hyderabadupdates.com movies తమిళం వద్దు.. కన్నడ ముద్దు

తమిళం వద్దు.. కన్నడ ముద్దు

భాషా భేదం లేకుండా ఎక్కడి సినిమాలనైనా ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులకు పేరుంది. ఐతే చరిత్ర చూస్తే వాళ్లు అత్యధికంగా ఆదరించిన పరభాషా చిత్రాలు.. తమిళంవే. ఆ పరిశ్రమకు చెందిన రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య సహా పలు హీరోలను ఇక్కడి స్టార్లతో సమానంగా ఆదరించారు. వాళ్ల సినిమాలు ఇక్కడి చిత్రాలను డామినేట్ చేసిన సందర్భాలున్నాయి. ఐతే గత కొన్నేళ్లలో తమిళ సినిమాల పట్ల మన వాళ్లకు ఆసక్తి తగ్గిపోతోంది.

గత దశాబ్దంలో తమిళ చిత్రాల క్వాలిటీ పడిపోవడం వాస్తవం. ఈ మధ్య మరీ సబ్ స్టాండర్డ్ సినిమాలు వస్తున్నాయి అక్కడి నుంచి. కానీ అదే సమయంలో కన్నడ చిత్రాలకు తెలుగు ఆదరణ పెరుగుతోంది. ఒకప్పుడు కన్నడలో ఎక్కువగా తెలుగు, తమిళ రీమేక్‌లు తెరకెక్కేవి. అక్కడ రొటీన్ మాస్ మసాలా సినిమాలే తీసేవారు. మన సినిమాల ముందు అవి ఎంతమాత్రం నిలిచేవి కావు. కానీ గత కొన్నేళ్లలో కన్నడ చిత్రాల క్వాలిటీ ఎంతగానో పెరిగింది.

కేజీఎఫ్ కన్నడ సినిమాల్లో గేమ్ చేంజర్‌గా నిలిచింది. కన్నడ చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో ఆదరించడం ఆ చిత్రంతోనే మొదలైంది. ఆ తర్వాత కేజీఎఫ్-2, కాంతార, సప్త సాగరాలు దాటి, విక్రాంత్ రోణ.. ఇలా చాలా సినిమాలు తెలుగులో మంచి వసూళ్లు దక్కించుకున్నాయి. ఇప్పుడు ‘కాంతార: చాప్టర్-2’ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఈ చిత్రం ఏపీ, తెలంగాణల్లో వంద కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును దాటేసింది.

ఫుల్ రన్లో వసూళ్లు రూ.120-130 కోట్ల మధ్య ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా తెలుగులో అనువాద చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు కన్నడ సినిమా అయిన ‘కేజీఎఫ్-2’ పేరిటే ఉండడం విశేషం. ఇప్పుడు ‘కాంతార-2’ రెండో స్థానాన్ని ఆక్రమించింది. ‘2.0’ కలెక్షన్లను ఈ చిత్రం అధిగమించింది. కన్నడ సినిమాలకు తెలుగులో ఇలాంటి వసూళ్లు వస్తాయని ఓ పదేళ్ల ముందు ఎవరైనా అంటే నవ్వుకునేవాళ్లమేమో. నార్త్ ఇండియాలో కూడా కన్నడ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండడం విశేషం. నెమ్మదిగా తమిళ అనువాదాల స్థానాన్ని కన్నడ చిత్రాలు అధిగమిస్తున్న మాట వాస్తవం.

Related Post

2026 బడ్జెట్ లో ‘ఏఐ’ పై స్పెషల్ ఫోకస్?2026 బడ్జెట్ లో ‘ఏఐ’ పై స్పెషల్ ఫోకస్?

రాబోయే యూనియన్ బడ్జెట్ (2026-27) కేవలం పన్నుల లెక్కలకే పరిమితం కాకుండా, టెక్నాలజీ భవిష్యత్తును నిర్ణయించేలా ఉండబోతోందా? అవుననే అంటున్నారు ప్రముఖ ఆర్థికవేత్తలు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో నిపుణులు ఒక కీలక ప్రతిపాదనను తెరపైకి

సుప్రీంకోర్టు మెట్లెక్కిన టీవీకే చీఫ్ విజయ్సుప్రీంకోర్టు మెట్లెక్కిన టీవీకే చీఫ్ విజయ్

తమిళనాడులోని కరూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన ఆ రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖ సినీనటుడు విజయ్… తమిళ వెట్రిగ కళగం (టీవీకే) పేరిట పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా