hyderabadupdates.com Gallery Ayodhya Temple: ఈ నెల 24, 25 తేదీల్లో అయోధ్య రాముడి దర్శనం నిలిపివేత

Ayodhya Temple: ఈ నెల 24, 25 తేదీల్లో అయోధ్య రాముడి దర్శనం నిలిపివేత

Ayodhya Temple: ఈ నెల 24, 25 తేదీల్లో అయోధ్య రాముడి దర్శనం నిలిపివేత post thumbnail image

 
 
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరంలో ఈ నెల 24 సాయంత్రం నుంచి రెండు రోజులపాటు రామ్‌లల్లా దర్శనం ఉండదు. నవంబరు 26 ఉదయం 7.00 గంటలకు దర్శనం పునఃప్రారంభం అవుతుంది. 25న రామమందిర శిఖర ధ్వజారోహణ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసే క్రమంలో భాగంగా రామయ్య దర్శనానికి విరామం ఇచ్చామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. వివాహ పంచమి సందర్భంగా ఈ నెల 25న అయోధ్య రామమందిరంలో ధ్వజారోహణం జరగనుంది. శ్రీరాముడు, సీతమ్మల దివ్య వివాహానికి గుర్తుగా ఈ వేడుకను నిర్వహిస్తారు.
 
పూల అందాలకు మెచ్చి రిజర్వ్ ఫారెస్ట్ ను ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం
 
 
తమిళనాడు ప్రభుత్వం ఓ రకమైన మొక్కలను సంరక్షించడానికి కొండ ప్రాంతం మొత్తాన్ని రిజర్వ్‌ ఫారెస్ట్‌గా ప్రకటించింది. ఎందుకంటే ఆ మొక్కలు తమ జీవితకాలంలో ఒక్కసారే పుష్పిస్తాయి. అదీ.. 8 ఏళ్లకోసారి కావడం విశేషం. నీలగిరి జిల్లా ఊటీ దగ్గర్లో ఉండే గూడలూరులో కురింజి రకం (స్ట్రోబిలాంథెస్‌ సెసిలిస్‌) మొక్కలు ఉంటాయి. వీటికి పూసే పువ్వులను కురింజి అని అంటారు. చూడటానికి ‘గంట’ ఆకృతిలో ఉండే ఈ పూలు ఎక్కువగా ఊదా రంగులో, కొన్ని నీలం, తెలుపు, గులాబీ రంగుల్లో కనిపిస్తుంటాయి. కేవలం నీలగిరిలోనే ఈ తరహాలో 33 రకాలు పుష్పాలు ఉన్నాయి. సెప్టెంబరు-అక్టోబరు సీజన్లలో ఇవి పూస్తుంటాయి. అందుకే గూడలూరు సమీప ప్రాంతాన్ని అక్కడి ప్రభుత్వం అక్టోబరులో రిజర్వ్‌ ఫారెస్ట్‌గా నోటిఫై చేసింది.
The post Ayodhya Temple: ఈ నెల 24, 25 తేదీల్లో అయోధ్య రాముడి దర్శనం నిలిపివేత appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

KCR: కాంగ్రెస్‌ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం – కేసీఆర్KCR: కాంగ్రెస్‌ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం – కేసీఆర్

KCR : కాంగ్రెస్‌ ప్రభుత్వ మోసాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కూడా గడవకుండానే… ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. పల్లెల్లోని రైతులే

పోలవరం ప్రాజెక్ట్ లో పీపీఏ సిఈఓ పర్యటనపోలవరం ప్రాజెక్ట్ లో పీపీఏ సిఈఓ పర్యటన

పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) యోగేష్ పైతాన్కర్ శనివారం సమీక్షించారు. ఢిల్లీ నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనుల సమీక్ష , పరిశీలనకు వచ్చిన ఆయన తొలుత పీ పీ

Al Falah University: ఢిల్లీ పేలుడు ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్‌Al Falah University: ఢిల్లీ పేలుడు ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్‌

    ఎర్రకోట సమీపంలోని జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు డాక్టర్లు హరియాణాలోని ఆల్‌ ఫలాహ్‌ యూనివర్శిటీకి చెందిన వారే కావడం గమనార్హం. అరెస్ట్‌ అయిన ముగ్గురు డాక్టర్లలో డాక్టర్