hyderabadupdates.com Gallery AP Government: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి జాబ్‌ ఛార్ట్‌ విడుదల చేసిన ప్రభుత్వం

AP Government: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి జాబ్‌ ఛార్ట్‌ విడుదల చేసిన ప్రభుత్వం

AP Government: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి జాబ్‌ ఛార్ట్‌ విడుదల చేసిన ప్రభుత్వం post thumbnail image

AP Government: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధుల నిర్వహణపై ప్రభుత్వం (AP Government) కీలక ఆదేశాలు జారీచేసింది. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పనులు వారికి అప్పగిస్తూ వివిధ శాఖలు ఆదేశాలు జారీ చేస్తున్నాయంటూ ఆయా సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్పందించి నిర్దిష్టమైన జాబ్‌ ఛార్ట్‌ను విడుదల చేసింది. ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా ఏదైనా శాఖ ఆదేశాలు జారీచేస్తే అవి రద్దవుతాయని స్పష్టం చేసింది. సిబ్బంది ఒకేసారి పలు పనులు చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు జిల్లా గ్రామ, వార్డు సచివాలయ అధికారి, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో చర్చించి కలెక్టర్‌ అనుమతితో పనుల ప్రాధాన్యతను నిర్ణయిస్తారని వెల్లడించింది.
AP Government – ప్రభుత్వం విడుదల చేసిన సాధారణ జాబ్‌ ఛార్ట్‌
గ్రామ, వార్డుస్థాయి అభివృద్ధి ప్రణాళికల పనులన్నింటిలో పాల్గొనాలి.
ప్రభుత్వ పథకాల సమర్థ అమలుకు ఆయా పథకాల విస్తరణ కార్యక్రమాల్లో పాల్గొనాలి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి పరిధిలోని పౌరుల సమాచారాన్ని సేకరించాలి.
ప్రభుత్వం ప్రజలకు అందించే వివిధ సేవలు, సంక్షేమ పథకాలను వారి ఇళ్ల వద్దే అందించాలి.
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారానికి నిరంతర అనుశీలన చేపట్టాలి.
విపత్తు సమయాల్లో అత్యవసర విధులు నిర్వర్తించాలి.
ప్రభుత్వం సమయానుసారం జారీచేసే ఆదేశాలకు అనుగుణంగా వారికి అప్పగించే ఏ పనులైనా నిర్వర్తించాలి.
ప్రభుత్వం నిర్ణయించిన పరీక్షలకు అర్హత సాధించాలి.
ఈ జాబ్‌ ఛార్ట్‌ అమలు బాధ్యతను జిల్లా కలెక్టర్లు లేదా నియామక అధికారులు తీసుకోవాలి.
ఈ విధులను సిబ్బంది అమలుచేయకపోతే వారిపై కలెక్టర్లు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.
రెవెన్యూలో ఇతరులకు బ్రేక్‌
రెవెన్యూ వెబ్‌ల్యాండ్‌లో ‘ఇతరులు’ అనే పేరుతో ఒక్కో గ్రామంలో వందల ఎకరాలు నమోదై ఉంటాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో డొంకాడ (Donkada) తదితర పేర్లుంటాయి. ఇందులో 22ఎ నిషేధిత భూములు సహా వివిధ విభాగాల ప్రభుత్వ (AP Government), ప్రైవేటు భూములు ఉంటాయి. అన్నదమ్ములు భాగ పంపిణీ చేసుకోకున్నా… ఏదైనా ప్రభుత్వ (AP Government) భూమి ఉన్నా… వాటన్నింటినీ ఇందులోకి నెట్టేస్తారు. మ్యుటేషన్‌ చేసిన తర్వాత అందులోంచి తొలగిస్తారు. ఇలాంటివి ఒక్కో గ్రామంలో 100-500 ఎకరాలపైనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాలు ఈ విభాగంలో ఉన్నాయి. అయితే వారం నుంచి ‘ఇతరులు’ అనే విభాగంలో ఉన్నవాటికి మ్యుటేషన్లు చేయట్లేదు. క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు, వీఆర్వోలు అవకతవకలకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, చాలాచోట్ల వాస్తవ హక్కుదారులు ఇబ్బంది పడుతున్నారు.
వెబ్‌ల్యాండ్‌లో పట్టాదారు అనే కాలమ్‌ కింద.. ‘ఇతరులు’, ‘అన్‌క్లెయిమ్డ్‌‘ పేరుతో నమోదుచేసి వివిధ ఖాతా నంబర్లు ఇస్తున్నారు. కొన్నిచోట్ల 9999, మరికొన్ని చోట్ల 9998, ఇంకొన్ని చోట్ల 4,000 అని.. మండలానికి ఒకలా నంబర్లు ఇస్తున్నారు. కొన్నిచోట్ల ‘అ’ అనే పేరుతో ఖాతా నంబర్లు ఇచ్చి వదిలేయడం రెవెన్యూశాఖలో నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలో ఇలాంటి పేర్లు కనిపిస్తున్నాయి. అన్నిరకాల భూములూ ఇందులోనే ఏదైనా భూమికి రైతు పేరు లేకుంటే.. దాన్ని ఇతరుల ఖాతాలో వేస్తున్నారు. రైతులైనా, దస్త్రాలున్నా.. భాగపంపిణీ చేయించుకోకుండా పాస్‌పుస్తకం తీసుకోకుండా ఉంటే వాటిని ఇందులో చేరుస్తున్నారు.
ప్రభుత్వ (AP Government) భూములు, ఒక సర్వే నంబరులో కొందరు రైతులు ఆన్‌లైన్‌ చేయించుకోగా మిగిలినవి, కొనుగోలు, ఆనువంశికం, భాగస్వామ్యం, బహుమానం, వారసత్వం, ఎసైన్‌ చేసింది, డి.పట్టా, సాదా క్రయం, పట్టాదారు, సీలింగ్‌ పట్టా.. అనే పేర్లతో ఉన్నవాటిని ఇందులో నమోదు చేస్తున్నారు. పట్టాదారు కింద డొంక, కాల్వలు, ఇళ్లస్థలాల పేర్లతో మరికొన్ని ఉంటున్నాయి. ఒక విధానం అనేదే లేదు. అధికారులకు ఇష్టం వచ్చినట్లు నెట్టేయడమే. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలో ఇలాంటి భూములు 7వేల ఎకరాలకు పైగా ఉన్నాయి. అమ్మానిగుడిపాడులో 1,273 ఎకరాలు, యర్రగొండపాలెంలో 526 ఎకరాలు, బోయలపల్లిలో 213 ఎకరాలు ఈ పేరుతో నమోదుచేశారు. గిద్దలూరు మండలం ఉయ్యాలవాడలో 532 ఎకరాలకు పైగా ఇతరుల పేర్లతో ఉంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని గ్రామాల్లో చూస్తే 200 ఎకరాలపైనే నమోదైంది.
ఇన్ని పేర్లు అవసరమా? రీసర్వే చేసినా తేల్చరా?
వెబ్‌ల్యాండ్‌లో సర్వేనంబర్ల వారీగా రైతు/ప్రభుత్వం (AP Government) పేరుతోనే నమోదై ఉండాలి. కానీ ఇతరులు అనే పేరుతో ఎక్కువగా ఉంటున్నాయి. రెవెన్యూలో భూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే.. పట్టాదారు స్థానంలో ఇతరులుగా నమోదుచేయాల్సిన అవసరం ఉండదు. అర్జీలు వచ్చినా పక్కన పడేయడంతో ఈ విభాగంలో భూముల జాబితా పెరిగిపోతోంది. రీసర్వే జరిగిన గ్రామాల్లో భూసమస్యలు ఉండకూడదు. అయితే అక్కడా అధిక విస్తీర్ణంలో ఎల్‌పీఎం నంబర్లతో భూములు కనిపిస్తున్నాయి. అంటే మొక్కుబడిగా రీసర్వే చేసి మమ అనిపిస్తున్నారు.
ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారని ఫిర్యాదులు
ఇతరుల పేర్లతో ఉన్న భూముల్ని కొందరు వీఆర్వోలు, అధికారులు ఇష్టానుసారం మార్చేస్తున్నారని రెవెన్యూశాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ భూములకు కొన్నిచోట్ల వీఆర్వోల ఫోన్‌ నంబర్లు, ఆధార్‌ నంబర్లే నమోదుచేశారు. అంటే మ్యుటేషన్‌ చేసినా.. వారి నంబర్లకే సందేశం వెళ్తుంది. కొన్నిచోట్ల నిషేధిత భూముల్ని ఇతరుల పేర్లతో మార్చారనే విషయం అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇతరుల పేర్లతో ఉన్న భూముల మ్యుటేషన్లు నిలిపేస్తూ ఆదేశాలిచ్చారు. గ్రామ సచివాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా నమోదుచేసుకున్న వారెందరనే వివరాలు తీసుకుని వాటిని పరిష్కరించే ఆలోచన చేస్తున్నారు.
Also Read : Cabinet Sub Committee: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం కీలక చర్చలు
The post AP Government: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి జాబ్‌ ఛార్ట్‌ విడుదల చేసిన ప్రభుత్వం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తన డైట్‌ గురించి ఈ ముద్దుగుమ్మ ఏమందంటే..!తన డైట్‌ గురించి ఈ ముద్దుగుమ్మ ఏమందంటే..!

గ్లామర్‌ హీరోయిన్‌ రాశి ఖన్నా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికరంగా పంచుకుంది. తాను ఒకప్పుడు లావుగా ఉండేదానని, ఆ సమయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటే నవ్వు వస్తుందని చెప్పింది. చిన్నప్పటి నుంచే తాను తినడం చాలా