hyderabadupdates.com Gallery Anmol Bishnoi: ఎన్ఐఏ కస్టడీకి గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్

Anmol Bishnoi: ఎన్ఐఏ కస్టడీకి గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్

Anmol Bishnoi: ఎన్ఐఏ కస్టడీకి గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ post thumbnail image

 
ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యకేసుతో సహా పలు కేసుల్లో వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌ ను 11 రోజుల ఎన్ఐఏ (NIA) కస్టడీకి ఢిల్లీలోని పాటియాలా హౌస్‌కోర్టు బుధవారంనాడు అప్పగించింది. అన్మోల్‌ను అమెరికా డిపోర్ట్ చేయడంతో అక్కడి నుంచి భారత్‌కు తరలించారు. అన్మోల్‌ను తీసుకువచ్చిన విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం ల్యాండ్ అయిన వెంటనే అతన్ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. పాటియాలా హౌస్ కోర్టు ముందు హాజరుపరిచింది.
 
బిష్ణోయ్ క్రైమ్ సిండికేట్‌లో అన్మోల్ పాత్రను ఎన్ఐఏ తరఫు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాహుల్ త్యాగి కోర్టుకు వివరించారు. ఈ నెట్‌వర్క్‌లో అన్మోల్ కీలక సభ్యుడని, 2022 నుంచి పరారీలో ఉన్నాడని, ప్రస్తుతం జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ నడుపుతున్న టెర్రర్ గ్యాంగ్‌స్టర్ సిండికేట్‌లో అరెస్టయిన 19వ నిందితుడని తెలిపారు. ట్రెర్రర్ గ్రూప్ ఆపరేషన్లకు అందుతున్న నిధులు, ఇతర సభ్యులను గుర్తించడం సహా విస్తృత స్థాయి సమాచారం వెలికితీసేందుకు అన్మోల్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాల్సి ఉంటుందని అన్నారు.
కాగా, అన్మోల్‌పై రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్రలో 31 కేసులు నమోదయ్యాయి. ముంబైలో సంచలనం సృష్టించిన బాబా సిద్ధిఖీ హత్య కేసు నిందితులతో అన్మోల్ సంప్రదింపుల సాగించినట్టు ఎన్ఐఏ గుర్తించింది. 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూమూసేవాలా హత్య కేసులోనూ అతను అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. ఆయనపై రూ.10 లక్షల రివార్డును కూడా ఎన్ఐఏ ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో అన్మోల్ పట్టుబట్టాడు. ఈనెల 18న అతనిని యూఎస్ బహిష్కరించింది.
The post Anmol Bishnoi: ఎన్ఐఏ కస్టడీకి గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

P Chidambaram: ఆపరేషన్ బ్లూస్టార్ పై చిదంబరం సంచలన వ్యాఖ్యలుP Chidambaram: ఆపరేషన్ బ్లూస్టార్ పై చిదంబరం సంచలన వ్యాఖ్యలు

    మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో పంజాబ్‌లోని స్వర్ణదేవాలయంలో 1984లో జరిపిన ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ పై ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వర్ణ దేవాలయాన్ని తిరిగి స్వాధీనం

Minister Nara Lokesh: ఏపీలో పెట్టుబడులకు ఆస్ట్రేలియా సహకరించాలి – మంత్రి లోకేశ్‌Minister Nara Lokesh: ఏపీలో పెట్టుబడులకు ఆస్ట్రేలియా సహకరించాలి – మంత్రి లోకేశ్‌

    ఏపీ ఇండస్ట్రియల్‌ క్లస్టర్లలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్‌ మెక్‌ కేతో భేటీ అయ్యారు. ఆస్ట్రేలియా-ఇండియా స్టేట్‌ ఎంగేజ్‌మెంట్‌ అజెండాలో ఏపీని

CM Nitish Kumar: 57 మందితో జేడీయూ తొలి జాబితా విడుదలCM Nitish Kumar: 57 మందితో జేడీయూ తొలి జాబితా విడుదల

CM Nitish Kumar : బీహార్‌లో నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సీట్ల కేటాయింపు విషయంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌ఎడీఏ)లో తర్జన భర్జనలు జరుగుతుండగా, ఇదే సమయంలో సీఎం నితీష్ కుమార్‌కు (CM Nitish Kumar) చెందిన జనతాదళ్ యునైటెడ్