hyderabadupdates.com Gallery Anil Sahani: బీజేపీలోకి ‘అనర్హత’ ఆర్జేడీ నేత

Anil Sahani: బీజేపీలోకి ‘అనర్హత’ ఆర్జేడీ నేత

Anil Sahani: బీజేపీలోకి ‘అనర్హత’ ఆర్జేడీ నేత post thumbnail image

Anil Sahani : అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీహార్‌ లో నేతల జంప్‌ జిలానీ వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఆర్జేడీ నేత అనిల్‌ సహానీ (Anil Sahani) బుధవారం బీజేపీలో చేరారు. విశేషం ఏమిటంటే ఈయనను మూడేళ్ల క్రితం మోసం కేసులో సీబీఐ కోర్టు దోషిగా తేల్చి శిక్ష విధించటంతో అనర్హత వేటు పడి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోయారు.
2012లో ఆయన ఆర్జేడీ రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ఫోర్జరీ విమాన టికెట్లు సమర్పించారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసులో సీబీఐ కోర్టు విచారణ జరుపుతుండగానే 2020లో ఆర్జేడీ తరఫున కుర్హానీ నియోజవర్గంలో పోటీచేసి బీజేపీ నేత కేదార్‌ గుప్తను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. మూడేళ్ల క్రితం కోర్టు అనిల్‌ను దోషిగా తేల్చటంతో అసెంబ్లీ సభ్యత్వం కోల్పోయారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో కేదార్‌ గుప్త గెలిచి, రాష్ట్ర మంత్రి అయ్యారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్‌ తావ్‌డేల సమక్షంలో అనిత్‌ సహానీ (Anil Sahani) బీజేపీలో చేరు.
Anil Sahani – ‘జీవిక దీదీ’లకు ఆర్జేడీ బంపర్‌ ఆఫర్‌
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు కీలక హామీలతో ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ) నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని భారీ ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక బృందాల సభ్యు(జీవిక దీదీ)లకు ఆయన బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు.
‘‘ రాష్ట్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కారి్మకులందరి ఉద్యోగాలను పరి్మనెంట్‌ చేస్తాం. జీవిక దీదీలుసహా మొత్తం 2,00,000 మంది కమ్యూనిటీ మొబిలైజర్‌ల ఉద్యోగాలను క్రమబదీ్ధకరిస్తా. కమ్యూనిటీ మొబిలైజర్‌లకు రూ.30,000 గౌరవ వేతనం అందిస్తా’’ అని తేజస్వీ ప్రకటించారు. ప్రపంచబ్యాంక్‌ ఆర్థికసాయంతో బిహార్‌ గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ‘జీవిక’ పథకాన్ని ప్రారంభించడం తెల్సిందే.
రూ.2,000 అదనపు అలవెన్స్‌
‘‘మా ప్రభుత్వం వస్తే జీవిక దీదీలు ఇప్పటికే తీసుకున్న రుణాలను మాఫీ చేస్తా. వచ్చే రెండేళ్లపాటు ఇలాంటి వడ్డీ లేని రుణాలు మంజూరుచేస్తా. జీవిక దీదీలు అందరికీ రూ.5 లక్షల విలువైన ఆరోగ్యబీమా సౌకర్యం కల్పిస్తాం. ప్రభుత్వకార్యక్రమాల్లో నిమగ్నమైన వారికి నెలకు అదనంగా రూ.2,000 అలవెన్స్‌ ఇస్తా’’ అని తేజస్వీ అన్నారు. బిహార్‌లో ప్రస్తుతం దాదాపు 1.45 కోట్ల మంది జీవిక దీదీలున్నారు. ‘‘తాము అధికారంలోకి వస్తే 20 రోజుల్లోçపు ఉపాధి గ్యారంటీ పథకం తెస్తా. 20 నెలల్లోపు ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చేస్తా’’ అని తేజస్వీ గతంలోనే ప్రకటించడం తెల్సిందే.
‘‘జీవిక దీదీలకు లభిస్తున్న గౌరవ వేతనం చాలా తక్కువగా ఉంది. వారి సేవలకు తగిన గుర్తింపు లభించడం లేదు’’ అని నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వంపై తేజస్వీ మండిపడ్డారు. ‘‘ నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రచారం జోరుమీదుంది. పాలనాపగ్గాలు ఎన్‌డీఏ కూటమి ఇవ్వకూడదని ఓటర్లు నిర్ణయించుకున్నారు. డబుల్‌ ఇంజిన్‌ మోతతో ఓటర్ల చెవులకు చిల్లులు పడ్డాయి. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలు, అవినీతి, నేరాలు నితీశ్‌ హయాంలో పెరిగాయి. నిరుద్యోగం, వలసలతో ప్రజలు విసిగిపోయారు’’ అని తేజస్వీ వ్యాఖ్యానించారు.
Also Read : Yatindra Siddaramaiah: మా నాన్న రాజకీయంగా చివరి దశలో ఉన్నారు – యతీంద్ర సిద్ధరామయ్య
The post Anil Sahani: బీజేపీలోకి ‘అనర్హత’ ఆర్జేడీ నేత appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Prashant Kishore: ప్రశాంత్ కిశోర్‌పై కోడ్ ఉల్లంఘన కేసుPrashant Kishore: ప్రశాంత్ కిశోర్‌పై కోడ్ ఉల్లంఘన కేసు

    ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ పై వైశాలి జిల్లాలోని రఘోపూర్ లో కేసు నమోదైంది. రఘోపూర్ ప్రాంతంలో ప్రశాంత్ కిషోర్ శనివారంనాడు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనంతరం ఆయనపై

Local Body Elections: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలLocal Body Elections: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

    తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. మొదటి విడత జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికలకు ఈరోజు (గురువారం) నోటిఫికేషన్‌ను విడుదల చేశారు రిటర్నింగ్ అధికారులు. నేటి నుంచి ఈనెల 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

Palla Srinivasarao: బొత్సకు జగన్ నుంచి ప్రాణహాని ఉంది – టీడీపీ అధ్యక్షుడు పల్లా Palla Srinivasarao: బొత్సకు జగన్ నుంచి ప్రాణహాని ఉంది – టీడీపీ అధ్యక్షుడు పల్లా 

Palla Srinivasarao : విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో కుటుంబ సభ్యులతో కలిసి తాను కూర్చున్న స్టేజి కూలిపోయిన ఘటన వెనుక ప్రభుత్వం యొక్క కుట్ర దాగి ఉందని శాసన మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే