hyderabadupdates.com Gallery Amit Shah: సామ్రాట్‌ ‘బిగ్‌ మ్యాన్‌’ అవుతారు – అమిత్‌ షా

Amit Shah: సామ్రాట్‌ ‘బిగ్‌ మ్యాన్‌’ అవుతారు – అమిత్‌ షా

Amit Shah: సామ్రాట్‌ ‘బిగ్‌ మ్యాన్‌’ అవుతారు – అమిత్‌ షా post thumbnail image

Amit Shah : బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌధరీకి సంబంధించి కేంద్ర మంత్రి అమిత్‌ షా (Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సామ్రాట్‌ను మోదీ ‘బిగ్‌ మ్యాన్‌’ చేస్తారని అన్నారు. సామ్రాట్‌ పోటీ చేస్తున్న తారాపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి ఈ విధంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ను తప్పించి, బీజేపీ అభ్యర్థికి ఆ బాధ్యతలు అప్పగించేందుకు ఎన్డీయే ప్రయత్నాలు చేస్తోందని గతంలో విపక్షాలు ఆరోపించిన నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Amit Shah Comments
‘‘సామ్రాట్‌ చౌధరీ పుట్టింది ఇక్కడే. సామ్రాట్‌ కోసం ఈ స్థానాన్ని వదులుకోవాలని సిట్టింగ్‌ ఎమ్మెల్యే (జేడీయూ) రాజీవ్‌ సింగ్‌ను ఒప్పించాము. తమ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని తారాపుర్‌ సహా అనేక ప్రాంతాల నుంచి అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి. మీ ఎమ్మెల్యే మాత్రం రెడీమేడ్‌ డిప్యూటీ సీఎం’’ అని అమిత్‌ షా పేర్కొన్నారు. ఎన్నికల్లో సామ్రాట్‌కు ఓటు వేసి గెలిపించాలని, రానున్న రోజుల్లో ఆయన్ను ప్రధాని మోదీ ‘‘బిగ్‌ మ్యాన్‌, వెరీ బిగ్‌ మ్యాన్‌’’ చేస్తారని చెప్పారు.
బిహార్‌ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్‌ చౌధరీ.. గతంలో జేడీయూ, ఆర్జేడీ పార్టీల్లోనూ పనిచేశారు. కొన్నేళ్ల క్రితం బీజేపీలో చేరిన ఆయన క్రమంగా ఎదుగుతూ వచ్చారు. సామ్రాట్‌ కుష్వాహా వర్గానికి చెందిన నేత. రాష్ట్రంలో యాదవుల తర్వాత వీరి ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ఈ వర్గానికి చేరువయ్యే వ్యూహంలోనే సామ్రాట్‌కు భాజపా ప్రాధాన్యం కల్పిస్తోందనే వాదన కూడా ఉంది. రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా కొనసాగిన ఆయన.. చాలాకాలం తర్వాత ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు.
Also Read : BPCL: కుమార్తె చావులో అధికారుల కాసుల వేటపై మాజీ సీఎఫ్‌ఓ ఆవేదన
The post Amit Shah: సామ్రాట్‌ ‘బిగ్‌ మ్యాన్‌’ అవుతారు – అమిత్‌ షా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Family Suicide: కోనసీమ జిల్లాలో విషాదం! ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య !Family Suicide: కోనసీమ జిల్లాలో విషాదం! ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య !

Family Suicide : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు (Family Suicide). ఆలమూరు మండలం చిలకలపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఎస్సై నరేశ్‌ తన

ఖ‌ర్గే సార‌థ్యంలో సీఎం, మంత్రుల భేటీఖ‌ర్గే సార‌థ్యంలో సీఎం, మంత్రుల భేటీ

న్యూఢిల్లీ : పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రు శ్రమించాల‌ని అన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు సారథ్యంలో, కాంగ్రెస్ అగ్రనేత‌, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,

డ‌యేరియా , క‌ల్తీ పాల వ్య‌వహారంపై సీఎం సీరియ‌స్డ‌యేరియా , క‌ల్తీ పాల వ్య‌వహారంపై సీఎం సీరియ‌స్

అమరావతి : శ్రీకాకుళం పట్టణంలో నీటి కలుషితం కారణంగా ప్రబలిన డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా పలువురు చనిపోయిన ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో జరిగిన ఈ సమీక్షలో మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులు