hyderabadupdates.com Gallery CM Mamata Banerjee: భూటాన్‌ వల్లే బెంగాల్‌ లో వరదలు – మమతా బెనర్జీ

CM Mamata Banerjee: భూటాన్‌ వల్లే బెంగాల్‌ లో వరదలు – మమతా బెనర్జీ

CM Mamata Banerjee: భూటాన్‌ వల్లే బెంగాల్‌ లో వరదలు – మమతా బెనర్జీ post thumbnail image

Mamata Banerjee : ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జల్‌పాయీగుడీ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక, పునరావాస చర్యలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూటాన్‌ నుంచి వెల్లువెత్తిన జలప్రవాహం కారణంగానే వరదలు సంభవించాయని ఆరోపించారు. జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.
CM Mamata Banerjee Shocking Comments
‘‘భూటాన్‌ నుంచి ముంచుకొచ్చిన నదీ జలాల కారణంగానే మాకు నష్టం జరిగింది. ఆ దేశం పరిహారం చెల్లించాలి’’ అని సీఎం మమతా బెనర్జీ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే అన్ని సహాయక, పునరావాస చర్యలు చేపడుతోందన్నారు. కేంద్రం తరఫున ఎటువంటి ఆర్థిక సాయం లేదని ఆరోపించారు. భారత్‌-భూటాన్ ఉమ్మడి నదీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, అందులో పశ్చిమ బెంగాల్‌ ను భాగం చేయాలని తమ ప్రభుత్వం చాలా కాలంగా డిమాండ్‌ చేస్తోందన్నారు. తమ ఒత్తిడితో ఈ నెల 16న కేంద్రం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, దీనికి రాష్ట్ర అధికారులు హాజరవుతారని వెల్లడించారు.
ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌, జల్‌పాయీగుడీ తదితర ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో దాదాపు 32 మంది మృతి చెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నేపాల్‌, భూటాన్‌లోనూ ఎడతెరిపిలేని వర్షాలతో నష్టం వాటిల్లింది. ఈ వరదలు, వాటి వల్ల జరిగిన విధ్వంసానికి మానవ తప్పిదమే కారణమని దీదీ ఇటీవల ఆరోపించారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఆమె సందర్శించడం ఇది రెండోసారి.
Also Read : CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ
The post CM Mamata Banerjee: భూటాన్‌ వల్లే బెంగాల్‌ లో వరదలు – మమతా బెనర్జీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Victory Venkatesh Joins Megastar Chiranjeevi’s “Mana Shankara Varaprasad Garu” ShootVictory Venkatesh Joins Megastar Chiranjeevi’s “Mana Shankara Varaprasad Garu” Shoot

The buzz around Megastar Chiranjeevi’s upcoming film “Mana Shankara Varaprasad Garu” continues to grow as the project races ahead under the direction of Anil Ravipudi. Ever since its announcement, the