hyderabadupdates.com Gallery KCR: మాగంటి సునీతకి బీఫాం అందజేసిన కేసీఆర్

KCR: మాగంటి సునీతకి బీఫాం అందజేసిన కేసీఆర్

KCR: మాగంటి సునీతకి బీఫాం అందజేసిన కేసీఆర్ post thumbnail image

KCR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) మంగళవారం బీఫాం అందజేశారు. అలాగే ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.40లక్షల చెక్కును అందజేశారు గులాబీ బాస్. ఈరోజు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో మాగంటి సునీత కుటుంబ సభ్యులతో వెళ్లి కలిశారు. అనంతరం గులాబీ బాస్‌తో పలు కీలక అంశాలపై చర్చించారు మాగంటి సునీత. ఈ సందర్భంగా సునీత గెలవాలని ఆకాంక్షించారు కేసీఆర్. అయితే బుధవారం సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేయనున్నారు మాగంటి సునీత. ఈనెల 19వ తేదీన భారీ ర్యాలీతో రెండో సెట్ నామినేషన్ వేయనున్నారు మాగంటి సునీత.
కాగా, ఇప్పటికే మాగంటి సునీతకి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రచారం చేస్తున్నారు. కాగా, 2023 ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ గెలుపొందారు. అనారోగ్య కారణాలతో గోపీనాథ్ మృతిచెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో గోపీనాథ్ భార్య మాగంటి సునీతకి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఆమె గెలుపు కోసం గులాబీ శ్రేణులు జోరుగా ప్రచారం చేస్తున్నాయి.
KCR – జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో గులాబీ పార్టీ చిరునామా గల్లంతే – పొన్నం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో భారత రాష్ట్ర సమితి గూబ గుయ్యిమనేట్లు ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఈ ఉప ఎన్నికలో ఆ పార్టీ చిరునామా గల్లంతవుతుందని జోస్యం చెప్పారు. పదేళ్లలో ఆ పార్టీ పాలనలో జూబ్లీహిల్స్‌లో ఏం అభివృద్ధి జరిగిందో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని ఓడగొట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్ల నమోదుకు భారత రాష్ట్ర సమితి, బీజేపీలదే బాధ్యత. మాగంటి సునీతతో కన్నీరు పెట్టిస్తూ.. గులాబీ పార్టీ ఓట్లు దండుకోవాలని చూస్తోంది’’ అని పొన్నం విమర్శించారు.
Also Read : Rajasthan: రాజస్థాన్ లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం ! 15 మంది సజీవదహనం !
The post KCR: మాగంటి సునీతకి బీఫాం అందజేసిన కేసీఆర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Karpoori Thakur: బిహార్ ఎన్నికల బరిలో భారతరత్న మనవరాలుKarpoori Thakur: బిహార్ ఎన్నికల బరిలో భారతరత్న మనవరాలు

Karpoori Thakur : బిహార్‌ రాజకీయాల్లో కులం కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్నికల ఫలితాలు నిర్ణయించడంలోనూ కుల సమీకరణాలదే ముఖ్య భూమిక. ఈ పరిస్థితిని మార్చేందుకు కొన్ని దశాబ్దాల క్రితమే పోరాడిన నేత భారతరత్న కర్పూరీ ఠాకుర్‌. తన ఊరు పితౌంఝియాలో

MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్

MP Mithun Reddy : వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి న్యూయార్క్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. మిథున్‌ రెడ్డి న్యూయార్క్ వెళ్లేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 23వ తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు న్యూయార్క్

PM Modi: శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని మోదీPM Modi: శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని మోదీ

PM Modi : ఏపీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఉమ్మడి కర్నూలు జిల్లాలో శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించారు. ప్రత్యేక విమానంలో కర్నూలు లోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ… అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా