hyderabadupdates.com Gallery AP Police: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులు

AP Police: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులు

AP Police: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులు post thumbnail image

 
 
కర్నూలు బస్సు ప్రమాదం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై ఏపీ ప్రభుత్వం దృష్టిసారించింది. దీనిలో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు వచ్చారు. కర్నూలు బస్సు ప్రమాదానికి మద్యం కారణమని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన పోలీసులు… తాజాగా కర్నూలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి నోటీసులు ఇచ్చారు. కర్నూలు బస్సు దగ్ధం కేసులో నోటీసులు జారీ చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చిన పోలీసులు… బస్సు దగ్దానికి మద్యమే కారణమని ప్రచారం చేశారంటూ నోటీసులు ఇచ్చారు. ప్రచారం వెనుక వైఎస్సార్‌సీపీ ఉందంటూ కేసు పెట్టారు. ఇప్పటికే 27 మందిపై కేసులు నమోదు చేశారు. తాజాగా పూడి శ్రీహరిని కూడా ఈ కేసులో కర్నూలు ఖాకీలు చేర్చారు.
 
ప్రభుత్వం నోటీసులతో వైసీపీను భయపెట్టాలని చూస్తోంది – మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌
 
పోలీసుల నోటీసులపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు స్పందిస్తూ… ‘‘కర్నూలు బస్సు దగ్దానికి మద్యమే కారణం… ఆ విషయం అందరికీ తెలుసు. కానీ అదే విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టిన వారిపై కేసులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా మా పార్టీ కేంద్ర కార్యాలయానికే పోలీసులు వచ్చారు. మా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీహరికి నోటీసులు ఇచ్చారు. ప్రజలు, ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం నోటీసులతో భయపెట్టాలని చూస్తోంది’’ అంటూ ఆయన మండిపడ్డారు.
ఇలాంటి నోటీసులు, కేసులకు మేము భయపడము. కర్నూలు బస్సు దగ్దానికి కారణమైన బైకర్లు మద్యం ఎక్కడ తాగారో ప్రభుత్వం ఎందుకు చెప్పటం లేదు?. మృతుని శరీరంలో ఎంత ఆల్కాహాల్ ఉందో రిపోర్టుని ఎందుకు బయట పెట్టలేదు?. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్ దొరుకుతోంది. విశాఖలో దొరికిన డ్రగ్స్ వివరాలు హోంమంత్రి ఎందుకు బయట పెట్టటం లేదు?. ఎవరి ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ దొరికాయో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?’’ అంటూ టీజేఆర్‌ ప్రశ్నించారు.
The post AP Police: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్‌లా మారిందిరాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్‌లా మారింది

మంగ‌ళ‌గిరి : ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అన‌గాని స‌త్య ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న సోమ‌వారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అల్లర్లు, అశాంతి సృష్టించేలా జగన్ సైకో ముఠా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధికి వైసీపీ, జగన్ వైరస్‌లా

Minister Anitha: రాళ్లపాడులో మంత్రులు అనిత, నారాయణ పర్యటనMinister Anitha: రాళ్లపాడులో మంత్రులు అనిత, నారాయణ పర్యటన

    దారకానిపాడుకు చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసు ఘటనపై హోంమంత్రి అనితను నివేదిక ఇవ్వాలని చంద్రబాబు కోరారు. కూటమి

Maganti Gopinath: మాగంటి గోపీనాథ్‌ వారసత్వంపై ముదిరిన వివాదంMaganti Gopinath: మాగంటి గోపీనాథ్‌ వారసత్వంపై ముదిరిన వివాదం

    ఇటీవల కన్నుమూసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ వారసత్వానికి సంబంధించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయనకు అసలైన వారసులం తామేనని… గోపీనాథ్‌ మొదటి భార్య మాలినిదేవి, కుమారుడు తారక్‌ ప్రద్యుమ్న తెలిపారు. గతంలోనే దీనిపై రంగారెడ్డి కలెక్టర్‌కు గోపీనాథ్‌