hyderabadupdates.com movies తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..

తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు సోమవారం సాయంత్రం ఢిల్లీలో భేటీ అయ్యారు. రెండు కీలక విషయాలపై ఆయన ప్రధానితో చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ముందుగా జీఎస్టీ 2.0 సంస్కరణలు అమలులోకి వచ్చిన తర్వాత తొలిసారి కలిసిన నేపథ్యంలో ప్రధాని మోడీకి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో పేదలు, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని ఈ సందర్భంగా ఆయన మోడీకి వివరించారు. ఏపీలోనూ దీని ఫలితాలను రాబడుతున్నామని, భారీ ఎత్తున ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.

జీఎస్టీ 2.0 ద్వారా రాష్ట్రానికి 8 వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిన నేపథ్యంలో ఆ లోటును పూడ్చాలని ఈ సందర్భంగా మోడీకి విన్నవించినట్టు తెలిసింది. అయితే ఈ సమస్య దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ ఉన్నందున దీనిపై కేంద్ర కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. చంద్రబాబు చెప్పిన విషయాలను ఆసక్తిగా విన్న ప్రధాన మంత్రి మోడీ తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం.

ఇక ఈ నెల 16న కర్నూలులో నిర్వహించనున్న “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” భారీ బహిరంగ సభకు ప్రధానిని ఆహ్వానించారు. జీఎస్టీ 2.0 సంస్కరణల అనంతరం ప్రజలకు చేకూరుతున్న లాభాలను వివరించే ప్రయత్నంలో దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ భారీ సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని ప్రధానికి అందజేశారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, 3 లక్షల మందికి పైగా ప్రజలు హాజరుకానున్నారని, వారికి జీఎస్టీ లాభాలను వివరించి అవగాహన కల్పిస్తామన్నారు. అదేవిధంగా గ్రామ గ్రామాన జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రచారం చేయనున్నట్టు తెలిపారు. ఆయా విషయాలపై ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు.

అదేవిధంగా నవంబరులో విశాఖ వేదికగా నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సు వివరాలను కూడా సీఎం చంద్రబాబు ప్రధానికి వివరించారు. ఈ సదస్సు ద్వారా లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఉన్నామని, ఈ విషయంలో కేంద్రం కూడా సహకరించాలని కోరారు. పెట్టుబడుల సదస్సుకు రావాలని ప్రధాని మోడీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా గూగుల్‌తో చేసుకోనున్న భారీ ఒప్పందం వివరాలను కూడా ప్రధానికి వివరించారు.

ఈ భేటీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు ఎంపీ), ఎంపీ శ్రీకృష్ణ దేవరాయులు (నరసరావుపేట) తదితరులు పాల్గొన్నారు.

Related Post

శభాష్ అక్షయ్… ఇది అసలైన హీరోయిజంశభాష్ అక్షయ్… ఇది అసలైన హీరోయిజం

సెలబ్రిటీలు, స్టార్లు తమ వ్యక్తిగత విషయాలను బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. అది సమాజానికి అంతో ఇంతో మంచి చేసేదే అయినా ఎందుకొచ్చిన గొడవలెమ్మని మౌనంగా ఉంటారు. పరిస్థితులు అవే మారతాయని సర్దిచెప్పుకుని నయవంచన చేసుకునే వాళ్లకు కొదవ లేదు. కానీ అక్షయ్