hyderabadupdates.com Gallery AP Government: రైడెన్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు కు రూ.22 వేల కోట్ల ప్రోత్సాహకాలు

AP Government: రైడెన్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు కు రూ.22 వేల కోట్ల ప్రోత్సాహకాలు

AP Government: రైడెన్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు కు రూ.22 వేల కోట్ల ప్రోత్సాహకాలు post thumbnail image

AP Government : విశాఖలో రూ.87,520 కోట్లతో డేటా సెంటర్‌ ఏర్పాటుచేయనున్న రైడెన్‌ ఇన్ఫోటెడ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు టైలర్‌మేడ్‌ విధానంలో ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములు, లీజు, విద్యుత్, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల మినహాయింపుతో కలిపి గరిష్ఠంగా రూ. 22,002 కోట్ల ప్రోత్సాహకాలను రైడెన్‌కు అందించాలని ప్రభుత్వం (AP Government) నిర్ణయించింది. ఆ సంస్థకు 480 ఎకరాలను రాయితీ ధరపై కేటాయించాలని ప్రభుత్వం (AP Government) నిర్ణయించింది. ఆ సంస్థ 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది.
AP Government – ప్రభుత్వం ప్రతిపాదించిన రాయితీలు ఇవే
రాంబిల్లిలో 160 ఎకరాలు, అడవివరంలో 120 ఎకరాలు, ముడసర్లోవలో 200 ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వం (AP Government) నిర్ణయించింది. భూముల విలువలో 25% రాయితీ ఇచ్చేందుకు అంగీకరించింది. మరో 15 ఎకరాలను ల్యాండింగ్‌ కేబుల్‌ స్టేషన్‌ కోసం కేటాయించేందుకు అనుమతించింది.
స్టాంపుడ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పూర్తిగా మినహాయింపు.
ప్లాంటు, మెషినరీ కోసం చేసే ఖర్చులో 10% మూలధన రాయితీ కింద చెల్లింపు.. గరిష్ఠంగా పదేళ్లలో రూ.2,129 కోట్లు చెల్లించేందుకు అనుమతి.
ఓపీజీడబ్ల్యూ ఫైబర్‌ యాక్సెస్‌ కోసం చేసే 30% మొత్తం 20 ఏళ్లలో చెల్లింపు. ఆపరేషన్, నిర్వహణ ఛార్జీలు ప్రతి మూడేళ్లకు 5% చొప్పున పెంపు. గరిష్ఠంగా రూ.282 కోట్లు చెల్లించేందుకు అంగీకారం.
డేటా సెంటర్‌ నిర్మాణానికి చెల్లించే జీఎస్టీ మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లించేందుకు అంగీకారం. గరిష్ఠంగా రూ.2,245 కోట్లు.. పదేళ్లలో చెల్లించేందుకు నిర్ణయం.
పదేళ్ల పాటు లీజులపై చెల్లించే జీఎస్టీ పూర్తిగా మినహాయింపు. గరిష్ఠంగా రూ.1,745 కోట్ల వరకు తిరిగి చెల్లింపు.
డేటా సెంటర్‌కు అవసరమైన నీటి కోసం చెల్లించాల్సిన ఛార్జీల్లో పదేళ్ల పాటు 25% చొప్పున రాయితీ. గరిష్ఠంగా రూ.12 కోట్ల వరకు పరిమితి. 20 ఏళ్ల పాటు డేటా సెంటర్‌కు అవసరమైన నీటి సరఫరా.
రాష్ట్రప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ఆర్‌ఓడబ్ల్యూ (కూలింగ్‌ సెంటర్స్‌) ఖర్చు 20 ఏళ్ల పాటు మినహాయింపు. గరిష్ఠంగా రూ.175 కోట్లకు పరిమితం.
ఎలక్ట్రికల్‌ మౌలిక సదుపాయాలకు చేసే ఖర్చు పూర్తిగా మినహాయింపు.. గరిష్ఠంగా రూ.500 కోట్ల రాయితీ.
డేటా సెంటర్‌కు వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌కు రూపాయి చొప్పున.. 15 ఏళ్ల పాటు విద్యుత్‌ రాయితీ. డేటా సెంటర్‌ ప్రారంభించిన మొదటి పదేళ్లలో.. గరిష్ఠంగా రూ.4,800 కోట్ల వరకు పరిమితి. నిర్దేశిత పెట్టుబడి, ప్రతిపాదించిన సామర్థ్యం లక్ష్యాలను పూర్తిచేస్తే.. మరో ఐదేళ్లు విద్యుత్‌ రాయితీ పొడిగించే ప్రతిపాదన.
విద్యుత్‌ సుంకం 15 ఏళ్ల పాటు పూర్తిగా మినహాయింపు. మొదటి పదేళ్లలో గరిష్ఠంగా రూ.1,200 కోట్లకు పరిమితి. నిర్దేశిత లక్ష్యాలను పూర్తిచేస్తే మరో ఐదేళ్లు పొడిగించే అవకాశం.
రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే విద్యుత్‌ పంపిణీ ఛార్జీలు 20 ఏళ్ల పాటు మినహాయింపు.. గరిష్ఠంగా రూ.4వేల కోట్ల వరకు పరిమితి.
క్రాస్‌ సబ్సిడీ ఛార్జీలు 20 ఏళ్ల పాటు మినహాయింపు. గరిష్ఠంగా రూ.4,500 కోట్ల వరకు అనుమతి. బ్యాంకింగ్‌ చేసే విద్యుత్‌కు ఈ నిబంధన వర్తించదు.
Also Read : Minister Nara Lokesh: విశాఖలో ఏఐ ఎడ్జ్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేశ్‌
The post AP Government: రైడెన్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు కు రూ.22 వేల కోట్ల ప్రోత్సాహకాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Chandrababu: రేపు యూఏఈకి సీఎం చంద్రబాబుCM Chandrababu: రేపు యూఏఈకి సీఎం చంద్రబాబు

  విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తోంది. ఈ మేరకు సింగపూర్ దేశంలో గతంలో పర్యటించిన ముఖ్యమంత్రి బృందం… ఇప్పుడు యూఏఈకి వెళ్లనుంది. నవంబరు 14,

Kaveri Travels: కర్నూలు బస్సు ప్రమాదంపై స్పందించిన ట్రావెల్స్ యాజమాన్యంKaveri Travels: కర్నూలు బస్సు ప్రమాదంపై స్పందించిన ట్రావెల్స్ యాజమాన్యం

    కర్నూలు బస్సు ప్రమాదంపై తీవ్ర విమర్శల వేళ… వీ కావేరి ట్రావెల్స్ యాజమాన్యం స్పందించింది. బస్సుకు ఫిట్‌నెస్‌ లేదని, పైగా సర్టిఫికెట్లు కూడా కాలపరిమితి చెల్లాయని, అపరిమిత చలాన్లూ ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తమ

Diwali: రాజస్థాన్ లో కిలో స్వీట్ రూ. 1.11 లక్షలుDiwali: రాజస్థాన్ లో కిలో స్వీట్ రూ. 1.11 లక్షలు

Diwali : పండగల వేళ.. ముఖ్యంగా దసరా, దీపావళి వేళ.. తమ సంస్థ ఉద్యోగులకు స్వీట్లు అందజేస్తాయి యాజమాన్యం. దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని సంస్థలు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో దీపావళీకి మిఠాయి షాపుల్లో స్వీట్స్‌కు భారీగా డిమాండ్ ఏర్పడింది. అలాగే