hyderabadupdates.com Gallery కొత్త కాన్సెప్ట్‌ తో ఆనంద్‌ దేవరకొండ!

కొత్త కాన్సెప్ట్‌ తో ఆనంద్‌ దేవరకొండ!

థియేటర్స్‌లో సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నా, ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌ పైన కూడా మంచి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే, ఈ డిజిటల్‌ వేదికలపై కూడా కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వరుసగా వస్తూనే ఉన్నాయి. ప్రేక్షకుల రుచికి తగ్గట్టుగా వినూత్న కథలతో ఓటీటీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌ను అందిస్తున్నాయి.

ఇలాంటి ట్రెండ్‌లో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కూడా తన కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సన్నద్ధమయ్యాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం పేరు ‘తక్షకుడు’. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

యాక్షన్‌, థ్రిల్లర్‌ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో “వేటలో జింక పిల్లలే నేరస్థులంటూ” చెప్పిన లైన్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ పోస్టర్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
The post కొత్త కాన్సెప్ట్‌ తో ఆనంద్‌ దేవరకొండ! appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

గాడి తప్పిన కాంగ్రెస్ పాల‌న జ‌నం ఆందోళ‌నగాడి తప్పిన కాంగ్రెస్ పాల‌న జ‌నం ఆందోళ‌న

హైద‌రాబాద్ : అడ్డ‌మైన హామీల‌తో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ స‌ర్కార్ జ‌నం పాలిట శాపంగా మారింద‌ని మండిప‌డ్డారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆరు గ్యారెంటీలకు మొదటి క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకొని చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు.

P Chidambaram: ఆపరేషన్ బ్లూస్టార్ పై చిదంబరం సంచలన వ్యాఖ్యలుP Chidambaram: ఆపరేషన్ బ్లూస్టార్ పై చిదంబరం సంచలన వ్యాఖ్యలు

    మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో పంజాబ్‌లోని స్వర్ణదేవాలయంలో 1984లో జరిపిన ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ పై ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వర్ణ దేవాలయాన్ని తిరిగి స్వాధీనం

Rohini Acharya: దమ్ముంటే కిడ్నీ దానమిచ్చి చర్చకు రండి – లాలూ కుమార్తె రోహిణి ఆచార్యRohini Acharya: దమ్ముంటే కిడ్నీ దానమిచ్చి చర్చకు రండి – లాలూ కుమార్తె రోహిణి ఆచార్య

      ఆర్జేడీ సుప్రీం నేతగా పార్టీ శ్రేణుల గుండెల్లో నిలిచిపోయిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఒక కిడ్నీ దానంచేసే దమ్ములేని వాళ్లు నాపై నిందలు వేస్తున్నారని లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తండ్రి మీద అచంచల