hyderabadupdates.com Gallery AP Police: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులు

AP Police: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులు

AP Police: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులు post thumbnail image

 
 
కర్నూలు బస్సు ప్రమాదం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై ఏపీ ప్రభుత్వం దృష్టిసారించింది. దీనిలో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు వచ్చారు. కర్నూలు బస్సు ప్రమాదానికి మద్యం కారణమని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన పోలీసులు… తాజాగా కర్నూలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి నోటీసులు ఇచ్చారు. కర్నూలు బస్సు దగ్ధం కేసులో నోటీసులు జారీ చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చిన పోలీసులు… బస్సు దగ్దానికి మద్యమే కారణమని ప్రచారం చేశారంటూ నోటీసులు ఇచ్చారు. ప్రచారం వెనుక వైఎస్సార్‌సీపీ ఉందంటూ కేసు పెట్టారు. ఇప్పటికే 27 మందిపై కేసులు నమోదు చేశారు. తాజాగా పూడి శ్రీహరిని కూడా ఈ కేసులో కర్నూలు ఖాకీలు చేర్చారు.
 
ప్రభుత్వం నోటీసులతో వైసీపీను భయపెట్టాలని చూస్తోంది – మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌
 
పోలీసుల నోటీసులపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు స్పందిస్తూ… ‘‘కర్నూలు బస్సు దగ్దానికి మద్యమే కారణం… ఆ విషయం అందరికీ తెలుసు. కానీ అదే విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టిన వారిపై కేసులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా మా పార్టీ కేంద్ర కార్యాలయానికే పోలీసులు వచ్చారు. మా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీహరికి నోటీసులు ఇచ్చారు. ప్రజలు, ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం నోటీసులతో భయపెట్టాలని చూస్తోంది’’ అంటూ ఆయన మండిపడ్డారు.
ఇలాంటి నోటీసులు, కేసులకు మేము భయపడము. కర్నూలు బస్సు దగ్దానికి కారణమైన బైకర్లు మద్యం ఎక్కడ తాగారో ప్రభుత్వం ఎందుకు చెప్పటం లేదు?. మృతుని శరీరంలో ఎంత ఆల్కాహాల్ ఉందో రిపోర్టుని ఎందుకు బయట పెట్టలేదు?. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్ దొరుకుతోంది. విశాఖలో దొరికిన డ్రగ్స్ వివరాలు హోంమంత్రి ఎందుకు బయట పెట్టటం లేదు?. ఎవరి ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ దొరికాయో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?’’ అంటూ టీజేఆర్‌ ప్రశ్నించారు.
The post AP Police: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Jubilee Hills: నేటి నుండి జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో హోం ఓటింగ్Jubilee Hills: నేటి నుండి జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో హోం ఓటింగ్

    జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో వయోధికులు, దివ్యాంగులకు హోం ఓటింగ్‌ నేడు ప్రారంభం కానుంది. అధికారుల బృందం ఇళ్ల వద్దకు వెళ్లి వారు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించనుంది. 85 ఏళ్లు దాటిన, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం

Deputy Speaker: డీజీపీకు డిప్యూటీ స్పీకర్ రఘురామ ఫిర్యాదు Deputy Speaker: డీజీపీకు డిప్యూటీ స్పీకర్ రఘురామ ఫిర్యాదు 

    కూటమి పక్షాల మధ్య, కులాల మద్య చిచ్చుపెట్టేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారిపై డీజీపీకి పిర్యాదు చేశారు. అంభోజి వినయ్ కుమార్ పేరుతో ఫేస్‌బుక్‌లో కరుడుగట్టిన

Al Falah University: ఢిల్లీ పేలుడు ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్‌Al Falah University: ఢిల్లీ పేలుడు ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్‌

    ఎర్రకోట సమీపంలోని జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు డాక్టర్లు హరియాణాలోని ఆల్‌ ఫలాహ్‌ యూనివర్శిటీకి చెందిన వారే కావడం గమనార్హం. అరెస్ట్‌ అయిన ముగ్గురు డాక్టర్లలో డాక్టర్