరుకుందాం. చెవిటివారి ముందు శంఖం ఊదినట్టు ఈ పరిస్థితిలో మార్పు రావడం కష్టమే.

Related Post

ఖైదీ 2 ఇక ఎప్పటికీ రాదేమోఖైదీ 2 ఇక ఎప్పటికీ రాదేమో

దర్శకుడు లోకేష్ కనగరాజ్ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాగా ఖైదీ స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. అంతకు ముందు మానగరం తీసి ప్రశంసలు అందుకున్నప్పటికీ అతని రియల్ స్టామినా బయట పెట్టింది మాత్రం కార్తినే. ఆ తర్వాత విజయ్, కమల్

DC Title Teaser: Lokesh Kanagaraj’s bloody intense acting debut in Devadas reduxDC Title Teaser: Lokesh Kanagaraj’s bloody intense acting debut in Devadas redux

The title teaser for DC, Kollywood star director Lokesh Kanagaraj’s maiden film as an actor, was released this evening. Also starring Bollywood actress Wamiqa Gabbi in a lead role, the