hyderabadupdates.com Gallery Amit Shah: సామ్రాట్‌ ‘బిగ్‌ మ్యాన్‌’ అవుతారు – అమిత్‌ షా

Amit Shah: సామ్రాట్‌ ‘బిగ్‌ మ్యాన్‌’ అవుతారు – అమిత్‌ షా

Amit Shah: సామ్రాట్‌ ‘బిగ్‌ మ్యాన్‌’ అవుతారు – అమిత్‌ షా post thumbnail image

Amit Shah : బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌధరీకి సంబంధించి కేంద్ర మంత్రి అమిత్‌ షా (Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సామ్రాట్‌ను మోదీ ‘బిగ్‌ మ్యాన్‌’ చేస్తారని అన్నారు. సామ్రాట్‌ పోటీ చేస్తున్న తారాపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి ఈ విధంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ను తప్పించి, బీజేపీ అభ్యర్థికి ఆ బాధ్యతలు అప్పగించేందుకు ఎన్డీయే ప్రయత్నాలు చేస్తోందని గతంలో విపక్షాలు ఆరోపించిన నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Amit Shah Comments
‘‘సామ్రాట్‌ చౌధరీ పుట్టింది ఇక్కడే. సామ్రాట్‌ కోసం ఈ స్థానాన్ని వదులుకోవాలని సిట్టింగ్‌ ఎమ్మెల్యే (జేడీయూ) రాజీవ్‌ సింగ్‌ను ఒప్పించాము. తమ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని తారాపుర్‌ సహా అనేక ప్రాంతాల నుంచి అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి. మీ ఎమ్మెల్యే మాత్రం రెడీమేడ్‌ డిప్యూటీ సీఎం’’ అని అమిత్‌ షా పేర్కొన్నారు. ఎన్నికల్లో సామ్రాట్‌కు ఓటు వేసి గెలిపించాలని, రానున్న రోజుల్లో ఆయన్ను ప్రధాని మోదీ ‘‘బిగ్‌ మ్యాన్‌, వెరీ బిగ్‌ మ్యాన్‌’’ చేస్తారని చెప్పారు.
బిహార్‌ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్‌ చౌధరీ.. గతంలో జేడీయూ, ఆర్జేడీ పార్టీల్లోనూ పనిచేశారు. కొన్నేళ్ల క్రితం బీజేపీలో చేరిన ఆయన క్రమంగా ఎదుగుతూ వచ్చారు. సామ్రాట్‌ కుష్వాహా వర్గానికి చెందిన నేత. రాష్ట్రంలో యాదవుల తర్వాత వీరి ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ఈ వర్గానికి చేరువయ్యే వ్యూహంలోనే సామ్రాట్‌కు భాజపా ప్రాధాన్యం కల్పిస్తోందనే వాదన కూడా ఉంది. రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా కొనసాగిన ఆయన.. చాలాకాలం తర్వాత ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు.
Also Read : BPCL: కుమార్తె చావులో అధికారుల కాసుల వేటపై మాజీ సీఎఫ్‌ఓ ఆవేదన
The post Amit Shah: సామ్రాట్‌ ‘బిగ్‌ మ్యాన్‌’ అవుతారు – అమిత్‌ షా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అమెరికా కొత్త‌ కరెన్సీపై ట్రంప్ సంతకంఅమెరికా కొత్త‌ కరెన్సీపై ట్రంప్ సంతకం

అమెరికా : అమెరికా దేశ చ‌రిత్ర‌లో కీల‌క‌మైన నిర్ణ‌యానికి తెర లేపారు ప్ర‌స్తుత దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ . ఏకంగా సుదీర్ఘ కాలంగా వ‌స్తున్న 165 ఏళ్ల సంప్రదాయానికి ముగింపు ప‌లికారు. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్

AP Government: రైడెన్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు కు రూ.22 వేల కోట్ల ప్రోత్సాహకాలుAP Government: రైడెన్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు కు రూ.22 వేల కోట్ల ప్రోత్సాహకాలు

AP Government : విశాఖలో రూ.87,520 కోట్లతో డేటా సెంటర్‌ ఏర్పాటుచేయనున్న రైడెన్‌ ఇన్ఫోటెడ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు టైలర్‌మేడ్‌ విధానంలో ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములు, లీజు, విద్యుత్, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల మినహాయింపుతో కలిపి గరిష్ఠంగా రూ. 22,002

TG Local Bodies Elections: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం !TG Local Bodies Elections: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం !

    స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమవుతోంది. నవంబర్ 26 లేదా 27వ తేదీన పంచాయతీ ఎన్నికల నగారా మోగనుందని తెలుస్తోంది. మొత్తం మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు