ఎర్రకోట సమీపంలోని జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు డాక్టర్లు హరియాణాలోని ఆల్ ఫలాహ్ యూనివర్శిటీకి చెందిన వారే కావడం గమనార్హం. అరెస్ట్ అయిన ముగ్గురు డాక్టర్లలో డాక్టర్ ముజామిల్ షకీల్, డాక్టర్ షహీన్ షహీద్, డాక్టర్ ఉమర్ మహ్మద్‌లు ఉన్నారు. ఇందులో ఉమర్, ముజామిల్‌లు కశ్మీర్‌కు చెందిన వారు కాగా, షహీన్ షహీద్ లక్నోకు చెందిన వారిగా గుర్తించారు.
వీరు ముగ్గురు హరియాణాలోని ఫరిదాబాద్ ఆస్పత్రిలో డాక్టర్లుగా పని చేస్తున్నారు. ఫరీదాబాద్ లోని ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేస్తూ దౌజా గ్రామంలో రెండు డాక్టర్ షకీల్ అద్దెకు తీసుకున్నాడు. ఆ రెండు ఇళ్లలో నుంచి 3 టన్నుల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైట్ కలర్ టెర్రర్ మాడ్యూల్ లో డాక్టర్లు, స్టూడెంట్స్ ను ఉగ్రవాదులుగా తయారు చేస్తుంది జైషే మహమ్మద్ సంస్థ. జైషే మహమ్మద్ విమెన్ వింగ్‌కు డాక్టర్ షహీనా కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే యూనివర్శిటీలోని పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సహా సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కు పెరిగింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన పేలుడులో అక్కడికక్కడే 9 మంది మృతి చెందారు. అయితే.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 12కు చేరింది. గాయపడిన మరో 17 మందికి లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి (LNJP హాస్పిటల్) ఆస్పత్రిలో చికిత్స అందుతోంది.
సోమవారం ఉదయం 8గం. ప్రాంతంలో బదర్పూర్ టోల్ బూత్ నుంచి ఢిల్లీలోకి ఎంట్రీ ఇచ్చిన ఐ20 కారు.. పావు గంట తర్వాత ఓకల పెట్రోల్ పంపు స్టేషన్ వద్ద కనిపించింది. మధ్యాహ్నం 3:19గం. సమయంలో ఎర్రకోట పార్కింగ్ ఏరియాలో ఎంట్రీ ఇచ్చింది. సాయంత్రం 6:22 నిమిషాలకు పార్కింగ్ ఏరియా నుంచి బయటికి వచ్చింది. ఆ సమయంలోనూ కారులో ఉమర్ ఉన్నాడు. సరిగ్గా.. రాత్రి 6: 50 నిమిషాలకు ఎర్రకోట సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతూ భారీ శబ్దం చేస్తూ పేలిపోయింది. పేలుడు ఉమర్ కూడా అక్కడికక్కడే మృతి చెందడంతో డీఎన్‌ఏ పరీక్ష ద్వారా అతని మృతదేహాన్ని నిర్ధారించే పనిలో ఉన్నారు.
The post Al Falah University: ఢిల్లీ పేలుడు ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Al Falah University: ఢిల్లీ పేలుడు ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్
Categories: