hyderabadupdates.com Gallery AP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

AP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

AP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త post thumbnail image

AP Government : ఏపీలో ధాన్యం రైతులకు కూటమి సర్కార్ శుభవార్త తెలిపింది. సోమవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ప్రకటించారు. ఈ మేరకు మంత్రి నాదెండ్ల శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులు ధాన్యం వివరాల నమోదుకు -7337359375లో వాట్సాప్‌ నంబర్‌‌ని వినియోగించుకోవాలని సూచించారు మంత్రి నాదెండ్ల మనోహర్.
AP Government – 3,013 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు – మంత్రి నాదెండ్ల మనోహర్
రైతులు ఈ వాట్సాప్‌ నంబర్‌‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. 2025 నుంచి 2026 వరకు ఖరీఫ్‌లో 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏపీవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఏపీ (AP) వ్యాప్తంగా 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 24 గంటల నుంచి 48 గంటల్లోపే… రైతుల ఖాతాల్లోకి ధాన్యం సొమ్ము జమయ్యేలా చర్యలు చేపట్టామని మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) పేర్కొన్నారు.
లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు దంపతులు
ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ, హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎండీ భువనేశ్వరికి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ (ఐవోడీ) సంస్థ నవంబరు 4న డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025 అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. దీనికి తోడు హెరిటేజ్‌ ఫుడ్స్‌కు ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్‌ విభాగంలో లభించిన గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు కూడా వరించింది. ఈ నేపథ్యంలో ఈ అవార్డులను లండన్‌లోని గ్లోబల్‌ కన్వెన్షన్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధానం చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీనితో నవంబర్ 4న లండల్ లో జరగబోయే అవార్డుల ప్రధానోత్సవానికి… ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ, హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎండీ నారా భువనేశ్వరితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) కూడా హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో సతీమణి భువనేశ్వరితో కలిసి సీఎం చంద్రబాబు (CM Chandrababu) శనివారం రాత్రి హైదరాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. లండన్‌లోని గ్లోబల్‌ కన్వెన్షన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి సతీ సమేతంగా చంద్రబాబు (CM Chandrababu) హాజరవుతారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం, హిందూజా గ్రూప్‌ కో చైర్మన్‌ గోపీచంద్‌, ఆదిత్య బిర్లా సెంటర్‌ ఫర్‌ కమ్యూనిటీ ఇనీషియేటివ్స్‌ చైర్‌పర్సన్‌ రాజశ్రీ బిర్లా, సన్‌ ఫార్మా ఎండీ దిలీప్‌ సంఘ్వీ, దుబాయ్‌ ఎలక్ట్రిసిటీ, వాటర్‌ అథారిటీ ఎండీ సయీద్‌ మహ్మద్‌, హీరో ఎంటర్‌ పైజ్రెస్‌, గోయెంకా గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ సంజీవ్‌ గోయెంకా వంటి ప్రముఖులు గతంలో ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార, సామాజిక, పరిపాలనా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు.
భువనేశ్వరి ప్రజాసేవకు పట్టం
ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో చేసిన కృషికి గాను సీఎం చంద్రబాబు (CM Chandrababu) సతీమణి, ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. భారత్‌లోని ప్రముఖ సంస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌(ఐవోడీ) ఆమెను డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌ అవార్డు-2025కు ఎంపిక చేసింది. ఈ అవార్డుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ప్రజాసేవ, సామాజిక ప్రభావం, నాయకత్వం వంటి అంశాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులను ఏటా ఈ అవార్డులను ఐవోడీ ఎంపిక చేస్తుంది. భువనేశ్వరి నేతృత్వం వహిస్తున్న ఎన్టీఆర్‌ ట్రస్టు.. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, విపత్తు సాయం తదితర అంశాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, ఎన్టీఆర్‌ విద్యార్థి సహాయ పథకాలు, విపత్తు నిర్వహణ సేవలు, మహిళల ఆర్థిక స్వావలంబన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మన్నన పొందుతున్నాయి. ప్రత్యేకించి తలసేమియా రోగులకు ఉచితంగా బ్లడ్‌ ట్రాన్స్‌ప్యూజన్స్‌ నిర్వహించడటంతో పాటు దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా సమాజానికి చేరువైన భువనేశ్వరి ప్రజాసేవా నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు.
ప్రతిష్ఠాత్మక బ్రాండ్‌గా హెరిటేజ్‌ ఫుడ్స్‌
మహిళా నాయకత్వానికి భువనేశ్వరి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కార్పొరేట్‌ సంస్థ హెరిటేజ్‌ ఫుడ్స్‌కు వైస్‌ చైౖర్‌పర్సన్‌, ఎండీగా ఉన్న ఆమె ఆ సంస్థను పారదర్శకత, సామాజిక బాధ్యతతో నడిపిస్తున్నారు. హెరిటేజ్‌ను దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన బ్రాండ్‌గా తీర్చిదిద్దారు. సంస్థ ఎదుగుదల, నూతన ఉత్పత్తుల ఆవిష్కరణలతోపాటు కోట్ల మంది వినియోగదారులకు హెరిటేజ్‌ ఉత్పత్తులు చేరువ చేయడంలో భువనేశ్వరి కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రత్యేకించి హెరిటేజ్‌ ద్వారా రైతుల సాధికారతకు పెద్దపీట వేస్తున్నారు. వాణిజ్య రంగంలో అందిస్తున్న సేవలకు గాను దేశంలోని అత్యంత శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో భువనేశ్వరి ఒకరని 2013లోనే ఫార్చూన్‌ ఇండియా పేర్కొంది. ఎఫ్‌ఎంసీజీ రంగంలో అత్యుత్తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెరిటేజ్‌ ఫుడ్స్‌కు కార్పొరేట్‌ గవర్నెన్స్‌ విభాగంలో దక్కిన గోల్డెన్‌ పీకాక్‌ అవార్డును ఆ సంస్థ వీసీఎండీ హోదాలో భువనేశ్వరి అందుకోనున్నారు.
Also Read : Degree Student: మహిళా అధ్యాపకుల వేధింపులు తాళలే డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
The post AP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Tejashwi Yadav: ప్రభుత్వం ఏర్పాటయ్యాక ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ ఉంటుంది – తేజస్వీయాదవ్‌Tejashwi Yadav: ప్రభుత్వం ఏర్పాటయ్యాక ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ ఉంటుంది – తేజస్వీయాదవ్‌

    ఆర్జేడీ నాయకుడు తేజస్వీయాదవ్‌ 36వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఆదివారం కారాకట్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న తేజస్వీ… ‘నాకు శుభాకాంక్షలు తెలిపిన ఆర్జేడీ మద్దతుదారులకు కృతజ్ఞతలు. ఎన్నికల ఫలితాలు వెలువడిన

Tirumala: పరకామణి చోరీ కేసులో సీఐడీ విచారణ ప్రారంభంTirumala: పరకామణి చోరీ కేసులో సీఐడీ విచారణ ప్రారంభం

Tirumala : తిరుమల శ్రీవారి పరకామణి చోరీకి సంబంధించి సీఐడీ బృందం విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు విచారణను మొదలుపెట్టింది. సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. శ్రీవారి ఆలయ పరకామణిని సీఐడీ బృందం పరిశీలించింది.

Nizamabad Police: కానిస్టేబుల్‌ హత్యకేసు నిందితుడు రియాజ్‌ అరెస్ట్Nizamabad Police: కానిస్టేబుల్‌ హత్యకేసు నిందితుడు రియాజ్‌ అరెస్ట్

    తెలంగాణాలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్‌ ప్రమోద్‌ ను హత్యకేసులో ప్రధాన నిందితుడు, పాత నేరస్థుడు రియాజ్‌ను ప్రాణాలతో పట్టుకున్నామని నిజామాబాద్‌ సీపీ సాయి చైతన్య తెలిపారు. నిందితుడిపై ఎలాంటి కాల్పులు జరపలేదని, నిజామబాద్‌లో ఎలాంటి ఎన్‌కౌంటర్‌ జరగలేదని ఆయన